కథల పండుగ
స్టోరీ ఆర్ట్స్ ఇండియా, నివాసిని పబ్లిషర్స్ సంయుక్తంగా బంజారాహిల్స్ సప్తపర్ణిలో పిల్లలు, పెద్దల కోసం నిర్వహించిన స్టోరీ ఫెస్టివల్ చివరి రోజైన ఆదివారం కూడా విభిన్న అంశాలతో ఉల్లాసంగా సాగింది.
సైన్ లాంగ్వేజ్...
నీతా గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ సెషన్ జరిగింది. బధిరులైన ఆమె తల్లిదండ్రులు గోపాలకృష్ణ, లేఖా గోపాల కృష్ణతో సహా ఆమె ఈ సెషన్లో పాల్గొన్నారు. స్వతహాగా మాట్లాడగలిగిన, వినగలిగిన నీతా... సైన్ లాంగ్వేజ్ ద్వారా ఆ లాంగ్వేజ్‌ను పిల్లలకూ, పెద్దలకూ ఓ కథలా పరిచయుం చేశారు.
ఉర్దూ... బెంగాలీ...
ఫ్రొఫెసర్ ఖాలిద్ ఖేల్ కహావత్ (ఉర్డూ స్టోరీ టెల్లింగ్)లో ఖవ్వాలీ, కథలు, సామెతలు, మంజు దాస్‌గుప్తా బెంగాలీలో వన్ వరల్డ్ మెనీ స్టోరీస్ (బెంగాలీ స్టోరీ టెల్లింగ్), అబ్బారుు- వూమిడి చెట్టు కథను ఉవూ చల్లా ఆసక్తికరంగా చెప్పారు.
పిల్లలు రాసిన పుస్తకం...
‘ఎ బెటర్ వరల్డ్’ పేరుతో 33 మంది (10-15 మధ్య వయస్కులు) చిన్నారులు కలసి రాసిన పుస్తకాన్ని నివాసిని పబ్లిషర్స్ ప్రచురించారు.
ఆటిజంపై...
ఆటిజం అవేర్నెస్ గురించి మాధవి ఆదిమూలం ప్రత్యేక సెషన్ నిర్వహించారు. ఆటిజం పిల్లలు మీ జీవితంలోకి వస్తే వారితో మీరు ప్రేమలో పడిపోతారంటూ సాగిన ఈ సెషన్ విలువైన విషయాలతో సాగింది.
క్రియేటివ్ రైటింగ్...
చెరిల్ రావ్, నందినీరావ్ నిర్వహణలో క్రియేటివ్ రైటింగ్ వర్క్‌షాప్ ఆసక్తికరంగా సాగింది. పిల్లల్లో క్రియేటివ్ రైటింగ్‌ను పెంచేలా ఉన్నారుు. నగరంలో తొలిసారి నిర్వహించిన ఈ తరహా కార్యక్రమం విజయవంతం కావడంతో నిర్వాహకులు దీపాకిరణ్, నివేదిత సంతోషం వ్యక్తం చేశారు. సాక్షి, సిటీ ప్లస్