కథల పండుగ | story festival in saptaparni | Sakshi
Sakshi News home page

కథల పండుగ

Published Mon, Jul 14 2014 3:26 AM | Last Updated on Sat, Sep 2 2017 10:15 AM

కథల పండుగ

కథల పండుగ

స్టోరీ ఆర్ట్స్ ఇండియా, నివాసిని పబ్లిషర్స్ సంయుక్తంగా బంజారాహిల్స్ సప్తపర్ణిలో పిల్లలు, పెద్దల కోసం నిర్వహించిన స్టోరీ ఫెస్టివల్ చివరి రోజైన ఆదివారం కూడా విభిన్న అంశాలతో ఉల్లాసంగా సాగింది.
 
సైన్ లాంగ్వేజ్...
నీతా గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ సెషన్ జరిగింది. బధిరులైన ఆమె తల్లిదండ్రులు గోపాలకృష్ణ, లేఖా గోపాల కృష్ణతో సహా ఆమె ఈ సెషన్‌లో పాల్గొన్నారు. స్వతహాగా మాట్లాడగలిగిన, వినగలిగిన నీతా... సైన్ లాంగ్వేజ్ ద్వారా ఆ లాంగ్వేజ్‌ను పిల్లలకూ, పెద్దలకూ ఓ కథలా పరిచయుం చేశారు.

ఉర్దూ... బెంగాలీ...
ఫ్రొఫెసర్ ఖాలిద్ ఖేల్ కహావత్ (ఉర్డూ స్టోరీ టెల్లింగ్)లో ఖవ్వాలీ, కథలు, సామెతలు, మంజు దాస్‌గుప్తా బెంగాలీలో వన్ వరల్డ్ మెనీ స్టోరీస్ (బెంగాలీ స్టోరీ టెల్లింగ్), అబ్బారుు- వూమిడి చెట్టు కథను ఉవూ చల్లా ఆసక్తికరంగా చెప్పారు.
 
పిల్లలు రాసిన పుస్తకం...
‘ఎ బెటర్ వరల్డ్’ పేరుతో 33 మంది (10-15 మధ్య వయస్కులు) చిన్నారులు కలసి రాసిన పుస్తకాన్ని నివాసిని పబ్లిషర్స్ ప్రచురించారు.  
 
ఆటిజంపై...
ఆటిజం అవేర్‌నెస్ గురించి మాధవి ఆదిమూలం ప్రత్యేక సెషన్  నిర్వహించారు. ఆటిజం పిల్లలు మీ జీవితంలోకి వస్తే వారితో మీరు ప్రేమలో పడిపోతారంటూ సాగిన ఈ సెషన్  విలువైన విషయాలతో సాగింది.
 
క్రియేటివ్ రైటింగ్...
చెరిల్ రావ్, నందినీరావ్ నిర్వహణలో క్రియేటివ్ రైటింగ్ వర్క్‌షాప్ ఆసక్తికరంగా సాగింది. పిల్లల్లో క్రియేటివ్ రైటింగ్‌ను పెంచేలా ఉన్నారుు. నగరంలో తొలిసారి నిర్వహించిన ఈ తరహా  కార్యక్రమం విజయవంతం కావడంతో నిర్వాహకులు దీపాకిరణ్, నివేదిత సంతోషం వ్యక్తం చేశారు.         సాక్షి, సిటీ ప్లస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement