Students Federation of India (SFI)
-
‘జామియా’లో డాక్యుమెంటరీ కలకలం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్’ పేరిట బీబీసీ రూపొందించిన వివాదాస్పద డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు విద్యార్థి సంఘం నాయకులు ఏర్పాట్లు చేయడం ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటలో కలకలం రేపింది. బుధవారం సాయంత్రం 6 గంటలకు ఈ డాక్యుమెంటరీ ప్రదర్శిస్తామని స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) నేతలు ప్రకటించారు. దీంతో పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డాక్యుమెంటరీ ఎందుకొచ్చింది? తిరువనంతపురం: బీబీసీ డాక్యుమెంటరీని కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ తప్పుబట్టారు. ‘జీ20 కూటమికి భారత్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ఇదే సమయానికి బీబీసీ డాక్యుమెంటరీ తేవడం ఏంటి?’ అని ప్రశ్నించారు. -
ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభలు
సాక్షి, హైదరాబాద్: భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) అఖిల భారత 17వ మహాసభలు మంగళవారం నుంచి హైదరాబాద్‌లో జరగనున్నాయి. ఉస్మానియా వర్సిటీ (ఓయూ)లోని ఠాగూర్ ఆడిటోరియంలో ఈ నెల 16 వరకు మహాసభలను నిర్వహిస్తున్నారు. మల్లు స్వరాజ్యం నగ ర్, అభిమన్యు, ధీరజ్, అనీషాన్ ప్రాంగణంలో సభలు జరుగుతాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రసాద్ ఐమ్యాక్స్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు విద్యార్థి కవాతు, ప్రదర్శన ఉంటుంది. అనంతరం... ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వీపీ సాను అధ్యక్షతన పీపుల్స్ ప్లాజాలో జరిగే బహిరంగ సభకు త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ హాజరవుతున్నారు. ఎస్ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మయూఖ్ బిస్వాస్, బాలికల జాతీయ కన్వీనర్ థీఫ్సీతాధర్ తదితరులు పాల్గొంటారు. సాయంత్రం నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ప్రతినిధుల సమావేశాలు ప్రారంభమవుతాయి. 29 రాష్ట్రాల నుంచి 750 మంది ప్రతినిధులతో పాటు క్యూబా, శ్రీలంక తదితర దేశాల నుంచి విద్యార్థి నాయకులు పాల్గొంటారు. మోదీ ప్రభుత్వం రూపొందించిన నూతన విద్యా విధానం, బీజేపీ ప్రభుత్వం తెస్తున్న ప్రజా వ్యతిరేక చట్టాలు, మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేయడం, మతోన్మాదం, విద్య ప్రైవేటీకరణ, విద్యార్థి ఎన్నికలపై నిషేధం తదితర అంశాలపై మహాసభల్లో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్ష, కార్యదర్శులుగా పనిచేసిన నాయకులను ఆహ్వానించడంతో సీతారాం ఏచూరి, నీలోత్పల్ బసు వంటి నేతలు కూడా మహాసభలకు రానున్నారు. సభల ఏర్పాట్లను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోమవారం పరిశీలించారు. -
వయనాడ్‌లో రాహుల్
త్రివేండ్రం/న్యూఢిల్లీ: కేరళ రాష్ట్రం వయనాడ్‌లోని తన కార్యాలయాన్ని వారం క్రితం ధ్వంసం చేసిన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) కార్యకర్తలు పిల్లల్లాంటి వారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ‘ఈ ఘటన దురదృష్టకరం. వారు పిల్లలు. వారిపై ఎలాంటి కోపం, ద్వేషం లేవు. హింస ఏ సమస్యనూ పరిష్కరించజాలదు’అని పేర్కొన్నారు. రాష్ట్రంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం సొంత లోక్‌సభ నియోజకవర్గం వయనాడ్ వెళ్లారు. ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు సృష్టించిన విధ్వంసాన్ని ఆయన పరిశీలించారు. ఈ దాడిలో గాయపడిన పార్టీ కార్యకర్తలను పరామర్శించారు. మరోవైపు, జీఎస్టీపై రాహుల్ మరోసారి మండిపడ్డారు. ‘‘మా హయాంలో జీఎస్టీ నిజమైన సాధారణ పన్ను విధానం కాగా, బీజేపీ ప్రభుత్వం దానిని గబ్బర్‌సింగ్ ట్యాక్స్‌గా మార్చేసింది’’ అంటూ ట్వీట్ చేశారు. జీఎస్టీ భారం కారణంగా దేశంలో వ్యాపారాలు ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల నిర్వహణ కష్టసాధ్యంగా మారిందన్నారు. తాము అధికారంలోకి వస్తే జీఎస్టీ 2.0 ద్వారా చాలా సాధారణమైన, తక్కువ పన్ను విధానాన్ని తీసుకువస్తామని, రాబడిని అన్ని రాష్ట్రాలకు సమానంగా పంచుతామని వెల్లడించారు. ‘‘గబ్బర్ సింగ్ ట్యాక్స్ అమల్లోకి వచ్చిన 1,826 రోజుల్లో 6 రకాల రేట్లు, 1,000పైగా మార్పులు జరిగాయి. ఇదా సులభతరం? ఈ తప్పుడు విధానాలు ఆర్థిక వ్యవస్థకు, దేశంలోని పరిశ్రమలకు చేటు తెచ్చాయి’’అని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి
ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు శివదాసన్ కరీంనగర్: విద్యను వ్యాపారంగా మారిస్తే సహించేది లేదని, విద్యావ్యాపారాన్ని అరికట్టేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) జాతీయ అధ్యక్షుడు శివదాసన్ అన్నారు. కరీంనగర్‌లోని కళాభారతి ఆడిటోరియంలో శనివారం ‘విద్యారంగం-సవాళ్లు’ అనే ఆంశంపై నిర్వహించిన రాష్ర్టస్థాయి వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాల కారణంగా విద్యారంగం వ్యాపారమయం అవుతోందన్నారు. బడ్జెట్లో విద్యారంగానికి సరైన నిధులు కేటాయించకుండా వివక్ష చూపడం సమంజసం కాదన్నారు. అడ్డుకునేందుకు విద్యార్థిలోకం పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.