విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి
ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు శివదాసన్
కరీంనగర్: విద్యను వ్యాపారంగా మారిస్తే సహించేది లేదని, విద్యావ్యాపారాన్ని అరికట్టేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) జాతీయ అధ్యక్షుడు శివదాసన్ అన్నారు. కరీంనగర్‌లోని కళాభారతి ఆడిటోరియంలో శనివారం ‘విద్యారంగం-సవాళ్లు’ అనే ఆంశంపై నిర్వహించిన రాష్ర్టస్థాయి వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాల కారణంగా విద్యారంగం వ్యాపారమయం అవుతోందన్నారు. బడ్జెట్‌లో విద్యారంగానికి సరైన నిధులు కేటాయించకుండా వివక్ష చూపడం సమంజసం కాదన్నారు. అడ్డుకునేందుకు విద్యార్థిలోకం పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.