పెప్పర్ స్ప్రే అమ్మకాలు పెరిగాయి
మెయింజ్: జర్మనీలోని కోలోగ్నిలో నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా స్థానికులపై మూకుమ్మడి రేపులు జరిగిన నాటి నుంచి దేశంలో పెప్పర్ స్ప్రేలు, ఆత్మరక్షణ ఆయుధాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని జర్మనీ అధికారులు, పారిశ్రామిక వర్గాలు వెల్లడించాయి. సీఎస్ గ్యాస్ స్ప్రే, స్టన్ గన్లకు కూడా యమ గిరాకీ ఉందని, ఆ రోజు నుంచి సాధారణ అమ్మకాలకన్నా వీటి అమ్మకాలు రెండింతలు పెరిగాయని ఆ వర్గాలు వివరించాయి. ఆ రోజు జరిగిన మూకుమ్మడి రేప్‌లు, దోపిడీలకు సంబంధించి మొత్తం 670 కేసులు నమోదుకాగా వాటిలో రేప్ కేసులో 350 ఉన్నాయి.