stylish star
-
కొండాకోనల్ల నడుమ సేద తీరుతున్న అల్లు అర్జున్ ఫ్యామిలీ (ఫోటోలు)
-
మీ అందరికి రుణపడి ఉంటా.. అల్లు అర్జున్ ఎమోషనల్ ట్వీట్
సరిగ్గా 18 ఏళ్ల క్రితం.. యావరేజ్ లుక్స్‌తో, మూతిపై మీసం కూడా సరిగ్గా మొలవని ఓ యువకుడు టాలీవుడ్లోకి కథానాయకుడిగా ఆరంగ్రేటం చేశాడు. మెగా ఫ్యామిలీ హీరోగా కెరీర్ మొదలుపెట్టినప్పటకీ ఆ మార్క్‌తో సంబంధం లేకుండా స్వయం కృషితో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. టాలీవుడ్ లో ఫ్యాషన్, స్టైల్ కు కేరాఫ్ అడ్రెస్‌గా మారాడు. అతడే మన ‘స్టైలిష్ స్టార్’ అల్లు అర్జున్. బన్నీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నేటికి 18 సంవత్సరాలు పూర్తయ్యాయి.ఈ సందర్భంగా అల్లు అర్జున్ ట్వీటర్లో ఒక ఎమోషనల్ పోస్ట్ ను పెట్టాడు. “నా మొదటి సినిమా వచ్చి 18 ఏళ్ళు అయ్యింది. ఈ సుదీర్ఘ సినీ ప్రయాణంలో మొదటి నుంచి నాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను, నా గుండె నిండా వారందరి పట్ల కృతజ్ఞత ఉందని, ఇన్నేళ్ళుగా నాపై వారందరు కురిపించిన ప్రేమకు రుణపడి ఉంటానని” తెలియజేస్తూ బన్నీ తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టాడు. కాగా, మార్చి 28న దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తో చేసిన “గంగోత్రి” లో హీరోగా పరిచయమైన బన్ని, ఆ చిత్రం విడుదలకు ముందు తన లుక్స్‌పై అప్పట్లో గుసగుసలు వినబడ్డాయి. వాటన్నింటిని అధిగమిస్తూ అనతి కాలంలోనే అంచెలంచెలుగా ఎదిగి అపారమైన అభిమానాన్ని, స్టైలిష్ స్టార్ బిరుదుని సొంతం చేసుకున్నాడు. యూత్ ఐకాన్‌గా నిలిచాడు. నాటి ‘గంగ్రోతి’ మొదలు నిన్నటి ‘అల వైకుంఠపురములో’ వరకు హీరో స్థాయి నుంచి స్టార్ హీరో స్టేటస్‌ను సంపాదించాడు. బన్నీ ‘అల వైకుంఠపురములో’, సుకుమార్ ‘రంగస్థలం’ చిత్రాలు బ్లాక్ బస్టర్ కావడంతో ప్రస్తుతం వీరి కాంబినేషన్లో హ్యాట్రిక్ చిత్రంగా వస్తున్న “పుష్ప” పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ చిత్రం పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ( చదవండి : అల్లు అర్జున్ మల్టీప్లెక్స్.. ఓపెనింగ్ ఎప్పుడంటే! ) It’s has been 18years since my first film released. I wanted to thank each n everyone who has been a part of my 18years journey. My heart is filled with gratitude. I am truly blessed for all the love showered over the years . Thank you for all the blessings. Gratitude. AA — Allu Arjun (@alluarjun) March 28, 2021 -
స్టైలిష్ విలన్...
మన మార్కు సంప్రదాయ విలన్లు మనకు దూరమై ఇప్పుడు సరికొత్త విలన్లు వస్తున్నారని కొన్ని సినిమాలలో విలన్ క్యారెక్టర్లను చూస్తే సులభంగా అర్థమైపోతుంది. ‘ఖైదీ నంబర్:150 కూడా ఇలాంటి చిత్రమే.పేదవాళ్లను నైసుగా మోసం చేసే నక్క తెలివితేటలు ఉన్న ఎం.ఎన్.సి. యజమాని అగర్వాల్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు తొలి పరిచయం అయ్యాడు తరుణ్ అరోరా. స్టైలిష్‌గా కనిపిస్తూనే క్రూరత్వాన్ని ప్రదర్శించే పాత్రలో నటించి ‘ఉత్తమ విలన్ నిపించుకున్నాడు.రంజీవి సెకండ్ ఇన్నింగ్స్ సినిమా ‘ఖైదీ నం: 150లో చిన్న పాత్ర దొరికినా గొప్పే అనుకునే పరిస్థితుల్లో ‘ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ ఎవరిని వరిస్తుంది? అనే ఆసక్తి నెలకొని ఉండేది. అలాంటి ఆసక్తికర సమయాల్లో తరుణ్ అరోరా పేరు వినిపించింది. ‘ఖైదీనం:150లో విలన్ క్యారెక్టర్ అంటే ఎన్నో అంచనాలు ఉంటాయి. వాటికి న్యాయం చేస్తూ ‘ఉత్తమ విలన్ అనిపించుకున్నాడు తరుణ్ అరోరా. పంజాబీ అయిన అరోరా పెరిగింది మాత్రం అస్సాంలో.బెంగళూరులో ‘హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్న రోజుల్లో మోడలింగ్ చేశాడు తరుణ్ అరోరా. ‘ప్యార్ మే కభీ కభీ సినిమాతో యాక్టింగ్ కెరీర్ మొదలుపెట్టాడు. ‘జబ్ వుయ్ మెట్ తరువాత అవకాశాలు వెల్లువెత్తాయిగానీ అన్నీ ఒకే మూసలో ఉన్నాయి. దీంతో బెంగళూరుకు వెనక్కి వచ్చాడు. అక్కడ ఆయనకో రెస్టారెంట్ ఉంది. ఆ సమయంలోనే ‘కనితన్ అనే తమిళ సినిమాలో విలన్ పాత్ర వెదుక్కుంటూ వచ్చింది. ‘మా హీరో చాక్లెట్ బాయ్ కదా అన్నారు కో ఆర్డినేటర్లు.అయితే అక్కడ కావల్సింది మాంచి శరీరదారుఢ్యంతో ఉన్న సై్టలిష్ విలన్. దీనికి తరుణ్ అరోరా పక్కాగా సరిపోయాడు. ఫేక్ సర్టిఫికెట్ల ధందా నిర్వహించే తురా సర్కార్‌గా తొలిసారిగా కనితన్లో విలన్‌గా కనిపించాడు. ఈ పాత్ర కోసం 7 కిలోలు బరువు కూడా పెరిగాడు.తురా సర్కార్ తక్కువగా మాట్లాడతాడు. అందుకే డైలాగులు కూడా చిన్నవిగానే ఉండేవి. వాటిని అసిస్టెంట్ çసహకారంతో నేర్చుకునేవాడు. ‘జబ్ వుయ్ మెట్ సినిమాలో నటిస్తున్నప్పుడు టేకుల మీద టేకులు తీసుకునేవాడు తరుణ్. అయినప్పటికీ ఆ సినిమా డైరెక్టర్ ఇంతియాజ్ అలీ విసుక్కోకుండా అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్లు నటన గురించి చెప్పేవాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా తరుణ్ అరోరాకు ఫిల్మ్ మేకింగ్‌లో భిన్నమైన కోణాలను పాఠాలుగా నేర్పించింది.‘ఖైదీనంబర్:150, కాటమరాయుడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన తరుణ్ అరోరా అందాల నటి అంజలా జవేరీ భర్త. -
టాలీవుడ్ హాట్ హాట్.. సిప్ సిప్ గాసిప్
-
రామ్ చరణ్ బాటలో స్టైలిష్ స్టార్