స్టైలిష్ విలన్‌... | Stailis Villain : 150 movie | Sakshi
Sakshi News home page

స్టైలిష్ విలన్‌...

Published Sun, Jun 18 2017 12:44 AM | Last Updated on Tue, Sep 5 2017 1:52 PM

స్టైలిష్ విలన్‌...

స్టైలిష్ విలన్‌...

మన మార్కు సంప్రదాయ విలన్‌లు మనకు దూరమై ఇప్పుడు సరికొత్త విలన్‌లు వస్తున్నారని కొన్ని సినిమాలలో విలన్‌ క్యారెక్టర్‌లను చూస్తే సులభంగా అర్థమైపోతుంది. ‘ఖైదీ నంబర్‌:150 కూడా ఇలాంటి చిత్రమే.పేదవాళ్లను నైసుగా మోసం చేసే నక్క తెలివితేటలు ఉన్న ఎం.ఎన్‌.సి. యజమాని అగర్వాల్‌ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు తొలి పరిచయం అయ్యాడు తరుణ్‌ అరోరా.  స్టైలిష్గా కనిపిస్తూనే క్రూరత్వాన్ని ప్రదర్శించే పాత్రలో నటించి ‘ఉత్తమ విలన్‌ నిపించుకున్నాడు.రంజీవి సెకండ్‌ ఇన్నింగ్స్‌ సినిమా ‘ఖైదీ నం: 150లో చిన్న పాత్ర దొరికినా గొప్పే అనుకునే పరిస్థితుల్లో ‘ఈ సినిమాలో విలన్‌ క్యారెక్టర్‌ ఎవరిని వరిస్తుంది? అనే ఆసక్తి నెలకొని ఉండేది. అలాంటి ఆసక్తికర సమయాల్లో తరుణ్‌ అరోరా పేరు వినిపించింది.

‘ఖైదీనం:150లో విలన్‌ క్యారెక్టర్‌ అంటే ఎన్నో అంచనాలు ఉంటాయి. వాటికి న్యాయం చేస్తూ ‘ఉత్తమ విలన్‌ అనిపించుకున్నాడు తరుణ్‌ అరోరా. పంజాబీ అయిన అరోరా పెరిగింది మాత్రం అస్సాంలో.బెంగళూరులో ‘హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేస్తున్న రోజుల్లో మోడలింగ్‌ చేశాడు తరుణ్‌ అరోరా. ‘ప్యార్‌ మే కభీ కభీ సినిమాతో యాక్టింగ్‌ కెరీర్‌ మొదలుపెట్టాడు. ‘జబ్‌ వుయ్‌ మెట్‌ తరువాత అవకాశాలు వెల్లువెత్తాయిగానీ అన్నీ ఒకే మూసలో ఉన్నాయి.

దీంతో బెంగళూరుకు వెనక్కి వచ్చాడు. అక్కడ ఆయనకో రెస్టారెంట్‌ ఉంది. ఆ సమయంలోనే ‘కనితన్‌ అనే తమిళ సినిమాలో విలన్‌ పాత్ర వెదుక్కుంటూ వచ్చింది. ‘మా హీరో చాక్‌లెట్‌ బాయ్‌ కదా అన్నారు కో ఆర్డినేటర్లు.అయితే అక్కడ కావల్సింది మాంచి శరీరదారుఢ్యంతో ఉన్న సై్టలిష్‌ విలన్‌. దీనికి తరుణ్‌ అరోరా పక్కాగా సరిపోయాడు. ఫేక్‌ సర్టిఫికెట్ల ధందా నిర్వహించే తురా సర్కార్‌గా తొలిసారిగా కనితన్లో విలన్‌గా కనిపించాడు. ఈ పాత్ర కోసం 7 కిలోలు బరువు కూడా పెరిగాడు.తురా సర్కార్‌ తక్కువగా మాట్లాడతాడు. అందుకే డైలాగులు కూడా చిన్నవిగానే ఉండేవి. వాటిని అసిస్టెంట్‌ çసహకారంతో నేర్చుకునేవాడు.

‘జబ్‌ వుయ్‌ మెట్‌ సినిమాలో నటిస్తున్నప్పుడు టేకుల మీద టేకులు తీసుకునేవాడు తరుణ్‌. అయినప్పటికీ ఆ సినిమా డైరెక్టర్‌ ఇంతియాజ్‌ అలీ విసుక్కోకుండా అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్లు నటన గురించి చెప్పేవాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా తరుణ్‌ అరోరాకు ఫిల్మ్‌ మేకింగ్‌లో భిన్నమైన కోణాలను పాఠాలుగా నేర్పించింది.‘ఖైదీనంబర్‌:150, కాటమరాయుడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన తరుణ్‌ అరోరా అందాల నటి అంజలా జవేరీ భర్త.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement