sub-elections
-
నెల్లై ఏకగ్రీవం
- మేయర్ అభ్యర్థి భువనేశ్వరి ఎన్నిక - నామినేషన్ ఉపసంహరణతో ఖంగుతిన్న బీజేపీ - శంకరన్ కోవిల్ సైతం ఏకగ్రీవం సోమవారం మధ్యాహ్నం ఈ విషయాన్ని ప్రకటించారు. అలాగే శంకరన్‌కోవిల్ మునిసిపాలిటీ అన్నాడీఎంకే చైర్పర్సన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యూరు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కోయంబత్తూరు, తిరునెల్వేలీ, తూత్తుకూడి కార్పొరేషన్లకు, అరక్కోణం, విరుదాచలం, కడలూరు, పుదుకోట్టై, రామనాథపురం, కోడెకైనాల్, కున్నూరు, శంకరన్‌కోవిల్ మునిసిపాలిటీలకు ఈనెల 18న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికలకు సంబంధించి గత నెల 28న ప్రారంభమైన నామినేషన్ల పర్వం ఈనెల 4వ తేదీతో ముగిసింది. తిరునెల్వేలీ స్థానానికి అన్నాడీఎంకే అభ్యర్థిగా భువనేశ్వరి, బీజేపీ అభ్యర్థిగా వెల్లయమ్మాళ్తోపాటూ మొత్తం 13 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. అయితే 11 మంది స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురికావడంతో రంగంలో కేవలం అన్నాడీఎంకే, బీజేపీ అభ్యర్థులే నిలిచారు. బీజేపీ బ్యాక్: స్థానిక సమరంలో అన్నాడీఎంకే, బీజేపీల మధ్య ప్రత్యక్ష పోరు సాగుతుందని భావించారు. తన పేరును అమ్మ ప్రకటించగానే భువనేశ్వరి ప్రచారాన్ని ప్రారంభించేశారు. అయితే బీజేపీ అభ్యర్థి వెల్లయమ్మాళ్ ఆదివారం వరకు ప్రచారం జోలికి పోలేదు. కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ ఈనెల 10వ తేదీన తిరునెల్వేలీకి చేరుకుని బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తారని చెప్పుకున్నారు. అయితే నాటకీయంగా సోమవారం ఎన్నికల అధికారిని కలుసుకున్న బీజేపీ అభ్యర్థి వెల్లయమ్మాళ్ తన నామినేషన్‌ను ఉపసంహరించారు. ఈ విషయం బీజేపీ శ్రేణుల్లో కంగారు పుట్టించింది. పోటీల్లో ఉన్న ఇద్దరిలో ఒకరు ఉపసంహరించుకున్నందున అన్నాడీఎంకే మేయర్ అభ్యర్థి భువనేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారి లక్ష్మీ ప్రకటించారు. తిరునెల్వేలీ జిల్లాలో బీజేపీ రెండు వర్గాలుగా చీలిపోగా ఒకదానికి ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్, మరో వర్గానికి మాజీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ సారథ్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఇరువర్గాల మధ్య నలిగిపోలేకనే పోటీ నుంచి వెల్లయమ్మాళ్ తప్పుకున్నట్లు భావిస్తున్నారు. తమ అభ్యర్థిని అధికార పక్షంవారు బెదిరించి ఏకగ్రీవం చేసుకున్నారని తమిళిసై ఆరోపించారు. అధికారులు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించకుండా ప్రతిపక్షాలకు హితవు పలుకుతున్నారని తప్పుపట్టారు. అనేకచోట్ల బీజేపీ అభ్యర్థులు కిడ్నాపులకు గురవుతున్నారని తమిళిసై ఆరోపించారు. ఎన్నికుయుక్తులు పన్నినా బీజేపీ వెరవదని ఆమె అన్నారు. శంకరన్ కోవిల్ మునిసిపాలిటీ మేయర్ అభ్యర్థిగా రంగంలో ఉన్న రాజ్యలక్ష్మి (అన్నాడీఎంకే) ఏకగ్రీవంగా ఎన్నుకయ్యూరు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రేవతి, స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. నామినేషన్ల ఉపసంహరణ దినమైన సోమవారం నాడు కాంగ్రెస్, స్వతంత్య్ర అభ్యర్థులు ఇద్దరు తమ నామినేషన్లను వాపస్ తీసుకోగా మేయర్ కుర్చీ అధికార పార్టీ పరమైంది. చెన్నై నగరంలో తాంబరం, పల్లవరం వార్డులు అన్నాడీఎంకేకు ఏకగ్రీవమయ్యరు. -
కాంగ్రెస్, బీజేపీ ఓటమి ఖాయం
- కార్యకర్తల సమావేశంలో మంత్రి మహేందర్‌రెడ్డి - మంత్రి హరీష్‌రావు సమక్షంలో పార్టీలో చేరిన నేతలు సాక్షి, సంగారెడ్డి: మెదక్ లోక్‌సభకు జరిగే ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ పార్టీ అభ్యర్థులు ఓటమి చెందడం ఖాయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం సంగారెడ్డిలో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం రాజయ్య, మంత్రి హరీష్‌రావు, ఎంపీలు బీబీపాటిల్, బాల్కసుమన్, ఎమ్మెల్యేలు బాబూమోహన్, గువ్వల బాలరాజు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ మెదక్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులే కరువయ్యారన్నారు. తమ పార్టీ అభ్యర్థి కొత్తా ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పార్టీ కార్యకర్తలను కోరారు. ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రజలకు సేవచేసేందుకు సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఎన్నికల బరిలో నిలిచినట్లు తెలిపారు. తనను గెలిపిస్తే ప్రజాసమస్యలు పరిష్కరించటంతోపాటు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఎంపీ బాల్కసుమన్ మాట్లాడుతూ ఈ ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలను పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన పనిలేదన్నారు. బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి మాటలను ప్రజలు విశ్వసించరన్నారు. సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో జరుగుతున్న ఈఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పాలన ఫలితంగానే రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తమ ప్రభుత్వం కాంగ్రెస్ పాపాలను కడిగే ప్రయత్నం చేస్తోందన్నారు. ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ కొత్త ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్లో చేరిన నరేంద్రనాథ్ మాట్లాడుతూ కేసీఆర్, హరీష్‌రావు తనకు గతంలో ఎంత నచ్చజెప్పినా వినకుండా బీజేపీ నుంచి పోటీచేసి అన్నివిధాలా నష్టపోయానన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తనను ఉపయోగించుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కానుక ఇద్దాం: బాబూమోహన్ మెదక్ ఎంపీ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుక ఇద్దామని ఎమ్మెల్యే బాబూమోహన్ పేర్కొన్నారు. రేపటి నుంచి తాను గ్రామాల్లో పర్యటించి కాంగ్రెస్, బీజేపీ నాటకాలను బయటపెడతానన్నారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి పార్టీని గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డిని ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో సంగారెడ్డిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణద్రోహికి టికెట్ ఇచ్చిన బీజేపీకి ఉప ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు. సమావేశంలో జిల్లా ఇన్చార్జి రాజయ్య యాదవ్ టీఆర్ఎస్ జిల్లా నాయకులు ఎం.ఎ.హకీం, విజయేందర్‌రెడ్డి, జలాలుద్దీన్‌బాబా, మందుల వరలక్ష్మి, నియోజకవర్గ నాయకులు రాంరెడ్డి, శ్రీనివాస్‌చారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు సమక్షంలో సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన పలువురు ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరారు. -
హస్తం హవా
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో ప్రతిపక్ష జేడీఎస్‌కు పెట్టని కోటల్లా ఉన్న బెంగళూరు గ్రామీణ, మండ్య లోక్‌సభ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఆ రెండు స్థానాలకు బుధవారం ఉప ఎన్నికలు జరుగగా, శనివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఆది నుంచీ కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యతను సాధిస్తూనే వచ్చారు. బెంగళూరు గ్రామీణలో కాంగ్రెస్ అభ్యర్థి డీకే. సురేశ్, జేడీఎస్ అభ్యర్థి అనితా కుమారస్వామిని 1,37,000 ఓట్ల తేడాతో ఓడించారు. సురేశ్‌కు 5,78,596 ఓట్లు, అనితా కుమారస్వామికి 4,41,600 ఓట్లు లభించాయి. మండ్యలో కాంగ్రెస్ అభ్యర్థి, సినీ నటి రమ్య చేతిలో జేడీఎస్ అభ్యర్థి సీఎస్. పుట్టరాజు 67,611 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. రమ్యకు 4,84,085 ఓట్లు, పుట్టరాజుకు 4,16,474 ఓట్లు లభించాయి. జేడీఎస్‌కు చెందిన మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ మంత్రి ఎన్. చలువరాయస్వామిల రాజీనామాతో ఉప ఎన్నికలు జరిగాయి. వారిద్దరూ గత ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికయ్యారు. సిద్ధుకు మరింత బలం ఈ ఉప ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను పార్టీలో మరింత బలవంతుడిని చేశాయి. అన్ని రాజకీయ పార్టీలు రానున్న సార్వత్రిక ఎన్నికలకు ఈ ఉప ఎన్నికలను సెమీ ఫైనల్స్‌గా భావించాయి. సిద్ధరామయ్య వంద రోజుల పాలనపై కూడా ఈ ఫలితాలను తీర్పుగా అభివర్ణించాయి. దీంతో ఆయన అభ్యర్థుల ఎంపిక సమయం నుంచే జాగ్రత్త పడ్డారు. పార్టీలో అందరినీ ఏకతాటిపై నడిపించారు. మంత్రి పదవి రాకపోవడంతో అలిగి కూర్చున్న మాజీ మంత్రి డీకే. శివకుమార్‌ను బుజ్జగించే చర్యల్లో భాగంగా ఆయన తమ్ముడినే పార్టీ అభ్యర్థిగా అధిష్టానం చేత ఖరారు చేయించారు. జేడీఎస్ అధినేత దేవెగౌడ కుటుంబీకులకు శివకుమార్ రాజకీయంగా ఆగర్భ శత్రువు. ఆయన మద్దతు లేనిదే కాంగ్రెస్ గట్టెక్కడం కష్టమని భావించిన ముఖ్యమంత్రి గెలుపు భారాన్ని ఆయనపైనే మోపారు. ఇక మండ్యలో సుమారు 60 శాతం మంది దాకా దేవెగౌడ సామాజిక వర్గమైన ఒక్కలిగులు ఉన్నారు. లోక్‌సభ నియోజక వర్గంలోని ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను ఐదింటిలో జేడీఎస్ ఎమ్మెల్యేలున్నారు. ఈ నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన గృహ నిర్మాణ శాఖ మంత్రి అంబరీశ్‌కు ప్రచార బాధ్యతలను అప్పగించారు. అదే జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం. కృష్ణతో అంబరీశ్‌కు విభేదాలున్నాయి. కృష్ణకు ఆమోదయోగ్యంగా ఉంటుందని రమ్యను అభ్యర్థిగా ఖరారు చేయించారు. దీంతో ఇద్దరూ ఇష్టం లేకపోయినా పార్టీ అభ్యర్థి కోసం ప్రచారం చేయాల్సి వచ్చింది. అయితే ఇద్దరూ ఒకే వేదిక ఎక్కకుండా జాగ్రత్త పడ్డారు. అన్నిటికీ మించి అధికారం చేపట్టిన వెంటనే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలకు తోడు పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం కర్ణాటకపై గట్టి అంచనాలను పెట్టుకుని ఉంది. ఈ సత్యాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి విజయం కోసం చక్కటి వ్యూహాన్ని రూపొందించి, పకడ్బందీగా అమలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే కావస్తున్నందున, జేడీఎస్ అభ్యర్థులను గెలిపిస్తే ప్రయోజనమేమిటనే ఓటరు తర్కం కూడా అంతిమంగా అధికార పార్టీ అభ్యర్థుల మెడలో విజయ మాల పడేలా చేసింది. వ్రతం చెడ్డా.... ఉప ఎన్నికల్లో విజయం కోసం లౌకిక వాదాన్ని కాసేపు పక్కన పెట్టి బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగినా జేడీఎస్ విజయం సాధించలేక పోయింది. వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదన్నట్లుగా ఆ పార్టీ పరిస్థితి తయారైంది. బెంగళూరు గ్రామీణ నియోజక వర్గంలోని రామనగర, చన్నపట్టణ అసెంబ్లీ సెగ్మెంట్లలో పెద్ద సంఖ్యలో మైనారిటీ ఓటర్లు ఉన్నారు. జేడీఎస్‌ను ఆది నుంచీ వారు ఆదరిస్తూనే వస్తున్నారు. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీతో జట్టు కట్టడంతో ఆ పార్టీకి దూరమయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి డీకే. సురేశ్‌కు లభించిన భారీ మెజారిటీ ఈ మర్మాన్ని చెప్పకనే చెబుతోంది. ‘మీరు గత ఎన్నికల్లో కుమారస్వామిని గెలిపిస్తే ఒక నాడైనా లోక్‌సభకు వెళ్లారా. ఆయనే వెళ్లనప్పుడు ఆయన సతీమణి వెళతారని ఊహించగలమా? జేడీఎస్‌లో దేవెగౌడ కుటుంబ పెత్తనం ఎక్కువ అని అంటే ఆ పార్టీ నాయకులకు మా చెడ్డ కోపం వస్తుంది. అనితా కుమారస్వామి మినహా వేరే అభ్యర్థి ఆ పార్టీలో లేరా. కుమారస్వామి అధికార దాహం వల్ల కేవలం స్వల్ప కాలానికి ఈ ఉప ఎన్నికలు వచ్చి పడ్డాయి’ అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన ప్రచారం ఓటర్లలో తారక మంత్రంలా పని చేసింది. రెంటికీ చెడ్డ రేవడి మొన్నటి దాకా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ ఉప ఎన్నికల్లో రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. మండ్యలో ఆ పార్టీకి పెద్దగా ఉనికి లేనప్పటికీ, బెంగళూరు గ్రామీణలో పట్టుంది. ఓ అసెంబ్లీ సెగ్మెంట్లో పార్టీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో రెండు లక్షలు దాకా ఓట్లు పోలయ్యాయి. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడానికి బీజేపీ సన్నాహాలు చేస్తున్న తరుణంలో ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడం పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఉమ్మడిగా ఎదుర్కొన్నా కాంగ్రెస్‌ను ఓడించలేక పోయిందని అపహాస్యానికి గురైంది.