పీఎస్ లో నిందితుడి అనుమానాస్పద మృతి
మిర్యాలగూడ : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో విచారణలో ఉన్న అంతర్ రాష్ట్ర దొంగ అనుమానస్పద స్థితిలో మృతి చెందడం సంచలనానికి దారి తీసింది. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం సుబ్బారావుపేట గ్రామానికి చెందిన మార్నిడి చక్రధర్‌రావుకు పలు చోరీ కేసుల్లో పాత్ర ఉందంటూ వన్‌టౌన్ పోలీసులు ఈ నెల 22న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
శనివారం ఉదయం కస్టడిలోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే, అర్ధరాత్రి సమయంలో చక్రధర్‌రావు సొమ్మసిల్లి పడిపోగా పోలీసులు హుటాహుటిన స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అతడు గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు తెలుపగా... విచారణలో భాగంగా పోలీసులు నిందితుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఉంటారని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.