వింజమూరులో దారుణం
వింజమూరు: నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలోని టీచర్స్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. సుబ్బరత్తమ్మ, పొలిమేర సుబ్బమ్మ అనే ఇద్దరు మహిళలపై ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో సుబ్బరత్తమ్మ(41) అక్కడికక్కడే మృతి చెందగా.. సుబ్బమ్మకు తీవ్రగాయాలయ్యాయి. కొన ఊపిరితో ఉన్న సుబ్బమ్మను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఆస్తి తగాదాల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు సుబ్బమ్మ అల్లుడు, ప్రత్యక్ష సాక్షి వెంగల్ రెడ్డి తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కోడూరు పెద్ద నాగిరెడ్డి, కోడూరు చిన్న నాగిరెడ్డ్డి, సుంకిరెడ్డి నాగిరెడ్డి అనే ముగ్గురు దాడికి పాల్పడ్డినట్టు గుర్తించారు.