విద్యుదాఘాతానికి గురై ఎలక్ట్రీషియన్ మృతి
టి.నరసాపురం : బందంచర్ల గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్ ఎస్కే సుభానీ(37) విద్యుదాఘాతానికి గురై శనివారం మృతిచెందాడు. స్థాని కుల కథనం ప్రకారం సుభానీ పదేళ్లుగా రాజుపోతేపల్లిలో నివా సం ఉంటూ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నా డు. శనివారం రాజుపోతేపల్లిలోని పొలంలో మోటార్‌ను బాగుచేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. అతనిని స్థానికులు చింతలపూడి ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో మృతిచెందాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు, భార్య ఉన్నారు.