success mantra to students
-
సక్సెస్ మంత్ర ఎంతో ఉపయోగం
ఒంగోలు : పదో తరగతి పూర్తి చేసి ఇంటర్లో చేరబోయే విద్యార్థులకు బ్రిలియంట్ సంస్థ రూపొందించిన సక్సెస్ మంత్ర ఎంతగానో ఉపయోగపడుతుందని స్టెప్ సీఈఓ డాక్టర్ బి.రవి అన్నారు. ఆదివారం స్థానిక బ్రిలియంట్ కంప్యూటర్స్ సంస్థ ఆవరణలో బ్రిలియంట్ సంస్థ నిర్వహించిన సక్సెస్ మంత్ర వర్క్‌షాప్‌కు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సక్సెస్ మంత్ర పేరుతో రూపొందించిన టెక్–10 విద్యార్థుల జీవితాలను మలుపు తిప్పుతుందన్నారు. ప్రస్తుతం ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎక్కువుగా జరుగుతున్నందు వల్ల ఇటువంటి వర్క్‌షాప్‌లు ఎంతగానో దోహదపడుతున్నాయన్నారు. బ్రిలియంట్ సంస్థల చైర్మన్ డాక్టర్ షేక్ న్యామతుల్లాబాషా మాట్లాడుతూ తమ సంస్థ విద్యార్థులకు వేసవిలో ఈ ఏడు అందించే అదనపు ఉచిత సేవా కార్యక్రమాల్లో భాగంగానే ఈ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నామన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ లైఫ్ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాంకు ఆథరైజ్డ్ సెంటర్ అని, ఈ ప్రోగ్రాంలో పదో తరగతి ఆపై విద్యార్థులకు వ్యక్తిత్వ, విద్యా సంబంధ విషయాల్లో విశ్వ విద్యాలయ ప్రొఫెసర్లచే శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం ద్వారా విద్యార్థులు చిన్నవయస్సులలోనే యూనివర్శిటీ సర్టిఫికేట్‌ను పొందడమే గాక తమ కెరీర్ ఎలా మలుచుకోవాలి, సమాజం , తల్లిదండ్రులపై బాధ్యతగా ఎలా ఉండాలి అనే అంశాలు పూర్తిగా ఉచితంగా నేర్పడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో భాగంగా వచ్చే ఆదివారం పదో తరగతి, ఇంటర్ పూర్తయిన విద్యార్థినీ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్‌పై ఉచిత వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర అదనపు డీజీపీ కిషోర్‌కుమార్ తదితర అనుభవజ్ఞులు హాజరై మార్గదర్శకం చేస్తారన్నారు. అనంతరం సక్సెస్ మంత్ర అంశంపై నేషనల్ ట్రైనర్ రవికాంత్ హాజరైన విద్యార్థులకు అవగాహన కల్పించారు. -
విద్యార్థులకు సీఎం విజయమంత్రం
ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అధ్యాపకుడి అవతారం ఎత్తారు. కరేజ్, కన్విక్షన్, కమిట్మెంట్ అనే మూడు 'సి'లతో కూడిన విజయమంత్రాన్ని విద్యార్థులకు బోధించారు. జీవితంలో విజయం సాధించాలంటే ఈ మూడు పదాలు తప్పనిసరిగా అవసరమని ఆయన చెప్పారు. రాష్ట్రస్థాయి విద్యార్థుల సదస్సులో మాట్లాడిన పట్నాయక్.. విద్యార్థులకు జీవిత పాఠాలు బోధించారు. ఏదైనా ఒక అంశానికి కట్టుబడి ఉంటే.. నిబద్ధత, ధైర్యాలతో ముందుకెళ్లాలని, అప్పుడు తప్పనిసరిగా జీవితంలో విజయం సాధించి తీరుతారని ఆయన అన్నారు. బిజూ జనతాదళ్ (బీజేడీ) విద్యార్థి విభాగం ఈ సదస్సును నిర్వహించింది. విద్యార్థులు, యువత భాగస్వామ్యంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి విద్యార్థులకు తెలిపారు. గతంలో రాష్ట్రంలో నెలకొన్న కరువు గురించి ప్రస్తావిస్తూ.. ఒడిషాకు ప్రకృతి విపత్తులు కొత్తేమీ కాదని ఆయన తెలిపారు. వరదలు, తుపాన్లు, కరువు లాంటి పరిస్థితులను వరుసపెట్టి గత 15 ఏళ్లుగా ఎదుర్కొంటూనే ఉన్నామని, ప్రస్తుత కరువు పరిస్థితిని అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని పట్నాయక్ చెప్పారు.