ఎస్యూడీలో వాటా విక్రయించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా
18 శాతం వాటా రూ.540 కోట్లకు అమ్మకం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. తన జాయింట్ వెంచర్ జీవిత బీమా కంపెనీ, ఎస్యూడీలో 18% వాటాను ఆ జేవీ విదేశీ భాగస్వామికి విక్రయించింది. స్టార్ యూనియన్ దై-చి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ(ఎస్‌యూడీ)లో 18 % వాటాను జపాన్‌కు చెందిన దై-చి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ(డీఐఎల్ఐసీ)కు రూ.540 కోట్లకు విక్రయించామని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ వాటా విక్రయం కారణంగా ఈ జేవీలో దైచీ వాటా 26 శాతం నుంచి 44%కి పెరగ్గా, బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటా 48% నుంచి 30%కి తగ్గింది. మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ యూనియన్ బ్యాంక్‌కు మిగిలిన 26% వాటా ఉంది.