Sudarshan Pattnaik
-
సొరంగ బాధితుల కోసం సైకత శిల్పి ప్రార్థనలు
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోగల సొరంగంలో కూలీలు చిక్కుకుపోయి నేటికి (బుధవారం) సరిగ్గా 11 రోజులు అయ్యింది. వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ బృందాలు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో నిర్మాణంలో ఉన్న ఈ సొరంగంలోని కొంత భాగం కూలిపోయింది. ఈ నేపధ్యంలో 41 మంది కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయారు. బాధిత కార్మికులను రక్షించేందుకు ఓన్జీసీ, ఎస్జేవీఎన్ఎల్, ఆర్వీఎన్ల్, ఎన్‌హెచ్‌డీసీఎల్ బృందాలు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఒడిశాలోని పూరీ నగరానికి చెందిన సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్.. ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న కార్మికుల భద్రత, రక్షణను కాంక్షిస్తూ ప్రార్థనలు చేశారు. దీనికి ప్రతిగా ఇసుకతో ఒక కళాఖండాన్ని రూపొందించారు. సొరంగంలో చిక్కుకున్న కూలీలు సురక్షితంగా బయటపడాలని కోరుకుంటూ దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు పూజలు నిర్వహిస్తున్నారు. సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించడమే తమ తొలి ప్రాధాన్యత అని సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నారు. ప్రధాని మోదీ స్వయంగా ఇక్కడ జరుగుతున్న సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇది కూడా చదవండి: సొరంగ బాధితులకు భారీ ఉపశమనం.. రెండు రోజుల్లో బయటకు.. #WATCH पुरी, ओडिशा: रेत कलाकार सुदर्शन पटनायक ने उत्तरकाशी में सुरंग में फंसे श्रमिकों की सुरक्षा और बचाव के लिए प्रार्थना करने के लिए रेत से एक कलाकृति बनाई। (21.11) pic.twitter.com/YSmCnML9ZY — ANI_HindiNews (@AHindinews) November 22, 2023 -
సైకత శిల్పి సుదర్శన్‌పై దాడి
భువనేశ్వర్ : ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్‌పై దాడి చోటుచేసుకుంది. ప్రస్తుతం ఒడిశాలోని పూరీ జిల్లా ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నట్లు సమాచారం. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఆయనపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇసుకతో బొమ్మలు చెక్కటం ద్వారా ఆయన ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సైకత శిల్పాల ప్రపంచకప్ విజేత సుదర్శన్ పట్నాయక్
ఒడిషాకు చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్, ఆయన అమెరికన్ సహచరుడు మాథ్యూ రాయ్ డైబెర్తాస్ కలిసి సైకత శిల్పాల ప్రపంచ కప్ 2014 పోటీలలో డబుల్స్ విభాగంలో విజేతలుగా నిలిచారు. తొలిసారిగా అట్లాంటిక్ నగరంలో జరిగిన ఈ పోటీలో వీరిద్దరూ కలిసి తాజ్ మహల్.. పిక్చర్ ఆఫ్ లవ్ అనే ఇసుక శిల్పాన్ని రూపొందించారు. ఇందులో తాజ్‌మహల్‌తో పాటు షా జహాన్, ముంతాజ్‌ల చిత్రాలు కూడా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన 20 మంది ఇసుక కళాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. సుదర్శన్ పట్నాయక్‌కు సోలో విభాగంలో కూడా బహుమతి వచ్చింది. సేవ్ ట్రీ, సేవ్ ఫ్యూచర్ అనే సైకత శిల్పానికి ప్రజల ఎంపికలో ఈ బహుమతి వచ్చింది. డబుల్స్ విభాగంలో కూడా బహుమతి లభించినందుకు చాలా ఆనందంగా ఉందని సుదర్శన్ పట్నాయక్ అన్నారు.