సైకత శిల్పాల ప్రపంచకప్ విజేత సుదర్శన్ పట్నాయక్
ఒడిషాకు చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్, ఆయన అమెరికన్ సహచరుడు మాథ్యూ రాయ్ డైబెర్తాస్ కలిసి సైకత శిల్పాల ప్రపంచ కప్ 2014 పోటీలలో డబుల్స్ విభాగంలో విజేతలుగా నిలిచారు. తొలిసారిగా అట్లాంటిక్ నగరంలో జరిగిన ఈ పోటీలో వీరిద్దరూ కలిసి తాజ్ మహల్.. పిక్చర్ ఆఫ్ లవ్ అనే ఇసుక శిల్పాన్ని రూపొందించారు.
ఇందులో తాజ్మహల్తో పాటు షా జహాన్, ముంతాజ్ల చిత్రాలు కూడా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన 20 మంది ఇసుక కళాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. సుదర్శన్ పట్నాయక్కు సోలో విభాగంలో కూడా బహుమతి వచ్చింది. సేవ్ ట్రీ, సేవ్ ఫ్యూచర్ అనే సైకత శిల్పానికి ప్రజల ఎంపికలో ఈ బహుమతి వచ్చింది. డబుల్స్ విభాగంలో కూడా బహుమతి లభించినందుకు చాలా ఆనందంగా ఉందని సుదర్శన్ పట్నాయక్ అన్నారు.