బెయిల్‌కు డబ్బుల్లేవ్
కోల్‌కతా: వివిధ రకాల స్కీములతో ఇన్వెస్టర్ల నుంచి వేలాది కోట్ల రూపాయలు దండుకున్న శారదా చిట్‌ఫండ్స్ స్కామ్‌లో ప్రధాన నిందితుడైన ఆ సంస్థ అధిపతి సుదీప్తసేన్ వద్ద డబ్బుల్లేవట! ఈ కేసులో అతడికి కోర్టు లోగడే బెయిల్ మంజూరు చేసినా... అందుకు హామీగా నగదు చెల్లించడానికి తన దగ్గర చిల్లిగవ్వలేదని కోర్టుకు సుదీప్తసేన్ చెప్పారు.
ఈ స్కామ్‌లో ఎన్నో కేసులలో ఆయన నిందితుడిగా ఉన్నారు. మనీలాండరింగ్ కేసులో శుక్రవారం కోల్‌కతాలోని స్థానిక కోర్టులో సుదీప్తను పోలీసులు హాజరుపరిచారు. బెయిల్ మంజూరు చేసినా రూ. 30వేల బాండ్ ఎందుకు సమర్పించడం లేదని జడ్జి పశ్చించగా తన బ్యాంకు ఖాతాలన్నింటినీ సీజ్ చేశారని సుదీప్త న్యాయమూర్తికి తెలిపారు.