బెయిల్‌కు డబ్బుల్లేవ్ | don't money To bail said,Sharada Conductor Scam | Sakshi
Sakshi News home page

బెయిల్‌కు డబ్బుల్లేవ్

Published Sat, Jun 28 2014 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 9:27 AM

don't money  To bail said,Sharada Conductor Scam

కోల్‌కతా: వివిధ రకాల స్కీములతో ఇన్వెస్టర్ల నుంచి వేలాది కోట్ల రూపాయలు దండుకున్న శారదా చిట్‌ఫండ్స్ స్కామ్‌లో ప్రధాన నిందితుడైన ఆ సంస్థ అధిపతి సుదీప్తసేన్ వద్ద డబ్బుల్లేవట! ఈ కేసులో అతడికి కోర్టు లోగడే బెయిల్ మంజూరు చేసినా... అందుకు హామీగా నగదు చెల్లించడానికి తన దగ్గర చిల్లిగవ్వలేదని కోర్టుకు సుదీప్తసేన్ చెప్పారు.

ఈ స్కామ్‌లో ఎన్నో కేసులలో ఆయన నిందితుడిగా ఉన్నారు. మనీలాండరింగ్ కేసులో శుక్రవారం కోల్‌కతాలోని స్థానిక కోర్టులో సుదీప్తను పోలీసులు హాజరుపరిచారు. బెయిల్ మంజూరు చేసినా రూ. 30వేల బాండ్ ఎందుకు సమర్పించడం లేదని జడ్జి పశ్చించగా తన బ్యాంకు ఖాతాలన్నింటినీ సీజ్ చేశారని సుదీప్త న్యాయమూర్తికి తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement