sukrutha
-
17 కథలు రెడీగా ఉన్నాయి
‘‘నాలుగేళ్ల క్రితం ‘వై మేల్ ఈజ్ ఏ జోక్’ అనే వీడియో రూపొందించాను. సౌతిండియాలో వైరల్ అయిన తొలి వీడియో అది. ఆ వీడియోకి వచ్చిన ఒక కామెంట్ నాలో ఆసక్తి కలిగించింది. దాంతో రామాయణం మొత్తం చదివాను. సుమారు 8 వెర్షన్లు చదివాను. ఒకవేళ ప్రస్తుత పరిస్థితుల్లో రాముడు, సీత లాంటి పాత్రలుంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచనతోనే ‘రామ చక్కని సీత’ చిత్రాన్ని తీశాను’’ అని దర్శకుడు శ్రీహర్ష మండ అన్నారు. ఇంద్ర, సుకృత జంటగా శ్రీహర్ష తెరకెక్కించిన చిత్రం ‘రామ చక్కని సీత’. శ్రీహర్ష, ఫణి నిర్మించారు. గత శుక్రవారం ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సందర్భంగా శ్రీహర్ష మాట్లాడుతూ – ‘‘నేను విజయవాడలో పుట్టి పెరిగాను. చిన్నప్పుడు స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనేవాణ్ణి. ‘నువ్వు ఇందులో బాగా రాణిస్తావు రా’ అని టీచర్లు మెచ్చుకునేవారు. అలా సినిమాల్లోకి రావాలనే ఆలోచన వచ్చింది. వీవీ వినాయ్గారు తీసిన ‘నాయక్’ సినిమాకు నేను చివరి అప్రెంటిస్‌ని. నేను ఆ సినిమాకి పని చేశా అని బహుశా వినాయక్‌గారికి కూడా తెలిసుండదు. ఆ తర్వాత దశరథ్గారి దగ్గర ‘శౌర్య’, ఓంకార్‌గారి దగ్గర ‘రాజుగారి గది 2’ సినిమా, ‘సిక్త్స్ సెన్స్’ అనే షోకు వర్క్ చేశాను. ఈ సినిమాను నా స్నేహితుడు ఫణితో కలసి నిర్మించాను. ఊహించినదానికంటే మంచి స్పందన లభిస్తోంది. ప్రేక్షకులు, రివ్యూలు చాలా పాజిటివ్‌గా వచ్చాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో కన్నీళ్లు వచ్చాయని చెప్పడం హ్యాపీ. ప్రస్తుతం నా దగ్గర 17కథలు రెడీగా ఉన్నాయి. ఏ సినిమా చేస్తాననేది త్వరలో చెబుతాను’’ అన్నారు. -
ఆర్ఎక్స్ 100 నేను చేయాల్సింది
‘‘రామ్‌లీలా’ సినిమా అప్పటి నుంచి నాకు, అజయ్ భూపతికి మంచి స్నేహం ఉంది. ‘ఆర్ఎక్స్ 100’ చిత్రాన్ని అజయ్ నాతోనే చెయ్యాలనుకున్నారు. కానీ, కుదరలేదు’’ అని ఇంద్రసాయి వెలివెల అన్నారు. శ్రీహర్ష మంద దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రామ చక్కని సీత’. ఈ చిత్రంలో ఇంద్రసాయి, సుకృత వాగ్లే జంటగా నటించారు. జి.ఎల్. ఫణికాంత్, విశాలక్ష్మి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ఇంద్రసాయి మాట్లాడుతూ– ‘‘బీటెక్ తర్వాత నటనలో శిక్షణ తీసుకుని ఏడేళ్ల క్రితం పరిశ్రమలో అడుగుపెట్టా. ‘రామ్‌లీలా’, ‘వంగవీటి’ చిత్రాల్లో సహాయ నటుడి పాత్రలు చేశాను. నా సన్నిహితుల ద్వారా ‘రామ చక్కని సీత’ ఆడిషన్స్‌కు వెళ్లా. నా నటన నచ్చడంతో శ్రీహర్షగారు హీరోగా అవకాశమిచ్చారు. ‘వంగవీటి’ సమయంలోనే ‘ఆర్ఎక్స్ 100’ ప్రాజెక్టు గురించి అజయ్ చెప్పారు. 80 కేజీల బరువు ఉన్న నేను ఆ పాత్ర కోసం దాదాపు 15 కిలోలు తగ్గా. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ సినిమా కార్తికేయగారికి దక్కింది. అయినా ఇప్పటికీ నాకు–అజయ్‌కు మంచి స్నేహం ఉంది. ‘రామ చక్కని సీత’లో దుందుడుకు స్వభావం కలిగిన బాలు పాత్రలో కనిపిస్తా. మంచి కథలు దొరికితే కమల్‌హాసన్‌లా విభిన్న పాత్రలు పోషించాలని ఉంది. త్వరలోనే అగస్త్య మంజు దర్శకత్వంలో కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో ఓ సినిమా చేయబోతున్నా’’ అన్నారు. పట్టుబట్టి తెలుగు నేర్చుకున్నా సుకృత వాగ్లే మాట్లాడుతూ –‘‘మాది కర్ణాటక. కన్నడలో 7 చిత్రాలు చేశా. కన్నడ ‘బిగ్‌బాస్’ సీజన్ 4లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాను. తెలుగులో నాకిది ఫస్ట్ మూవీ. నిర్మాత ఫణీంద్రగారు మాకు దూరపు బంధువు. అయినప్పటికీ నేనూ రెండుసార్లు ఆడిషన్లో పాల్గొన్నా. తెలుగమ్మాయి అయితే బావుంటుందని శ్రీహర్ష అనడంతో పట్టుబట్టి తెలుగు నేర్చుకున్నా. ప్రస్తుతం ఓ తమిళ సినిమా చేస్తున్నా’’ అన్నారు. -
శ్రమే నా సుకృతం
ఎలాంటి బాధ్యతలు లేకుండా కాలేజీకి వెళ్లే ఒక బెంగాలీ అమ్మాయికి తల్లి ఒక్కత్తే ఆలంబన. అలాంటిది తల్లి చనిపోవడంతో ఒంటరిదవుతుంది. అనుకోకుండా బెంగాల్ నుంచి తెలుగు నేలకు చేరిన ఆ అమ్మాయి జీవితంలో చోటుచేసుకునే పరిణామాలే ‘కనులు మూసినా నీవాయే’ సీరియల్ కథ చెబుతుంది. స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ఈ సీరియల్లో ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి. ఇండిపెండెంట్, ఎమోషనల్ గర్ల్‌గా ప్రధాన పాత్రలో సుకృత నటిస్తోంది. వెండితెర మీద వెలిగి బుల్లితెర ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన సుకృత పరిచయం ఆమె మాటల్లోనే.. యాంకర్ నుంచి సినిమా ‘పుట్టి పెరిగింది అంతా బెంగుళూరులోనే. కాలేజీ చదువు అయిపోవడంతోనే కన్నడ టీవీ ఛానెల్లో యాంకర్‌గా చేరాను. అక్కడి నుంచి డైరెక్ట్‌గా ప్రితియా రాయబారి అనే కన్నడ సినిమాలో అవకాశం వచ్చింది. అమ్మనాన్న బాగా చదువుకున్నవారు. లోకం గురించి వారికి బాగా తెలుసు. ఆడపిల్లను అని ఎక్కడా నాకు అడ్డంకులు చెప్పకుండా ప్రోత్సహించారు. అలా కన్నడ సినిమాలకు పరిచయం అయ్యాను. అటు తర్వాత కన్నడలోనే నాలుగైదు సీరియల్స్ చేశాను. కన్నడ సీరియల్లో ‘రాజకుమారి’ పాత్ర నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అట్నుంచి తెలుగులో ‘నేను–నా ఫ్రెండ్స్’ అనే సినిమాలో నటించాను. ఆ తర్వాత తెలుగు స్టార్ మా ‘కనులు మూసినా నీవాయే’ సీరియల్లో నటించడానికి అవకాశం వచ్చింది. అలా ఈ ఇండస్ట్రీకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఉండే భయాలు ఇప్పుడు లేవు. ప్రతిరోజు నేర్చుకోవడానికి ఇక్కడ మంచి స్కోప్ ఉంటుంది. సినిమా నుంచి సీరియల్ ఇది చిన్న పని, అది పెద్ద పని అని లెక్కలు వేసుకోను. నాకు పని ఉండాలి. పని చేస్తూ ఉంటే మంచి ఫలితాలు అవే వస్తాయి అని గట్టిగా నమ్ముతాను. అదీ కాకుండా ఈ రోజుల్లో సీరియల్ అమ్మాయి, సినిమా అమ్మాయి అనే తేడా లేదు. క్రియేటివిటీ, చార్మ్‌ను అందరూ గుర్తిస్తున్నారు. అలా చాలా మంది తమ వర్క్‌లో చాలా ఎఫర్ట్ పెడుతున్నారు. ఒకటే తేడా ఏంటంటే.. సినిమాలో అయితే రోజులో ఒకట్రెండు సీన్స్ వుంటాయి. అదే సీరియల్ అయితే రోజులో ఎనిమిది సీన్లు కూడా ఉంటాయి. ఆ విధంగా ఉదయం నుంచి రాత్రి వరకు పనితోనే సరిపోతుంది. సినిమా వర్క్ చాలా ప్రొఫెషనల్‌గా ఉంటే, సీరియల్ వర్కింగ్ చాలా హోమ్లీగా ఉంటుంది. సినిమాలో హీరో హీరోయిన్స్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. కానీ, కుటుంబానికి సంబంధించిన సీన్లన్నీ సీరియల్స్‌లోనే ఎక్కువ. సీరియల్ నుంచి రియల్ వర్క్ సీరియల్స్ తర్వాత నా వర్క్ బ్యుటిషియన్ చుట్టూతానే తిరుగుతుంటుంది. ఈ ఫీల్డ్కి రాకముందు బ్యుటిషియన్ కోర్సు చేశాను. నాకు ఆ వర్క్ అంటే చాలా ఇష్టం. ఏ కాస్త ఖాళీ సమయం దొరికినా బ్యూటిషియన్‌కు సంబంధించిన కొత్తవివరాలు సేకరిస్తూ ఉంటాను. అంతేకాదు, సినిమా హీరోయిన్స్‌కి కూడా బ్యూటీ వర్క్ చేస్తాను. వంట చేయడం అంటే కూడా నాకు చాలా ఇష్టం. అన్ని డిష్‌లను కొత్తగా వండి వార్చడం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను. స్విమ్మింగ్ మాత్రం పిచ్చి. అవకాశాలు వస్తే సీరియల్స్, సినిమాలూ రెండూ చేస్తాను. సీరియల్, సినిమా ఏదైనా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేయాలనేది నా యాంబిషన్. పేరులో మార్పు నా పేరులో అంజనా దేశ్‌పాండే అని ముందు ఉండేది. అంజనా సుకృత అని నా పూర్తి పేరు. ఇప్పుడు సుకృత అని మాత్రమే మార్చుకున్నాను. పేరులో ప్రత్యేకత ఉంటుందని అలా మార్చుకున్నాను. మా నాన్న బ్యాంక్ మేనేజర్, అమ్మ హౌజ్‌వైఫ్. ఈ ఫీల్డ్ గురించి వాళ్లెప్పుడూ భయపడలేదు. నా గురించి వాళ్లకు బాగా తెలుసు. నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు. – ఎన్.ఆర్ -
నాన్నా.. మాకెందుకీ శిక్ష?
- మనస్పర్థలతో వేర్వేరుగా ఉంటున్న దంపతులు - తమను చదివించాలని తండ్రిని కోరిన పిల్లలు - తండ్రి ఇంటి ముందు బిడ్డల బైఠాయింపు - రాత్రంతా చలిలో... ఇంటి ముందే నిద్రించిన వైనం - పోలీసుల జోక్యంతో నిరసన విరమించిన పిల్లలు నాన్నా.. మేమేం పాపం చేశాం. మమ్మల్ని కనమని అడిగామా..లేదే. మరి మమ్మల్ని వదిలి ఎందుకు వెళ్లిపోయావ్? మా ఈడు పిల్లల్లాగే మాకూ చదువుకోవాలని ఉంది. బోలెడన్ని కబుర్లు నీతో చెప్పాలని ఉంది. ఇంకా వస్తావని ఎదురు చూశాం. నువ్వేమో వచ్చేలా లేవు. కనీసం మా భవిష్యత్తు గురించైనా ఆలోచించే ఓపిక నీకు లేనట్టుంది. మా గురించి నువ్వే పట్టించుకోకపోతే.. ఇక ఎవరు పట్టించుకుంటారు నాన్నా.. మాకు చదివిస్తానని మాటిచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ ఓ ఇద్దరు చిన్నారులు తండ్రి ఇంటి ముందు రాత్రంతా చలిలో దీక్షకు కూర్చోవడం సంచలనం సృష్టించింది. చివరకు పోలీసుల జోక్యంతో వారు దీక్ష విరమించారు. - అనంతపురం సెంట్రల్ అనంతపురం భైరవనగర్ మొదటి క్రాస్‌లో నివాసముంటున్న మిలటరీ ఉద్యోగి(డిఫెన్స్) రామాంజనేయరెడ్డి ఇంటి ముందు ఆయన కుమార్తె సుకృత(13), పవన్‌కుమార్‌రెడ్డి(10) గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు నిరసనకు దిగారు. తమకు చదివించాలని, తమ భవిష్యత్తుకు దారి చూపాలని ఆ చిన్నారులిద్దరూ ఇలా రాత్రంతా చలిలో ఒణకుతూ ఆందోళన కొనసాగించడం అందరికీ కన్నీళ్లు తెప్పించింది. ఎందుకీ పరిస్థితి వచ్చిందంటే.. రామాంజనేయరెడ్డి దంపతుల మధ్య రెండేళ్ల కిందట మనస్పర్ధలు తలెత్తాయి. అప్పటి నుంచి దంపతులు విడిపోయి ఎవరికి వారు వేర్వేరుగా బతుకుతున్నారు. పిల్లలిద్దరూ తల్లి వద్దే ఉంటున్నారు. పాపా తొమ్మిదో తరగతి, బాబు ఏడో తరగతి చదువుతున్నారు. వీరిద్దరూ ఓ ప్రైవేటు పాఠశాలలో చదివేవారు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ భారమైన నేపథ్యంలో ఫీజు చెల్లించలేక పాఠశాల మానుకున్నారు. కనీసం టీసీ ఇమ్మని అడిగినా పాఠశాల యాజమాన్యం అంగీకరించడం లేదని తెలిపారు. ఫీజు బకాయిలు కట్టేంత వరకు టీసీలు ఇచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆ చిన్నారులిద్దరూ తమ చదువుకు సహకరించాల్సిందిగా కోరేందుకు గురువారం తండ్రి ఇంటి వద్దకు వెళ్లారు. అయితే అతను ఇంట్లోకి రానివ్వకపోవడంతో చిన్నారులిద్దరూ తండ్రి ఇంటి ముందే బైఠాయించారు. రాత్రి పొద్దుపోయేంత వరకూ కూడా వారి సమస్య తెగలేదు. దీంతో ఆ పిల్లలు అక్కడే నిద్రపోయారు. ఒకవైపు తుంపర పడుతుండగా, మరోవైపు చలిలోనే వారు నరకయాతన అనుభవించారు. ఆ చిన్నారులు పడుతున్న కష్టాన్ని చూసిన ఇరుగు పొరుగు ప్రజలు శుక్రవారం ఉదయాన్నే వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే పోలీసులు రామాంజనేయరెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆందోళన కొనసాగిస్తున్న అతని పిల్లలిద్దరితో మాట్లాడారు. వారి సమస్య అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు వస్తే మాట్లాడుదామంటూ నచ్చజెప్పి పిల్చుకెళ్లారు. ఆస్తిపాస్తులున్నా పిల్లలను చదివించుకోలేని పరిస్థితి ఏర్పడిందని తల్లి వాపోయారు. కాగా దంపతుల మధ్య తలెత్తిన విభేదాలకు సంబంధించిన కేసు న్యాయస్థానంలో నడుస్తున్నందున తామేమీ జోక్యం చేసుకోలేమని పోలీసులు చెప్పారు. కొసమెరుపు: కుటుంబంలో దంపతుల మధ్య తలెత్తిన విభేదాలు ఏ పాపం ఎరుగని వారి చిన్నారులపై ఎలాంటి ప్రభావం చూపుతోందో ఈ ఉదంతం ఈ ఉదంతం తెలుపుతోంది. అమ్మా.. నాన్నా.. ఇకనైనా ఆలోచించండి. పంతాలు, పట్టింపులకు వెళ్లి మీ పిల్లల జీవితాలతో చెలగాటమాడొద్దండి.