summer capital
-
ఉత్తరాఖండ్‌కు మూడు రాజధానులు
-
ఉత్తరాఖండ్ రెండో రాజధానిగా గైర్‌సెయిన్
డెహ్రాడూన్: చమోలీ జిల్లాలోని గైర్‌సెయిన్ పట్టణాన్ని రాష్ట్ర రెండో రాజధానిగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. గవర్నర్ బేబీ రాణి మౌర్య ఆమోదం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్పల్కుమార్ సింగ్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. గైర్‌సెయిన్‌ను రెండో రాజధానిగా (వేసవి) మారుస్తామని మార్చి 4న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ పేర్కొన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గైర్‌సెయిన్‌కు దక్కిన వేసవి రాజధాని హోదాను ఉత్తరాఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించిన వేలాది మంది ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. గైర్‌సెయిన్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని అన్నారు. తాము అధికారంలోక వస్తే గైర్‌సెయిన్‌ను వేసవి రాజధానిగా మారుస్తామంటూ 2017 అసెంబ్లీ ఎన్నికల దార్శనిక పత్రంలో బీజేపీ హామీ ఇచ్చింది. ప్రస్తుతం డెహ్రాడూన్ నగరం ఉత్తరాఖండ్ పరిపాలనా రాజధానిగా కొనసాగుతోంది. -
ఉత్తరాఖండ్ వేసవి రాజధాని ఏదంటే
-
ఏపీ బాటలో ఉత్తరాఖండ్..
గైర్సైన్ : ఉత్తరాఖండ్ వేసవి రాజధానిగా గైర్సైన్ను ఎంపిక చేసినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తివేంద్ర సింగ్ రావత్ ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఈ విషయాన్ని అసెంబ్లీలో పేర్కొన్నారు. గైర్సైను శాశ్వత రాజధానిగా చేయాలని కొంత కాలంగా పర్వత ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఉత్తరాఖండ్ జ్యుడీషియల్ క్యాపిటల్‌గా డెహ్రాడూన్, జ్యుడీసియల్ రాజధానిగా నైనిటాల్ కొనసాగనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గైర్సైన్లో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించారు. అధికారుల నివాస భవనాలు సహా పలు భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. గైర్సైన్ ప్రాంత సమీపంలో విమానాశ్రయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మూడు రాజధానులను ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. -
సీమలో సమ్మర్ క్యాపిటల్!
తిరుపతి: ఓ వైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అట్టహాసంగా నూతన రాజధాని అమరావతి నిర్మాణ కార్యక్రమాల్లో తలమునకలవుతుంటే..మరో వైపు రాయలసీమ ఐక్యవేదిక నేతలు సరికొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. రాష్ట్రానికి అమరావతే కాకుండా రాయలసీమప్రాంతంలోనూ ఓ రాజధానిని నిర్మించాలనే వాదన ముందుకొచ్చింది. ఈ మేరకు రాయలసీమలో సమ్మర్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని కోరుతూ రాయలసీమ, ఉత్తరాంధ్ర హక్కుల సాధన ఐక్యవేదిక అధ్యక్షుడు, మాజీ మంత్రి టీజీ. వెంకటేశ్ డిమాండ్ చేశారు. అంతేకాక రాయలసీమ, ఉత్తరాంధ్ర హక్కుల సాధన కోసం కూడా పోరాడాలని పిలుపునిచ్చారు. సోమవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో టీజీ వెంకటేశ్ మాట్లాడారు. అమరావతిని ఫ్రీ జోన్‌గా ప్రకటించకపోతే అందరి నోట్లో మట్టికొట్టినట్లు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సీమలోని సాగునీటి ప్రాజెక్టులు గుండ్రేవుల, సిద్ధేశ్వరం, వేదవతి ప్రాజెక్టులను వెంటనే ప్రారంభించాలని కోరారు. ఉద్యమం ద్వారానే హక్కుల సాధన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రాయలసీమ అభివృద్ధి చెందకుంటే మరొకసారి మోసపోవాల్సి వస్తుందని తెలిపారు. ఇప్పటికే మద్రాసు, హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టి మోసపోయామని, మళ్లీ అమరావతిలో పెట్టుబడులు పెట్టి అదేవిధంగా బయటకు రావాల్సి వస్తుందని అన్నారు. రాష్ట్రం ముక్కలు కాకుండా ఉండాలంటే సీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రత్యేకహోదా అంశం పై విలేకరుల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ముందు స్పెషల్ గ్రాంటులు తీసుకుని ఆ తర్వాత ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే బాగుంటుందని టీజీ అన్నారు. రాయలసీమ హక్కుల వేదిక ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజి రెండింటిపైనా పోరాడుతుందని, దీనికి ప్రజల మద్దతు అవసరమని పేర్కొన్నారు. -
రాయలసీమలో సమ్మర్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలి
రాయలసీమలో సమ్మర్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని రాయలసీమ ఉత్తరాంధ్ర హక్కుల ఐక్య వేదిక మానవ హారం నిర్వహించారు. దీంతో పాటు రాయలసీమ ఉత్తరాంధ్రలలో హైకోర్టు బెంచ్‌లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలు ఓల్డ్ సిటీలోని పాత బస్టాండ్ వద్దగల తెలుగు తల్లి విగ్రహం ఎదుట బుధవారం వందల మంది విద్యార్థులతో మానవ హారాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. -
తరలుతున్న రాజధాని
జమ్ము-కశ్మీర్ వేసవి రాజధాని ఏది? జవాబు: శ్రీనగర్. జనరల్ నాలెడ్జ్ ప్రశ్నగా తెలిసిన రాజధాని బదిలీకి ఈ ఫొటో సజీవ సాక్ష్యం. సుమారు 150 ఏళ్ల క్రితం, జమ్ము వేసవి తాపానికి తాళలేక అప్పటి డోగ్రా మహారాజు రణ్‌బీర్ సింగ్ 1872లో ప్రారంభించిన ఈ సంప్రదాయం ‘దర్బార్ మూవ్’ పేరుతో ఇప్పటికీ కొనసాగుతోంది. మే 5 కల్లా శ్రీనగర్‌కు రాజధాని బదిలీ కార్యక్రమం పూర్తవుతుంది. గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు అందరూ తమ కార్యాలయాల్ని మార్చుకుంటారు. ఆ మార్పిడికి అనుగుణంగా ఫైళ్ల పెట్టెలు తగిన భద్రత నడుమ, పూర్తిగా నియంత్రించిన ట్రాఫిక్‌లో రవాణా అవుతాయి. శ్రీనగర్‌లో దాదాపు ఆరు మాసాల పాలన అనంతరం, అక్టోబర్ చివరికల్లా శీతాకాలంలో రాజధాని తిరిగి జమ్ముకు మారుతుంది. అప్పుడు మళ్లీ ఈ ఫైళ్ల మోత కార్యక్రమం యధాతథంగా ఉంటుంది.