తరలుతున్న రాజధాని
జమ్ము-కశ్మీర్ వేసవి రాజధాని ఏది? జవాబు: శ్రీనగర్. జనరల్ నాలెడ్జ్ ప్రశ్నగా తెలిసిన రాజధాని బదిలీకి ఈ ఫొటో సజీవ సాక్ష్యం. సుమారు 150 ఏళ్ల క్రితం, జమ్ము వేసవి తాపానికి తాళలేక అప్పటి డోగ్రా మహారాజు రణ్‌బీర్ సింగ్ 1872లో ప్రారంభించిన ఈ సంప్రదాయం ‘దర్బార్ మూవ్’ పేరుతో ఇప్పటికీ కొనసాగుతోంది. మే 5 కల్లా శ్రీనగర్‌కు రాజధాని బదిలీ కార్యక్రమం పూర్తవుతుంది. గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు అందరూ తమ కార్యాలయాల్ని మార్చుకుంటారు.
ఆ మార్పిడికి అనుగుణంగా ఫైళ్ల పెట్టెలు తగిన భద్రత నడుమ, పూర్తిగా నియంత్రించిన ట్రాఫిక్‌లో రవాణా అవుతాయి. శ్రీనగర్‌లో దాదాపు ఆరు మాసాల పాలన అనంతరం, అక్టోబర్ చివరికల్లా శీతాకాలంలో రాజధాని తిరిగి జమ్ముకు మారుతుంది. అప్పుడు మళ్లీ ఈ ఫైళ్ల మోత కార్యక్రమం యధాతథంగా ఉంటుంది.