భీమవరంలో వాలీబాల్ శిక్షణ శిబిరం
భీమవరం: క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి, సరికొత్త ఆలోచనలకు దోహదపడతాయని భీమవరం డీఎన్నార్ కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు గోకరాజు వెంకట నర్సింహరాజు, గాదిరాజు సత్యనారాయణరాజు అన్నారు. కళాశాల క్రీడా మైదానంలో బుధవారం సమ్మర్ రెసిడెన్షియల్ వాలీబాల్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. జిల్లా వాలీబాల్ అసోసియేషన్, వసు«ధ ఫౌండేష న్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ పోటీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వసుధా ఫౌండేష న్ కార్యదర్శి మంతెన వెంకటరామరాజు మాట్లాడుతూ వేసవిలో విద్యార్థులు సమయాన్ని వృథా చేసుకోకుండా ఇలాంటి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ పి.రామకృష్ణంరాజు, వాలీబాల్ అసోసియేష న్ జిల్లా కార్యదర్శి జి.నారాయణరాజు, వసుధాఫౌండేష న్ కన్వీనర్ ఇందుకూరి ప్రసాదరాజు, శివరామరాజు, ఎంసీహెచ్ ఆర్కే రాజు, సుదర్శన వర్మ, శ్రీనివాసరాజు, జీవీ పవ న్ కుమార్రాజు పాల్గొన్నారు.