సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా!
‘సుబ్రమణ్యం ఫర్ సేల్’తో సెప్టెంబర్‌లో సందడి చేయనున్న మెగా హీరో సాయి ధరమ్‌తేజ్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా ‘ఓం’ అనే త్రీడీ చిత్రాన్ని తెరకెక్కించిన సునీల్‌రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది.
శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ పతాకంపై సి. రోహిణ్‌రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రం ఈ నెల 31న ప్రారంభ వేడుక జరుపుకోనుంది. ఇందులో సాయిధరమ్‌తేజ్ సరసన ఓ క్రేజీ కథానాయిక నటించనున్నారు. మరో నలుగురు అమ్మాయిలు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు. రాజేంద్రప్రసాద్ ముఖ్య భూమిక పోషించనున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్, సహ నిర్మాత: కిరణ్‌రావు.