sunny leone show
-
చంపేస్తామని బెదిరించేవారు.. నటి షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ నటి సన్నీ లియోన్ జిన్నా మూవీతో టాలీవుడ్లో అలరించింది. మంచు విష్ణు హీరోగా నటించిన ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇటీవల ఓ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. గతంలో ఆమెకు ఎదురైన భయానక సంఘటనలను తలుచుకుని భావోద్వేగానికి గురైంది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో బెదిరింపులు వచ్చాయని.. నేను తిరిగి ఇండియాకు వస్తానని అనుకోలేదని సన్నీ తెలిపింది. సన్నీ లియోన్ మాట్లాడుతూ..' నా కెరీర్ ప్రారంభంలో బెదిరింపు మెయిల్స్ వచ్చేవి. చంపేస్తామంటూ సందేశాలు పంపేవాళ్లు. అధిక సంఖ్యలో ఇండియా నుంచి వచ్చేవి. ఇక్కడ ప్రజలు నాపై చాలా కోపంగా ఉన్నారని అనుకున్నా. అవీ నన్ను తీవ్ర ప్రభావితం చేశాయి. అప్పుడు నా వయసు కేవలం 20 ఏళ్లే. ఆ సమయంలో నాకు మంచిచెడులు చెప్పడానికి ఎవరూ లేరు. ఇప్పుడు ఆ పరిస్థితులు ఎదురైతే నన్నేం చేయలేవు. ఇప్పుడు నేను మానసికంగా చాలా బలంగా ఉన్నా.' అని ఆమె అన్నారు. -
సన్నీకి మద్దతుగా హైకోర్టు వ్యాఖ్యలు
సాక్షి, బెంగళూర్ : సన్నీ నైట్ షోపై కర్ణాటకలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న వేళ.. పోలీసులు అనుమతి నిరాకరించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సన్నీ షోను మాత్రమే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ బెంగళూర్ పోలీసులను ప్రశ్నించింది. భద్రతా కారణాలను సాకుగా చూపిస్తూ పోలీసులు అనుమతి నిరాకరించటంతో షో నిర్వాహకులు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న 18 రోజుల తర్వాత నిరాకరిస్తున్నట్లు చెప్పటం, అది కూడా భద్రతా కారణం అని చెప్పటం సహేతుకంగా లేదని వారు పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించింది. కొత్త సంవత్సరం వేడుకల విషయంలో మిగతా క్లబ్ ఈవెంట్లపై లేని అభ్యంతరాలు కేవలం సన్నీలియోన్ షోపై మాత్రమే ఎందుకు వ్యక్తం చేస్తున్నారంటూ పోలీసులను ప్రశ్నించింది. ఈ విషయంలో సన్నీ లియోన్ నుంచి స్పష్టమైన స్టేట్మెంట్ను రికార్డు చేయాలని.. డిసెంబర్ 31న నగరంలో ఎవరెవరికి అనుమతులు ఇచ్చారో జాబితా ను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని న్యాయమూర్తి బీ వీరప్ప ఆదేశించారు. తదుపరి విచారణను 25వ తేదీకి వాయిదా వేశారు. అనంతరం షో నిర్వాహకుడు, ది టైమ్స్ క్రియేషన్స్ యజమాని భవ్య హెచ్ఎస్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఈవెంట్ ఏర్పాట్ల కోసం సుమారు 2.5 కోట్ల దాకా ఖర్చు చేసినట్లు వివరించారు. దరఖాస్తు చేసుకున్న సమయంలో నాలుగైదు రోజుల్లో అనుమతులు ఇస్తామని పోలీస్ శాఖ చెప్పిందని.. ఇప్పుడు అభ్యంతరాల నేపథ్యంలో షో రద్దైతే తనకు భారీగా నష్టం వాటిల్లుతుందని ఆయన తెలిపారు. కాగా, కర్ణాటక రక్షణ వేదిక యువ సేనే అభ్యంతరాల నేపథ్యం, సామూహిక ఆత్మహత్యల నేపథ్యంలో పోలీసులు అనుమతులకు వెనకడుగు వేస్తుండగా.. సన్నీ లియోన్ కూడా స్వచ్ఛందంగా షోకు రావట్లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. -
కోర్టుకు వెళ్లిన ‘సన్నీ నైట్స్’ నిర్వాహకులు
సాక్షి,బెంగళూరు: డిసెంబర్ 31న సన్నీలియోన్ కార్యక్రమాలకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించా రు. కార్యక్రమానికి రూ. లక్షలు ఖర్చు చేశామని, అనుమతి ఇవ్వాలని నిర్వాహకులు కోర్టుకు వెళ్లారు. వీరి పిటిషన్ మరో రెండు రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉంది. -
సన్నీ టైమ్
న్యూ ఇయర్‌కు సిటీ ని సన్నీ లియోన్ షో హీటెక్కించనుంది. జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో బుధవారం రాత్రి సన్నీ ఈవెంట్ జరగనుంది. ఇందులో ఈ భామ 5 పాటలకు చిందేయనుంది. దీంతో పాటు ఇద్దరు డీజేలు రకరకాల పాటలతో న్యూ ఇయర్ జోష్‌ను పెంచనున్నారు. ఈవెంట్ బ్రోచర్‌ను సోమవారం విడుదల చేశారు. మూడు కేటగిరీల్లో టికెట్లు విక్రయించనున్నారు. టికెట్ ధర రూ.4 వేల నుంచి రూ.10 వేలుగా నిర్ణయించినట్టు నిర్వాహకులు తెలిపారు. వివరాలకు 040-66466778 ఫోన్ నంబర్‌ను సంప్రదించవచ్చు.