super fast express train
-
సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. ప్రయాణికులు ఒక్కసారిగా..
మంచిర్యాల: న్యూఢిల్లీ నుంచి చెన్నయ్ వెళ్తున్న తమిళనాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు వ్యాపించడం కలకలం రేపింది. ఈ ఘట న ఆదివారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. తమిళనాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు బెల్లంపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకోగానే ఎస్–3 బోగీ వద్ద క్రమంగా పొగలు రావడంతో ప్రయాణికులు భయపడ్డారు. వెంటనే రైల్వే అధికారులు రైలును స్టేషన్లో ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేయించారు. రైల్వే టెక్నికల్ టీమ్ నిశితంగా తనిఖీ చేసి ప్రమాదమేమీ లేదని, కేవలం రైలు బ్రేక్‌లు చక్రాలకు గట్టిగా పట్టుకోవడంతో పొగలు వ్యాపించినట్లుగా గు ర్తించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. బ్రేక్‌లను సరి చేసి గంట తర్వాత రైలుకు పచ్చజెండా ఊపారు. దీంతో ప్రయాణికులు, రైల్వే అధికారులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకోగా.. అప్పటివరకు ఏర్పడిన ఆందోళనకు తెరపడింది. -
స్పెషల్ రైళ్ల సర్వీసులు పొడిగింపు
అమరావతి: ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని డిసెంబరు 3 నుంచి 12వ తేదీ వరకు హజరత్ నిజాముద్దీన్-కొచ్చివెలి మధ్య సూపర్ ఫాస్ట్ ఏసీ స్పెషల్ రైళ్ల నాలుగు సర్వీసుల్ని పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. హజరత్ నిజాముద్దీన్-కొచ్చివెలి మధ్య డిసెంబరు 3, 10వ తేదీల్లో, కొచ్చివెలి-నిజాముద్దీన్ మధ్య డిసెంబరు 5, 12వ తేదీల్లో ఈ సర్వీసులు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.