Superstars
-
ఫైవ్ స్టార్లం మేమే
సాక్షి, ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్‌ఖాన్ (53) సంచలన వ్యాఖ్యలు చేశారు. దబాంగ్ 3 మూవీ షూటింగ్లో బిజిగా ఉన్న బాలీవుడ్ బాడీగార్డ్ తన స్టార్డమ్ గురించి మరోసారి గొప్పగా చెప్పుకున్నాడు. అంతేకాదు బాలీవుడ్లో తనతోపాటు కేవలం అయిదుగురు మాత్రమే సూపర్ స్టార్లుగా కొనసాగుతున్నారని వ్యాఖ్యానించారు. ఒక ఇంటర్వ్యూలో సల్మాన్ మాట్లాడుతూ.. స్టార్డమ్ ఎప్పటికైనా ఫేడ్ ఔట్ అవ్వక తప్పదు. సుదీర్ఘ కాలం కరియర్‌ను కొనసాగించడం చాలా కష్టం. కానీ తనతోపాటు షారూఖ్ ఖాన్, ఆమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్‌దేవ్‌గణ్ మాత్రమే ఇప్పటికీ బాలీవుడ్లో స్టార్లుగా కొనసాగుతున్నామని అభిప్రాయపడ్డారు. ఇంకొన్ని సంవత్సరాలు కొనసాగించడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. అయితే అందరు సూపర్ స్టార్ల మాదిరిగానే, మా బాక్స్ ఆఫీస్ వసూళ్లు కూడా ఎనిమిది నుండి పది శాతానికి తగ్గొచ్చు. కానీ ఆ డౌన్ ట్రెండ్ ఇంకా ప్రారంభం కాలేదని సల్మాన్ వ్యాఖ్యానించారు. కాగా ప్రభుదేవా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న దబాంగ్ 3లో తన ఐకానిక్ పోలీస్ పాత్ర చుల్బుల్ పాండేగా సల్మాన్ అలరించనున్నారు. సోనాక్షి సిన్హా, డింపుల్ కపాడియా, అర్బాజ్ ఖాన్, సుదీప్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దీంతోపాటు దాదాపు 19 సంవత్సరాల తరువాత సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో ‘ఇన్షాల్లాహ్’ మూవీలో అలియా భట్‌తో సల్మాన రొమాన్స్ చేయనున్న సంగతి తెలిసిందే. -
ఫ్యాన్స్‌ని సర్ప్రైజ్ చేసిన సూపర్‌స్టార్స్
ముంబై: దాదాపు రెండు దశాబ్దాలుగా మలయాళ చలనచిత్ర పరిశ్రమను ఏలుతున్న సూపర్‌స్టార్స్ ఫ్యాన్స్ ని అనూహ్యంగా సర్ ప్రైజ్ చేశారు. మోహన్‌లాల్ మరో లెజెండ్ తో కలిసి ఉన్న ఓ అరుదైన ఫోటోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. మమ్ముట్టితో కలిసి ఉన్న ఫోటోను తన ట్విటర్ పేజీలో షేర్ చేశారు. అంతే ఈ ఫోటో వైరల్ అయింది. రీల్ లైఫ్ లో ప్రత్యర్థులుగా వుండే వీరిద్దరు తమ రియల్ ఫ్రెండ్షిప్ను తమ అభిమానులతో పంచుకున్నారు. మమ్ముట్టీ, మోహన్ లాల్ ఇద్దరూ రీల్ లైఫ్‌లో ఢీ అంటే ఢీ అనుకునే క్యారెక్టర్లు కానీ ఇది రియల్ లైఫ్ లో ప్రభావితం చేయకుండా వృత్తి జీవితానికి భిన్నంగా తమ స్నేహాన్ని కాపాడుకుంటున్న వైనాన్ని ప్రతిబింబించేలా ఉన్న ఈఫోటో చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. కాగా వరుస హిట్స్ చిత్రాలతో దూసుకుపోతున్న మోహన్‌లాల్ లాల్‌జోస్ దర్శకత్వంలో 'వెళిపడింతె పుస్తకం' అనే సినిమాలో నటిస్తున్నారు. అలాగే వెయ్యికోట్ల భారీ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న మహాహారతంలో మోహన్ లాల్ భీమ పాత్రను పోషించనుండగా, మాలీవుడ్, కోలివుడ్ అనే తేడాలేకుండా బిజీబిజీగా ఉండే మమ్ముట్టి , తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రం కాల కరికాలన్లో ఓ ప్రముఖ ప్రాతలో నటిస్తున్నారనే రుమార్లు చెబుతున్నాయి. తమ వైవిధ్యమైన నటనతో అశేషప్రేక్షకులను ఆకట్టుకున్న మమ్ముట్టి, మోహన్‌లాల్ ఇద్దరూ పృథ్విరాజ్, దుల్కర్ సల్మాన్, నివిన్ పాలిలీ, ఫహద్ ఫాసిల్, టోవినో థామస్ లాంటి యంగ గన్స్‌కి పరిశ్రమలో గొప్ప స్ఫూర్తిగా కూడా నిలుస్తున్నారని పరిశ్రమ పెద్దల భావన. With Mammukka :) pic.twitter.com/YsYmQi9Fqk — Mohanlal (@Mohanlal) June 28, 2017 -
అతిథిగా రజనీ?
ఒక ఆశ్చర్యకరమయిన ప్రచారం కోలీవుడ్‌లో హల్చల్ చేస్తోంది. అదే కమల్‌హాసన్, రజనీ కలిసి త్వరలో ఒక చిత్రం చెయ్యబోతున్నారన్నది. కమల్ హాసన్, రజనీకాంత్ తొలి రోజుల్లో పలు చిత్రాలు కలిసి నటించారన్న విషయం తెలిసిందే. ఆ చిత్రాలన్నీ ప్రేక్షకుల్ని అలరించాయి. ఆ తరువాత ఇద్దరికీ సొంత ఇమేజ్ రావడంతో విడివిడిగా నటించడం సూపర్‌స్టార్స్‌గా ఎదగడం తెలిసిందే. ఆ తరువాత కూడా ఈ దిగ్గజాల కలయికలో చిత్రం చేయూలని చాలా మంది ప్రయత్నించి విఫలం అయ్యారు. స్వయంగా వారి గురువు కె.బాలచందర్‌కు కూడా అలాంటి ఆలోచన వచ్చినా అప్పట్లో అది కార్యరూపం దాల్చలేదు. అయితే అలాంటి ఒక అద్భుత కలయికతో త్వరలో ఒక చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. ప్రసిద్ధ దర్శకుడు కె.బాలచందర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో కమల్‌హాసన్ హీరోగా నటించనున్నట్లు రజనీకాంత్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు కోలీవుడ్ టాక్. ఈ చిత్రానికి వీర విళైయాట్టు అనే టైటిల్‌ను నిర్ణయిం చినట్లు సమాచారం. అయితే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన ఏదీ లేదు. ప్రస్తుతం కమల్‌హాసన్ ఉత్తమ విలన్ చిత్రంలో నటిస్తున్నారు. ఆ తరువాత మలయాళ చిత్రం దృశ్యం రీమేక్‌లో నటించనున్నారు. అలాగే రజనీకాంత్ లింగా చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నారు. -
చెన్నైలో ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ ప్రారంభోత్సం