ఒమన్ లో భారత మహిళ మృతి
దుబాయ్: ఒమన్ లోని సుర్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత మహిళ ఒకరు మృతి చెందారు. ఆమె ప్రయాణిస్తున్న కారు కరెంట్ స్తంభాన్ని ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
మృతురాలు ఖదీజగా గుర్తించారు. గాయపడిన వారిలో ఆమె కుమారుడు, కారు డ్రైవర్, మరో ప్రయాణికురాలు ఉన్నారు. ఖదీజ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు సుర్ నగరంలోని భారత సామాజిక కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు.