sureedu
-
సూరీడుపై హత్యాయత్నం
సాక్షి, బంజారాహిల్స్ (హైదరాబాద్): తన తల్లిదండ్రులపై భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడంటూ సూరీడు కుమార్తె గంగాభవానీ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యా దు చేశారు. దీంతో పోలీసులు బుధవారం సూరీడు అల్లుడు డాక్టర్ సురేంద్రనాథ్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీ హిల్స్ రోడ్ నంబరు 10లోని గాయత్రీహిల్స్‌లో నివసించే ఇ. సూర్యనారాయణరెడ్డి అలియాస్ సూరీడు కుమార్తె గంగాభవాని, డాక్టర్ సురేంద్రనాథ్‌రెడ్డి భార్యాభర్తలు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో దూరంగా ఉంటున్నారు. మంగళవారం రాత్రి సురేంద్రనాథ్‌రెడ్డి తన మామ ఇంట్లోకి ప్రవేశించి, కర్రబ్యాటుతో సూరీడుపై వెనుక నుంచి దాడి చేశాడు. అడ్డు వచ్చిన అత్తపై కూడా దాడి చేశాడు. ఘటనలో గంగాభవానీకి కూడా గాయాలయ్యాయి. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సురేంద్రనాథ్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. గంగాభవానీ ఫిర్యాదు మేరకు సురేంద్రపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. చదవండి: (బీఫార్మసీ విద్యార్థిని సుప్రియ ఆత్మహత్య) -
ఏపీ సీఎం కార్యాలయంలో సూరీడు
సాక్షి, విజయవాడ బ్యూరో: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన సూరీడు గురువారం ఏపీ సీఎం కార్యాలయానికి వెళ్లారు. 3గంటలకుపైగా సూరీడు సీఎం కార్యాలయంలోనే ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో చాలాసేపు భేటీ అయినట్లు విశ్వసనీయ సమాచారం. సీఎం ముఖ్య కార్యదర్శి సతీష్‌చంద్రను కూడా సూరీడు కలిసినట్లు తెలిసింది. తిరిగివెళ్లేటప్పుడు ఆయన సీఎం కార్యాలయం మెయిన్ గేటు నుంచి బయటకు రాకపోవడం అనుమానాలకు తావిచ్చింది. సూరీడు కోసం మీడియా బయట వేచి ఉండడంతో మంత్రులు పుల్లారావు, అచ్చెన్నాయుడు నడుచుకుంటూ బయటకు వచ్చి మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ మెయిన్‌గేటు వరకూ వెళ్లారు. ఆ సమయంలో వెనుక గేటు నుంచి సూరీడును బయటకు పంపించారు. మీడియాను పక్కదారి పట్టించేందుకు మంత్రులు ఇలా బయటకు నడుచుకుంటూ రావడం ఆశ్చర్యం కలిగించింది. 2009లో డాక్టర్ రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత ఇప్పటివరకూ ఎక్కడా కనిపించని సూరీడు ఇంతకాలానికి బాబు క్యాంపు కార్యాలయంలో ప్రత్యక్షం కావడం చర్చనీయాంశమైంది.