బ్యాంక్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: బ్యాంక్ క్లర్క్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన జిల్లాకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన అభ్యర్థులకు స్థానిక ఏపీ బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమాధికారి బీ రవిచంద్ర, స్టడీ సర్కిల్ డెరైక్టర్ ఆర్ సురేంద్రకుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు 60 మంది అభ్యర్థులకు మెరిట్ ప్రాతిపదికన లేక స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ప్రవేశం కల్పిస్తామన్నారు. శిక్షణ కాలం 30 రోజులు ఉంటుందని, ఆ సమయంలో బ్యాంకు పరీక్ష హాల్ టికెట్ కాపీని ఇచ్చిన తరువాత నెలకు స్టయిఫెండ్ అందిస్తామని పేర్కొన్నారు. దరఖాస్తులను అక్టోబర్ 11వ తేదీలోగా డెరైక్టర్, ఏపీ బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయం, అబ్బాస్‌నగర్, కర్నూలు అనే చిరునామాకు పంపాలని కోరారు. వివరాలకు 08518-230275కు ఫోన్ చేసి సమాచారం పొందాలన్నారు. ఎలాంటి హాస్టల్ వసతి లేదని, దరఖాస్తుల్లో అభ్యర్థులు తమ ఫోన్ నంబర్లను తెలియజేయాలన్నారు.