ఇన్కమ్ ట్యాక్స్ నకిలీ అధికారి అరెస్ట్
కైకలూరు(కృష్ణా): ఇన్కమ్ ట్యాక్స్ అధికారినంటూ ఓ చేపల చెరువు వ్యాపారిని బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కృష్ణా జిల్లా కైకలూరులో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని ఓ చేపల చెరువు వ్యాపారిని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం కోమరోలు గ్రామానికి చెందిన సురేశ్ కుమార్ ఆదాయపు పన్ను అధికారినంటూ భూమి విక్రయం విషయంలో బెదిరించాడు. దీంతో సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయపడింది. పోలీసులు సురేశ్ కుమార్ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.