గ్రామస్తులపై సర్పంచ్ కత్తులతో దాడి
ఐ.పోలవరం: తూర్పుగోదావరి జిల్లా ఐ. పోలవరం మండలం టి. కొత్తపల్లి గ్రామ సర్పంచ్ వత్సవాయి రామకృష్ణంరాజు బుధవారం విచక్షణ కోల్పోయాడు. మతిస్దిమితం కోల్పోయి గ్రామస్తులపై కత్తితో దాడికి ప్రయత్నం చేశాడు. దీంతో గ్రామస్తులు సీతమ్మచెరువుగట్టు వద్ద సర్పంచ్‌ను స్దంభానికి కట్టివేశారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.