SV Ayurvedic
-
నేడు సీసీఆర్ఏఎస్కు ఆనందయ్య మందు నివేదిక
తిరుపతి: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందుపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ 500 మంది నుంచి నివేదిక తయారు చేసింది. ఈ కమిటీ నేడు( బుధవారం) సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్(సీసీఆర్ఏఎస్)కు నివేదిక సమర్పించనుంది. మరో రెండ్రోజుల్లో సీసీఆర్ఏఎస్ నుంచి నిర్ణయం వెలువడనుంది. ఆనందయ్య మందు కోసం దేశ వ్యాప్తంగా ప్రజల ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అన్ని అనుకూలిస్తే ఈ నెలాఖరుకు ఆయుర్వేద మందును టీటీడీ ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆనందయ్య కరోనాకు ఇచ్చిన ఆయుర్వేద మందును ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం, ఐసీఎంఆర్, ఆయుష్ అధికారులు పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. ఆ మందు ఎటువంటి హానికర పదార్థం కాదని స్పష్టత వచ్చింది. కేంద్రప్రభుత్వ ఐసీఎంఆర్, ఆయుష్‌శాఖల పరిశీలన తర్వాత ఆనందయ్య మందుకు అనుమతి వస్తే టీటీడీ ఆధ్వర్యంలోని ఆయుర్వేద ఫార్మసీలోనే ఈ ఔషధం తయారు చేయిస్తామని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: ఆనందయ్య మందుపై టీటీడీ పరిశోధన -
ఆనందయ్య మందుపై టీటీడీ పరిశోధన
సాక్షి, తిరుపతి: నెల్లూరు ఆనందయ్య మందు తయారీ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిశోధనను ముమ్మరం చేసింది. అందులో భాగంగా శ్రీవేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల హెచ్వోడీలు, పీజీ విద్యార్థులతో ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీ శాస్త్రీయ అధ్యయనం చేసిన అనంతరం కరోనా నివారణకు మందును తయారు చేసేందుకు టీటీడీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య కరోనాకు ఇచ్చిన ఆయుర్వేద మందును ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం, ఐసీఎంఆర్, ఆయుష్ అధికారులు పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. ఆ మందు ఎటువంటి హానికర పదార్థం కాదని స్పష్టత వచ్చింది. కేంద్రప్రభుత్వ ఐసీఎంఆర్, ఆయుష్‌శాఖల పరిశీలన తర్వాత ఆనందయ్య మందుకు అనుమతి వస్తే టీటీడీ ఆధ్వర్యంలోని ఆయుర్వేద ఫార్మసీలోనే ఈ ఔషధం తయారు చేయిస్తామని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయుర్వేద నిపుణులతో కలిసి ఎమ్మెల్యే చెవిరెడ్డి కృష్ణపట్నం వెళ్లి ఈ ఔషధాన్ని పరిశీలించారు. ఈ మందు ద్వారా కరోనా నివారణ అయితే ప్రజలందరికీ ప్రభుత్వ సహకారంతో టీటీడీతో ఉత్పత్తి చేయించి పంచే ఏర్పాట్లు చేస్తామని చెవిరెడ్డి పేర్కొన్నారు. ఇందుకోసం టీటీడీ ఆయుర్వేద ఫార్మసీలో రంగం సిద్దం చేస్తున్నారు. శాస్త్రీయ అధ్యయనంలో టీటీడీ కమిటీ ఆనందయ్య తయారు చేసిన మందును అనేకమంది కరోనా బాధితులకు పంపిణీ చేశారు. వారి నుంచి వివరాలు సేకరించి, ఆ మందులో కరోనాను నివారించే గుణాలు ఉన్నాయా? లేవా? అని తెలుసుకునేందుకు టీటీడీ చైర్మన్, ఈవోల ఆదేశాల మేరకు టీటీడీ ఆయుర్వేద వైద్యకళాశాల హెచ్‌వోడీలతో కమిటీ ఏర్పాటు చేశారు. ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో డాక్టర్ రేణుదీక్షిత్ పర్యవేక్షణలో ఆయుర్వేద వైద్యులు శ్రీదుర్గ, లక్ష్మణప్రసాద్, శ్రీనివాస్‌కుమార్, ఇన్చార్జ్ హెచ్వోడీలు రాగమాల, గోపాలకృష్ణలను కమిటీలో నియమించారు. వీరితోపాటు పీజీ విద్యార్థులు సుమారు 50 మంది ఈ అధ్యయనంలో పాల్గొంటున్నారు. విజయవాడకు చెందిన కొందరు ఆయుర్వేద వైద్యులు కూడా ఈ పరిశోధనలో భాగస్వాములయ్యారు. ఆనందయ్య మందు తీసుకున్న 500 మంది నుంచి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వారికి ఈ మందు పనిచేసిందా? లేదా? వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఈ మందు తీసుకున్నాక రానున్న రోజుల్లో ఎలా పనిచేయనుంది? అనే వివరాలు సేకరిస్తున్నారు. వివరాలన్నీ సేకరించాక.. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఏఎస్)కు నివేదిక పంపనున్నారు. కంట్లో డ్రాప్స్ వేయడం ఆయుర్వేదంలో ఓ ప్రక్రియ ఆయుష్ ఆధ్వర్యంలో క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నాం. ఆనందయ్య ఇచ్చిన మందు తీసుకున్న వారి రిపోర్ట్ తయారు చేస్తున్నాం. కంట్లో డ్రాప్స్ వేయడం ఆయుర్వేదంలో ఓ ప్రక్రియ. కంటి ద్వారా వేసిన మందు త్వరగా శరీరంలోకి చేరుతుంది. ఐసీఎంఆర్‌కు, ఆయుర్వేదానికి సంబంధం లేదు. కేంద్రంలో సీసీఆర్ఏఎస్ ఉంది. వారి అనుమతి తీసుకోవాలి. – డాక్టర్ రేణుదీక్షిత్, టీటీడీ కమిటీ పర్యవేక్షకురాలు -
‘ఉచిత’ దోపిడీ!
► ఎస్వీ ఆయుర్వేదిక్‌లో ఇంటిదొంగల దందా ► వైద్యుల టేబుల్ వద్దే మందుల అమ్మకాలు ► కమీషన్లకే పరిమితమైన వైద్యాధికారులు ► నిరుపేద రోగులకు తీరని అన్యాయం ► దిగజారుతున్న టీటీడీ ప్రతిష్ట ► చోద్యం చూస్తున్న టీటీడీ ఉన్నతాధికారులు తిరుపతి సిటీ: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీవెంకటేశ్వర ఆయుర్వేద వైద్యశాల, కొందరు ఇంటిదొంగ ల పనితీరు కారణంగా అభాసుపాలవుతోంది. చాలా కాలంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ దందాకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. దీంతో వైద్యం కోసం వస్తున్న నిరుపేద రోగులకు తీరని అన్యాయం జరుగుతోంది. వీటిని అరికట్టాల్సిన వైద్యాధికారులు వివిధ ఆయుర్వేద కంపెనీలు కట్టబెట్టే లక్షల కమీషన్లలో జోగుతుండగా, టీటీడీ ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు. రూ. కోట్ల బడ్జెట్ కల్గి ఉన్నతాశయంతో వెంకన్న నిధులతో నడుస్తున్న సంస్థ ప్రతిష్ట కొందరు చీడపురుగుల కారణంగా దిగజారుతోంది. ► వైద్యం కోసం ఇటీవల వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన వెంకటమ్మ ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రికి వస్తే, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఒకరు మాటామాటా కలుపుతూ ‘గంగమ్మ గుడి దగ్గర మంచి ఆయుర్వేద వైద్యం చేస్తారు. రూ.60 వేలు తీసుకుంటారు. 3 నెలల పాటు 15 రోజులకోసారి రావాలి. వచ్చిన ప్రతి సారీ రూ.20 వేలు కడితే సరిపోతుంది’ అని సలహా ఇచ్చారు. దాంతో ఆమె అక్కడకు వెళ్లేందుకు సిద్ధపడుతుండగా సమయానికి దూరపు బంధువు వచ్చి ఆపాడు. కోట్ల రూపాయల వేంకటేశ్వరస్వామి డబ్బుతో ఉచితంగా వైద్యం అందిస్తుంటే దళారీల మాటలు నమ్మకండి అని చెప్పడంతో ఆమె విరమించుకుని ఇక్కడేవైద్యం పొందారు. ► కౌమారబృత్యంలో మరో డాక్టర్ బయట మందుల దుకాణదారులతో కుమ్మక్కై తమ విభాగానికి వచ్చే రోగులకు ఆస్పత్రిలో లేని మందులే రాస్తున్నారు. సహజంగా మందులను వైద్యులు చిన్న చిన్న స్లిప్‌లలో రాసిస్తారు. వాటిని తీసుకెళ్తే ఆస్పత్రి ఫార్మసీలో మందులు ఇస్తారు. ఈ డాక్టరు మాత్రం స్లిప్పుల్లో ‘కాల్..మీ..’ అని రాసి అడ్రస్ చెప్పి మరీ బయటకు పంపుతారు. ► ప్రసూతి విభాగంలో ఉన్న ఒక డాక్టర్ బయట స్కానింగ్ కేంద్రాలతో కుమ్మక్కై అవసరం లేకున్నా వేలల్లో టెస్టులు రాసి రోగులను దోపిడీ గురిచేస్తున్నారు. ► పిల్లల విభాగంలో ఇద్దరు డాక్టర్లు బంగారం కలిపే కొన్ని రకాల ఖరీదైన మందులను రోగులకు ఆస్పత్రిలోని తమ సీట్ల వద్దే అంటగట్టి వేలల్లో డబ్బు గుంజుతున్నారు. ► ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంవోలు తరచూ ఆస్పత్రిలో రౌండ్స్‌లో ఉండాల్సి ఉండగా అందుకు విరుద్దంగా తమకు అనుకూలమైన కంపెనీలకు పెద్దస్థాయిలో ఆర్డర్లు పెట్టి లక్షల్లో కమీషన్లు పొందుతూ కాలం గడిపేస్తున్నారు. ► రూ.30 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన జనరేటర్ వైర్లను ఎలుకలు కొరికితే పట్టించుకోకుండా నెలల పొడవునా మూలన పడేశారు. ► ఇంకొందరు వైద్యులు అటెండర్లకు నెలానెలా రూ.3 వేలు అప్పజెప్పి రోగులను తమవద్దకు (బయట ఉన్న క్లినిక్‌లకు) పంపేలా ఏర్పాట్లు చేసుకుని మూడు ప్రిస్క్రిప్షన్లు.. ఆరు వేలుగా వ్యాపారం సాగిస్తున్నారు. మా దృష్టికి రాలేదు.. బంగారం కలిపై మందులను మేము తెప్పించడం లేదు. అలాంటి మందులను వైద్యులు వారి టేబుల్స్ దగ్గరే విక్రయిస్తున్నారనే విషయం ఇంకా మా దృష్టికి రాలేదు. విచారించి చర్యలు తీసుకుంటాం. మేమెతే అసవసరంగా టెస్టులు రాయడం లేదు. ఇక కాల్మీ అని రాసి పంపే స్లిప్‌లకు సంబంధించి అలా రాయవద్దని హెచ్చరికలు చేస్తున్నాం. -డాక్టర్ పార్వతి, సూపరింటెండెంట్, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి