swati dikshit
-
ఆస్తులు అమ్మి ఈ సినిమా తీశా
నటుడు సూర్య (పింగ్ పాంగ్) హీరోగా నటించి, నిర్మించిన సినిమా ‘కలియుగ’. రాజ్, స్వాతి దీక్షిత్ జంటగా నటించారు. తిరుపతి దర్శకత్వంలో సూర్య నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. సూర్య మాట్లాడుతూ– ‘‘18ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా. ఇప్పటి వరకూ నేను పడిన కష్టాన్నంతా ‘కలియుగ’ సినిమాకి ప్రాణంగా పెట్టా. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సంఘటనలకు మా సినిమా అద్దం పడుతుంది. ఈ కథని కొందరు నిర్మాతలకి చెప్పినా వారు ముందుకు రాలేదు. ఓ మంచి సినిమాని ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో నా తల్లిదండ్రుల సహకారంతో ఆస్తులు అమ్మి మరీ ఈ సినిమా నిర్మించా’’ అన్నారు. -
ఆలోచింపజేసే కలియుగ
రాజ్, స్వాతీ దీక్షిత్ జంటగా తిరుపతి దర్శకత్వంలో నటుడు సూర్య (పింగ్ పాంగ్) నిర్మించిన చిత్రం ‘కలియుగ’. ఈ నెల 6న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు సత్యదేవ్ మాట్లాడుతూ– ‘‘సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తీసిన సూర్యకు అభినందనలు. సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని అనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘దర్శకుడు తిరుపతి సినిమాను బాగా తెరకెక్కించారు. భవిష్యత్‌లో సూర్య ఇలాంటి సినిమాలను ఎన్నో నిర్మించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రాజ్. ‘‘రెగ్యులర్ కథలను పక్కనపెట్టి సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా స్క్రిప్ట్ రాసుకున్నాను. చిత్రీకరణ సమయంలో సూర్య సపోర్ట్ మరువలేనిది. మా చిత్రం పాటను విడుదల చేసిన పవన్‌కల్యాణ్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు తిరుపతి. ‘‘లవ్, యాక్షన్, సెంటిమెంట్ అన్నీ ఉన్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. సునీల్ కశ్యప్ మంచి సంగీతం ఇచ్చారు’’ అన్నారు సూర్య. ‘‘సూర్య మంచి సినిమా తీశాడు’’ అన్నారు తాగుబోతు రామేష్. -
జెంటిల్ మెన్... ఈ లేడీని చూడండి!
-
సైబర్ నేరాల ప్రభావం
‘‘ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించాలనే ఆశయంతో ఈ సినిమా నిర్మిస్తున్నా. మంజునాధ్‌లో మంచి దర్శకుడు ఉన్నాడనే నమ్మకంతో ఈ చిత్రానికి అవకాశం ఇచ్చాను. యువతరానికి కనెక్ట్ అయ్యే కథాంశంతో ఈ సినిమా ఉంటుంది’’ అని మధుర శ్రీధర్ చెప్పారు. గోతెలుగు.కామ్ సమర్పణలో పీఎల్ క్రియేషన్స్, షిర్టిసాయి కంబైన్స్‌పై ఎమ్వీకే రెడ్డి, మధుర శ్రీధర్ నిర్మిస్తున్న చిత్రం ‘లేడీస్ అండ్ జెంటిల్మెన్’. పీబీ మంజునాధ్ దర్శకుడు. చైతన్యకృష్ణ, అడవి శేష్, కమల్ కామరాజు, మహత్ రాఘవేంద్ర, నిఖితా నారాయణ్, స్వాతీ దీక్షిత్, జాస్మిన్ ముఖ్య తారలు. చిత్ర సంగీతదర్శకుడు రఘు కుంచె స్వరపరచిన ఈ చిత్రం ప్రచార గీతాన్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న లగడపాటి శ్రీధర్, మల్టీ డైమన్షన్ వాసు, నీలకంఠ తదితరులు ప్రచార గీతం బాగుందని, సినిమా కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నామని అన్నారు. బుర్రకథ నేపథ్యంలో సోషల్ నెట్వర్క్ గురించి తెలిపే పాట ఇదని రఘు కుంచె చెప్పారు. మానవ సంబంధాలకంటే సోషల్ మీడియాకే నేటి తరం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, సైబర్ నేరాలు ఎలాంటి ప్రభావం చూపుతున్నాయనే కథాంశాన్ని వినోద ప్రధానంగా తెరకెక్కించామని దర్శకుడు చెప్పారు.