మారుతీ స్విఫ్ట్‌లో కొత్త వేరియంట్..
న్యూఢిల్లీ: దిగ్గజ వాహన తయారీ కంపెనీ ‘మారుతీ సుజుకీ’ తాజాగా తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ‘స్విఫ్ట్’లో లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్ ‘స్విఫ్ట్ డెకా’ను మార్కెట్లోకి తెచ్చింది. దీని ధర రూ.6.86 లక్షల (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) వరకూ ఉంది. ఇందులో బ్లూటూత్‌తో కూడిన టచ్‌స్క్రీన్ మల్టీమీడియా సిస్టమ్, ఎక్స్టీరియర్/ఇంటీరియర్ స్టైలింగ్ కిట్, స్పోర్టీ బాడీ గ్రాఫిక్స్, ఫుట్‌బాల్ థీమ్డ్ సీట్ కవర్స్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ఇది రెండు వెర్షన్లలో అందుబాటులో ఉంటుందని తెలిపింది. వీటి ధరలు వరుసగా రూ.5.94 లక్షలుగా, రూ.6.86 లక్షలుగా ఉన్నాయని పేర్కొంది.