syberabad police
-
మెగా హీరోను వదలని యాక్సిడెంట్ కేసు.. త్వరలోనే ఛార్జ్‌షీట్
Sai Dharam Tej Bike Accident Case: CP To File Chargesheet Over His Rash Driving: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కేసు మరోసారి తెరమీదకి వచ్చింది. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి నోటీసులు జారీ చేసిన పోలీసులు తాజాగా సాయితేజ్‌పై ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నారు. సైబరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో కమిషనర్ స్టీఫెన్ రవింద్ర మాట్లాడుతూ.. 'హీరో సాయిధరమ్ తేజ్‌కు జరిగిన రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి, అతడు కోలుకున్నాక 91 CRPC కింద నోటీసులు ఇచ్చాం. లైసెన్స్, ఆర్సీ, ఇన్సురెన్స్,పొల్యూషన్ సర్టిఫికెట్ డాక్యుమెంట్స్ వివరాలు ఇవ్వాలని కోరాం. కానీ అతడి నుంచి ఎలాంటి వివరణ రాలేదు. దీంతో త్వరలోనే సాయితేజ్‌పై ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తాం' అని సీపీ వెల్లడించారు. కాగా కేబుల్ బ్రిడ్జి సమీపంలో సెప్టెంబర్10న సాయితేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఇటీవలె ప్రమాదం నుంచి కోలుకున్న తేజ్ ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టాడు. -
మూడో కన్నుతో నిఘా
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలపై సైబరాబాద్ పోలీసులు భారీ నిఘా వేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో ఎన్నికలు జరుగుతున్న 150 డివిజన్లలో ప్రచారం దగ్గరి నుంచి పోలింగ్ వరకు గచ్చిబౌలిలో ఇటీవల ప్రారంభించిన పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ అండ్ డేటా సెంటర్ నుంచే పరిశీలిస్తున్నారు. ఒకేసారి 15,000 సీసీటీవీ కెమెరాలు పర్యవేక్షించే సామర్థ్యమున్న ఈ సెంటర్ నుంచి ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో వీడియో చూసి స్థానిక పోలీసులను అప్రమత్తం చేసే విధంగా ఇక్కడి సిబ్బంది పనిచేస్తోంది. ప్రతిరోజూ 24 గంటల పాటు మూడు షిఫ్ట్‌ల పద్ధతిన దాదాపు 50 మంది వరకు పనిచేస్తున్నారు. అలాగే సమస్యాతక, అతి సమస్యాతక ప్రాంతాలపై సీసీటీవీ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా వేసి క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేసేలా విధులు నిర్వహిస్తున్నారు. పెట్రోలింగ్ చార్ట్‌లు, హాట్‌స్పాట్ మ్యాపింగ్, రిపీట్ ఇన్సిడెంట్ మ్యాపింగ్, టార్గెట్ ప్రొఫైల్ అనాలసిస్, సస్పెక్ట్ అనాలాసిస్, ఛేంజ్ ఓవర్ టైమ్ మ్యాపింగ్ వివరాలు ఉండడంతో ఆయా ప్రాంతాలపై సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడైనా ఏదైనా ఘటన జరిగితే వెంటనే అక్కడికి క్షణాల వ్యవధిలోనే పెట్రోలింగ్ వాహనం వెళ్లేలా చూస్తున్నారు. ఎన్నికల్లో భాగంగా ఏవైనా ఘర్షణలు జరిగినా, కొట్లాటలు జరిగినా సంబంధిత ఫొటోలు, వీడియోలు ఈ సెంటర్ ద్వారానే నిమిషాల వ్యవధిలో సేకరించనున్నారు. అలాగే ఆయా సీసీటీవీలకు చిక్కిన నిందితుల ఫేషియల్ రికగ్నేషన్ చేసి ట్రాకింగ్ చేస్తారు. ఇలా ఈ సెంటర్ ఆయా ప్రాంతాల్లోని క్షేత్రస్థాయి సిబ్బంది ఘటనాస్థలికి వెళ్లే లోపు పూర్తి సమాచారాన్ని తెలుసుకుని అప్డేట్ చేస్తారు. ప్రస్తుతం ఇవీ అనుసంధానమైనవి.. 10,000 ప్రభుత్వ కెమెరాలు 126 కమాండ్ కంట్రోల్ సెంటర్లు (ఠాణాలవి) ఒక లక్ష–కమ్యూనిటీ అండ్ ఇతర ఏజెన్సీ సీసీటీవీ ఇంటిగ్రేషన్ 2828 జంక్షన్లు 38 ఫేషియల్ రికగ్నేషన్ కెమెరాలు 1322–జీపీఎస్–ఎనబ్లెడ్, కనెక్టెడ్ పెట్రోల్ వెహికల్స్ శాంతిభద్రతలకు ఎంతో ఉపయోగం ‘దేశంలోనే మొదటిదైన ఈ సెంటర్‌ను రెండు అంతస్తుల్లో నిర్మించారు. రియల్ టైమ్ మానిటరింగ్, డయల్ 100కు సంబంధించి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైమ్, హాక్ ఐ యాప్ సేవలు గ్రౌండ్ ఫ్లోర్లో, వార్‌రూమ్, డాటా సెంటర్ తొలి అంతస్తులో ఉంది. ఒకే సమయంలో 15 వేల సీసీటీవీ కెమెరాలు మానిటర్ చేసేలా భారీ స్క్రీన్ల సకల సౌకర్యాలు ఉన్నాయి. శాంతిభద్రతలు, ట్రాఫిక్, అత్యవసర సేవలు ఇక్కడి నుంచే పర్యవేక్షించవచ్చు.ముఖ్యంగా ఇది ఫీల్డ్ ఆఫీసర్లకు ఉపయోగపడనుంది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఎప్పటికప్పుడూ మానిటరింగ్ చేసేందుకు ఈ సెంటర్ ఎంతో ఉపయోగపడనుంది. ఎక్కడేమి జరిగినా క్షేత్రస్థాయి సిబ్బందిని నిమిషాల వ్యవధిలో అప్రమత్తం చేసే వీలుంది’ అని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అన్నారు. -
'సై'బ'రా'బాద్
సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసుల ఎదురుకాల్పుల్లో ‘దిశ’ నిందితులుహతమయ్యారనే వార్త బయటకు రాగానే..రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఒక్కసారిగా ఉద్వేగం ఉబికివచ్చింది. అత్యధికులు పోలీసు చర్యని కొనియాడుతూ... నీరాజనాలు పట్టారు. సోషల్‌మీడియాలోనూ భారీగా ఇదే ట్రోల్ అయింది. కొందరు పోలీసులపై పూలవర్షం కురిపిస్తే..మరికొందరు సైబరాబాద్ సీపీ సజ్జనార్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. ఎన్కౌంటర్ వార్త విన్న తర్వాత ప్రజల్లో కలిగిన ఉద్విగ్నానికి, ఉద్వేగానికి ఇవే ప్రత్యక్ష నిదర్శనాలు. ప్రజలు ఈ స్థాయిలో స్పందించి పోలీసుల చర్యను సమర్థించడానికి గత ఉదంతాల వల్ల తలెత్తిన అసంతృప్తేకారణమని నిపుణులు చెప్తున్నారు. ప్రేమ పేరుతో యువతులను వేధించి, బలితీసుకున్న ఉన్మాదుల ఉదంతాలు,హత్యాచారాలకు సంబంధించిన ఘాతుకాలు గతంలోనూ అనేకం చోటు చేసుకున్నాయి. అయితే ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం సహా వేటిలోనూ బాధితులకు పూర్తి న్యాయం జరగలేదనే భావన ప్రజల్లో నాటుకుపోయింది. విజయవాడకు చెందిన ఎంసీఏ విద్యార్థిని శ్రీలక్ష్మిని కళాశాల క్లాస్‌రూమ్‌లోనే మనోహర్ అనే ఉన్మాది దారుణంగా నరికి చంపాడు. మనోహర్‌ను అరెస్టు చేసిన పోలీసులు అతనిపై సుదీర్ఘ దర్యాప్తు జరిపి ఆధారాలు సేకరించారు. విచారణ అనంతరం కింది కోర్టు నిందితుడికి ఉరి శిక్ష విధించింది. దీనిపై మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ తీర్పును నిందితుడి తరఫు న్యాయవాదులు హైకోర్టులో సవాల్ చేశారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. శ్రీలక్ష్మి ఉదంతాన్ని ఆద్యంతం గమనించిన అనేక మందికి ఈ శిక్ష మనోహర్‌కు చాలదని భావించి నిర్లిప్తత వ్యక్తం చేశారు. గుంటూరులో చోటు చేసుకున్న ప్రసన్న లక్ష్మి ఉదంతం సైతం ఈ కోవకు చెందినదే. నిందితుడు సుభానీకి కింది కోర్టు వేసిన ఉరి శిక్షను హైకోర్టు యావజ్జీవంగా మార్చింది. కొన్నేళ్ల క్రితం విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం ఉమెన్స్ హాస్టల్లో చోటు చేసుకున్న ఆయేషా మీరా ఉదంతంలోనూ బాధితులకు పూర్తి న్యాయం జరగలేదనే భావన ప్రజల్లో ఉంది. కొన్ని నెలల పాటు ఈ కేసు అపరిష్కృతంగా మిగిలిపోయింది. చివరకు పోలీసులు నిందితుడని ఆరోపిస్తూ సత్యంబాబును అరెస్టు చేసినా..ఈ కేసు ఉన్నత న్యాయస్థానంలో వీగిపోయింది. ‘దిశ’ నిందితుల ఎన్కౌంటర్ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే నిర్భయ తల్లి సైతం తమకు పూర్తి న్యాయం జరగలేదని స్పందిస్తూ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఇలాంటి అసంతృప్తుల మధ్య ఉన్న ప్రజలు దిశ ఉదంతం చోటు చేసుకోవడంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ఇది జరిగిన 24 గంటల్లోనే నిందితులను అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు మీడియా ముందు హాజరుపరిచారు. విలేకరుల సమావేశంలో పోలీసులు వెల్లడించిన వాస్తవాలు ప్రజలకు మరింత ఆగ్రహాన్ని కలిగించాయి. ప్రతి ఒక్కరిలోనూ పైకి చెప్పుకోలేని ఓ విధమైన భీతి గూడుకట్టుకుపోయింది. ఈ మానసిక సంఘర్షణలో ఉన్న వారికి ఎన్కౌంటర్ వార్త ఎంతో ఉద్వేగానికి గురిచేసింది. నిందితులకు తగిన శిక్ష పడిందనే భావం వ్యక్తమైంది. ఫలితంగానే రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికుల స్పందన పోలీసు చర్యలను సమర్థిస్తూనే వచ్చింది. -
ఆ వీడియోలతో బ్లాక్మెయిల్: శాడిస్ట్ భర్త అరెస్ట్
-
9490617444 నెంబరు వాట్సప్‌తో నేరాలకు చెక్
నగర ప్రజల రక్షణ కోసం సైబరాబాద్ పోలీసులు సరికొత్త ప్రయోగానికి నాంది పలికారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వాట్సప్‌ను కమిషనర్ సీవీ ఆనంద్ శుక్రవారం ప్రారంభించారు. నేరాలకు సంబంధించిన సమాచారంగానీ, ఫొటోలుగానీ, వీడియోలుగానీ పంపించాలనుకుంటున్నవారు ప్రత్యేకంగా కేటాయించిన వాట్సప్ నంబర్ 9490617444 ద్వారా పంపించవచ్చని తెలిపారు. దీంతో పోలీసులు సత్వర సేవలు అందిస్తారని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు అవుతుందని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. అలాగే ఇక నుంచి సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి లేదా అంతకంటే ఎక్కువ హోదా ఉన్న ట్రాఫిక్ పోలీసులు మాత్రమే వాహన వినియోగదారులకు ఫైన్ విధిస్తారన్నారు. ఎస్ఐ కన్నా కింది ర్యాంకు పోలీసులైతే నియమ నిబంధనలు పాటించిన వాహనాలను ఫొటోలు మాత్రమే తీయాలని, ఏదైనా వివాదానికి దారి తీస్తే ఎస్ఐ వచ్చేంతవరకు ఆ వాహనాన్ని పక్కకు ఉంచాలని చెప్పారు. అన్ని పత్రాలు ఉన్నప్పటికీ తప్పుడుగా ఫైన్ వేస్తే రశీదును స్వీకరించి వసూలు చేసిన పోలీసు అధికారిపై ఫిర్యాదు చేయొచ్చని, లేదా 9010203626 నెంబర్‌కు సంప్రదించవచ్చని చెప్పారు.