ప్రిన్స్ లిప్‌కిస్...
తెలుగులో లిప్‌కిస్‌లు సర్వసాధారణమైపోతున్నాయి. ‘డాలర్స్ కాలనీ’ సినిమా కోసం ఇటీవలే హీరో హీరోయిన్లు ప్రిన్స్, నిఖితా పవార్‌పై లిప్‌కిస్ చిత్రీకరించారు. శ్రీ చంద్ ముల్లా దర్శకత్వంలో ఎస్. రత్నమయ్య, టి. గణపతిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికి 70 శాతం షూటింగ్ పూర్తయిందని, ఈ నెలాఖరుకల్లా మిగిలిన పని పూర్తి చేసి, మే చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఇది రొమాంటిక్ హారర్ చిత్రమని, ప్రిన్స్ కొత్తలుక్‌తో కనిపిస్తారని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మల్లిక్ ఎమ్.వి.కె., కెమెరా: ఎ.సుధాకర్‌రెడ్డి.