తొలి టి20లో ఇంగ్లండ్ గెలుపు
దుబాయ్: పాకిస్తాన్తో జరిగిన తొలి టి20లో ఇంగ్లండ్ 14 పరుగులతో విజయం సాధించింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత 20 ఓవర్లలో 5 వికెట్లకు 160 పరుగులు చేసింది. బిల్లింగ్స్ (25 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మోర్గాన్ (45 నాటౌట్), విన్సీ (41) రాణించారు. పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటయింది. తన్వీర్ (25) టాప్ స్కోరర్. ఇంగ్లండ్ బౌలర్లలో టోప్లీ, ప్లంకెట్ మూడేసి వికెట్లు తీశారు.