Tamil Nadu cricket association
-
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ ఓపెనర్
Murali Vijay Announces Retirement: టీమిండియా వెటరన్ ఓపెనింగ్ బ్యాటర్, తమిళనాడు క్రికెటర్ మురళి విజయ్.. క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు ఇవాళ (జనవరి 30) ప్రకటించాడు. మురళి విజయ్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించాడు. రిటైర్మంట్ నోట్లో విజయ్ తనకు సహకరించిన వారందికీ ధన్యవాదాలు తెలిపాడు. 16 ఏళ్ల (2002-2018) పాటు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించడం గౌరవంగా భావిస్తున్నాని విజయ్ పేర్కొన్నాడు. @BCCI @TNCACricket @IPL @ChennaiIPL pic.twitter.com/ri8CCPzzWK — Murali Vijay (@mvj888) January 30, 2023 తనకు అవకాశాలు కల్పించిన బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్, చెన్నై సూపర్ కింగ్స్, చెమ్‌ప్లాస్ట్ సన్మార్ ఫ్రాంచైజీల యజమాన్యాలకు విజయ్ కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే, తన టీమ్ మేట్స్, కోచెస్, మెంటార్స్, సపోర్టింగ్ స్టాఫ్‌లకు కూడా ధన్యవాదాలు తెలిపాడు. ముఖ్యంగా తన కెరీర్లో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నప్పుడు అండగా నిలిచిన ఫ్యాన్స్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నాడు. తనపై అన్ కండిషనల్ లవ్ చూపిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. తన సెకెండ్ ఇన్నింగ్స్‌ను క్రికెట్‌కు సంబంధించిన వ్యాపారంలో కొనసాగిస్తానని తెలిపాడు. 38 ఏళ్ల మురళి విజయ్.. టీమిండియా తరఫున 61 టెస్ట్‌లు, 17 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో 12 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీల సాయంతో 3982 పరుగులు చేసిన విజయ్.. వన్డేల్లో ఒక హాఫ్ సెంచరీ సాయంతో 339 పరుగులు, టీ20ల్లో 169 పరుగులు చేశాడు. ఐపీఎల్లో 106 మ్యాచ్‌లు ఆడిన విజయ్.. 2 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీల సాయంతో 2619 పరుగులు చేశాడు. విజయ్ తన ఐపీఎల్ ప్రస్థానంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు ఢిల్లీ డేర్‌డెవిల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. అలాగే కౌంటీల్లో ఎసెక్స్, సోమర్సెట్ జట్ల తరఫున ఆడాడు. విజయ్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌తో పాటు లిస్ట్-ఏ క్రికెట్లోనూ మంచి ట్రాక్ రికార్డు ఉంది. రిటైర్మెంట్ వయసుకు సంబంధించి విజయ్ ఇటీవలే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ క్రికెట్లో 30 ఏళ్లు దాటితే 80 ఏళ్ల వృద్ధుడిలా చూస్తారని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ ప్రకటన చేసిన రోజుల వ్యవధిలోనే విజయ్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. -
మనోళ్లు మైదానంలోకి...
చెన్నై: భారత్, ఇంగ్లండ్ మధ్య జరగబోయే టెస్టు సిరీస్‌కు ముందు ఇరు జట్ల ఆటగాళ్లు ఆరంభ విఘ్నాన్ని అధిగమించారు. నిబంధనల ప్రకారం నిర్వహించిన కోవిడ్–19 పరీక్షల్లో క్రికెటర్లంతా నెగెటివ్‌గా తేలారు. ఆరు రోజులుగా ఆటగాళ్లంతా క్వారంటైన్లో ఉన్నారు. సోమవారంతో ఇది ముగిసింది. ఈ ఆరు రోజుల కాలంలో ఒక్కో ఆటగాడికి మూడుసార్లు చొప్పున కరోనా టెస్టులు జరిపారు. అన్నింటిలోనూ నెగెటివ్ ఫలితం రావడంతో ఎలాంటి సమస్య లేకుండా టెస్టు సిరీస్ ఆరంభానికి రంగం సిద్ధమైంది. తొలి టెస్టు మ్యాచ్‌కు ముందు ఇరు జట్లకు మూడు రోజుల పూర్తి స్థాయి నెట్ ప్రాక్టీస్‌కు అవకాశం ఉంది. మంగళవారం నుంచి గురువారం వరకు సాధన చేసేందుకు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. సోమవారం సాయంత్రమే కొందరు భారత ఆటగాళ్లు మైదానంలోకి దిగి అవుట్డోర్ సాధనకు ఉపక్రమించారని బీసీసీఐ వెల్లడించగా... నేడు ఆటగాళ్లంతా నెట్స్‌లోకి వస్తారని ఇంగ్లండ్ బోర్డు ప్రకటించింది. శ్రీలంక పర్యటనకు వెళ్లకుండా నేరుగా ఇంగ్లండ్ నుంచి వచ్చిన బెన్ స్టోక్స్, ఆర్చర్, బర్న్స్ క్వారంటైన్ పూర్తి చేసుకొని గత రెండు రోజులుగా సాధన చేస్తూనే ఉన్నారు. ఈ నెల 5 నుంచి తొలి టెస్టు, 13 నుంచి రెండో టెస్టు చెన్నైలో జరగనుండగా... తర్వాతి రెండు టెస్టులకు అహ్మదాబాద్ ఆతిథ్యమిస్తుంది. ఆస్ట్రేలియా గడ్డపై సాధించిన అద్భుత విజయంతో టీమిండియా అమితోత్సాహంతో బరిలోకి దిగుతుండగా... శ్రీలంకపై 2–0తో గెలిచిన ఇంగ్లండ్ జట్టులో కూడా ఆత్మవిశ్వాసం మెండుగా కనిపిస్తోంది. -
చంద్రశేఖర్‌ది ఆత్మహత్య
సాక్షి, చెన్నై: భారత మాజీ క్రికెటర్ వీబీ చంద్రశేఖర్ (58) గుండెపోటుతో మరణించలేదని, ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు ధ్రువీకరించారు. ఆయన బలవన్మరణానికి అప్పులే కారణమని తేల్చారు. ఆర్థిక సమస్యల వల్లే చెన్నైలోని తన నివాసంలో చంద్రశేఖర్ గురువారం ఉరేసుకొని మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఆయన మరణవార్తతో తమిళనాడు క్రికెట్ సంఘం వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో కాంచీ వీరన్స్ జట్టును ఆయన కొనుగోలు చేశారు. దీని నిర్వహణతో పాటు తన అకాడమీ కోసం బ్యాంకులు, సన్నిహితుల వద్ద రూ. 3 కోట్ల మేర అప్పు చేశారు. చివరకు చెల్లించలేని పరిస్థితి తలెత్తడంతో ఆత్మహత్య చేసుకున్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. చెన్నై రాయపేట ఆసుపత్రిలో శుక్రవారం చంద్రశేఖర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్, క్రికెటర్లు దినేష్ కార్తీక్, మురళీ విజయ్, విజయ్ శంకర్‌లతో పాటు తమిళనాడు క్రికెట్ సంఘం సభ్యులు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. -
‘సారీ’ పేరు మారింది
ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్ తమిళనాడు క్రికెట్ సంఘం అధ్యక్షుడి హోదాలో తమ సమావేశాలకు హాజరు కావచ్చో లేదో తెలపాలంటూ సెప్టెంబరు 12వ తేదీన బీసీసీఐ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. అయితే అందులో శ్రీనివాసన్ తండ్రి పేరు నటేశన్ అయ్యర్‌గా ప్రస్తావించారు. ఈ పేరుగల వ్యక్తి చెన్నైలో ఓ ప్రముఖ ఆడిటర్. ఎన్.శ్రీనివాసన్ తండ్రిపేరు నారాయణ స్వామి. తర్వాత బోర్డు లాయర్లు కాకతాళీయంగా ఈ పిటిషన్‌ను చూస్తే తప్పు కనిపించింది. వెంటనే లబోదిబో మంటూ మళ్లీ కోర్టుకు పరిగెత్తారు. తమ పిటిషన్లో పేరు తప్పుగా రాసిన విషయాన్ని ప్రస్తావిస్తూ సెప్టెంబరు 23న దానిని సరిదిద్దుకుని తిరిగి మరో పిటిషన్ సమర్పించారు. -
సొంత రాష్ట్రంలోనూ శ్రీనివాసన్ హవా
చెన్నై: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ఐసీసీ చైర్మన్ ఎన్. శ్రీనివాసన్ సొంత రాష్ట్రంలోనూ హవా కొనసాగిస్తున్నారు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్(టీఎన్ సీఏ) అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన టీఎన్ సీఏ 85వ వార్షిక కార్యవర్గ సమావేశంలో శ్రీనివాసన్ ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఏడాది పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుత టీఎన్ సీఏ కార్యదర్శి కాశీ విశ్వనాథన్ కూడా తన పదవిని నిలబెట్టుకున్నారు. వీపీ నరసింహన్ కోశాధికారిగా ఎన్నికయ్యారు. -
'లుంగీ' వివాదంపై జయలలిత కన్నెర్ర!
చెన్నై: 'లుంగీ' వివాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కన్నెర్ర చేశారు. తమిళనాడు సంస్కృతికి వ్యతిరేకంగా జరిగే సంఘటనలను అరికట్టేందుకు కొత్త చట్టాన్ని రూపొందిస్తామని జయలలిత హామీ ఇచ్చారు. క్లబ్బు, రిసార్టులు, ఇతర సంస్థలు ఇలాంటి చర్యలకు దిగితే సహించేది లేదని జయలలిత వార్నింగ్ ఇచ్చారు. భవిష్యత్ లో ఇలాంటి చర్యలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని, లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు. లుంగీ ధరించారనే కారణంతో మద్రాస్ హైకోర్టు జడ్జిలు, న్యాయవాదులను తమ క్లబ్ లోకి అనుమతించకుండా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం తమిళనాడును కుదిపేసింది.