Tamil Nadu woman
-
గొలుసుతో చెట్టుకు కట్టేసి
ముంబై: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ అడవుల్లో ఇనుప గొలుసుతో చెట్టుకు కట్టేసి ఉన్న ఓ మహిళ కనిపించింది. రోజులుగా ఆహారంలేక ఆమె శరీరం చిక్కి శల్యమైపోయింది. పశువుల కాపరి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. మహిళ దగ్గర దొరికిన యూఎస్ పాస్‌పోర్ట్, ఆధార్, ఇతర డాక్యుమెంట్ల ఆధారంగా లలిత కాయి కుమార్ ఎస్‌గా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. సింధుదుర్గ్‌లో సోనుర్లి గ్రామానికి చెందిన ఓ పశువుల కాపరి శనివారం సమీపంలోని అడవులకు వెళ్లాడు. అక్కడ అతనికి మనిషి మూలుగు వినిపించింది. దగ్గరకు వెళ్లి చూడగా ఓ మహిళ కాలికి ఇనుప గొలుసులతో చెట్టుకు కట్టేసి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను సావంత్‌వాడీ ఆరోగ్యకేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గోవా మెడికల్ కాలేజీకి తరలించారు. మహిళ దగ్గర యూఎస్ పాస్‌పోర్ట్, తమిళనాడు అడ్రస్‌తో ఆధార్ ఉందని, పదేళ్లుగా ఆమె తమిళనాడులో ఉంటోందని పోలీసులు తెలిపారు. కొన్ని రోజులుగా ఆహారం లేకపోవడంతో ఆమె మాట్లాడలేని స్థితిలో ఉందన్నారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న మహిళను.. ఇంట్లో గొడవల కారణంగా భర్తే.. 40 రోజుల కిందట అడవిలో వదిలేసి వెళ్లినట్లుగా ఆస్పత్రిలో ఆమె రాసిన వివరాల ఆధారంగా తెలుస్తోందని పోలీసులు వెల్లడించారు. ఆమె వీసా గడువు కూడా ముగిసిందని, విదేశీయుల స్థానిక నమోదు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. మరోవైపు ఆమె భర్త, బంధువుల గురించి వించారించేందుకు కొన్ని బృందాలు తమిళనాడు, గోవా, ఇతర ప్రాంతాలకు వెళ్లాయన్నారు. -
ఇంటర్నెట్ కలిపింది ఇద్దరిని..
అన్నానగర్: ఇంటర్నెట్ ద్వారా పరిచయమైన కడలూరు ఉపాధ్యాయురాలిని అరబ్ దేశానికి చెందిన పారిశ్రామికవేత్త గురువారం హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నాడు. కడలూరుకి చెందిన గుణశేఖరన్ కుమార్తె చారులత (32). ఇంజినీర్ పట్టభద్రురాలైన ఈమెకు ఇంటర్నెట్ చాటింగ్ ద్వారా మూడేళ్ల కిందట అరబ్ దేశానికి చెందిన థామస్లూకాస్ రోహన్ స్నేహితుడిగా పరిచయం అయ్యాడు. రెండేళ్ల కిందట చారులత తన స్నేహితుడిని ఇంటికి పిలిచింది. థామస్లూకాస్ కడలూరు వచ్చి పలు స్థలాలు సందర్శించి తన దేశానికి తిరిగి వెళ్లాడు. కొన్ని నెలల తరువాత చారులత అరబ్ దేశానికి వెళ్లింది. ఆ దేశంలో ఆమెకు ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం దొరికింది. దీని తరువాత స్నేహితులు, ప్రేమికులుగా మారారు. గత మార్చి 23న అరబ్ దేశంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. తరువాత వారు హిందూ సంప్రదాయం ప్రకారం తమిళనాడులో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీని ప్రకారం థామస్ లూకాస్ రోహన్, చారులత వీరితో సహా నలుగురు కడలూరు వచ్చారు. వీరికి విరుదాచలం కొళంజియప్పర్ ఆలయంలో గురువారం ఉదయం 10.30 గంటలకు హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. -
రికార్డు సృష్టించనున్న తమిళనాడు మహిళ
చెన్నై: రెండో అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో తమిళనాడులోని ఓ మహిళా న్యాయవాది యోగాలో ప్రపంచ రికార్డు సృష్టించేందుకు సిద్ధమయ్యారు. కేపీ రంజన(34) వరల్డ్ రికార్డుకు చేరువయ్యారు. 53 గంటల పాటు నిర్విరామంగా యోగానాలు వేసిన ఘనత సాధించాలని సంకల్పించారు. రికార్డు సాధించేందుకు ఈ నెల 19న యోగాసనాలు వేయడం మొదలు పెట్టారు. 48 గంటల పాటు నిర్విరామంగా యోగాసనాలు వేస్తూ తన లక్ష్యానికి చేరువవుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆమె ఈ ఫీట్ పూర్తి చేస్తారని భావిస్తున్నారు. ఆమె 600 యోగాసనాలు వేస్తారని, ప్రతి గంటకు 5 నిమిషాలు మాత్రమే విశ్రాంతి తీసుకుంటారని మహమహర్షి ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ మహాయోగం ప్రతినిధి రమేశ్ రిషి తెలిపారు. నేపాల్ కు చెందిన ఉత్తమ్ ముక్తన్ అనే వ్యక్తి 50 గంటల 15 నిమిషాల పాటు యోగాసనాలు వేసి నెలకొల్పిన రికార్డును రంజన అధిగమించనుందని చెప్పారు.