భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్.. ఫ్యాన్స్‌కు ఫ్రీ ఎంట్రీ
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత మహిళల జట్టు.. ఇప్పుడు అదే జట్టుతో ఏకైక టెస్టు మ్యాచ్ కోసం సిద్దమవుతోంది. భారత్-దక్షిణాఫ్రికా మహిళల మధ్య ఏకైక టెస్టుకు చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదిక కానుంది. ఈ చారిత్రత్మక టెస్టు మ్యాచ్ జూన్ 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్‌సీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌ను వీక్షించేందుకు ఫ్యాన్స్‌కు ఉచితంగా ఎంట్రీ ఇవ్వాలని టీఎన్‌సీఏ నిర్ణయించింది. ఈ మెరకు టీఎన్‌సీఏ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మహిళా క్రికెట్ ఆదరణ పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఎన్‌సీఏ తెలిపింది. అదే విధంగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య మూడు టీ20ల సిరీస్ కూడా ఇదే వేదికలో జరగనుంది. ఈ సిరీస్ జూలై 1 నుంచి ప్రారంభం కానుంది.ఈ సిరీస్‌కు సంబంధించిన టిక్కెట్లను కూడా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ విడుదల చేసింది. గరిష్ట ధర రూ.150గా నిర్ణయించింది. కాగా టీ20 సిరీస్‌కు కూడా C, D ,E దిగువ స్టాండ్లకు అభిమానులను ఫ్రీగా ఎంట్రీ ఇవ్వనున్నారు.దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టుకు భారత జట్టుహర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, శుభా సతీష్, జెమిమా రోడ్రిగ్స్ (ఫిట్‌నెస్‌కు లోబడి), రిచా ఘోష్ (వికెట్ కీపర్), ఉమా చెత్రీ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, స్నేహ రాణా, సైకా ఇషాక్, రాజేశ్వరి గయాక్వాడ్, పూజా వస్త్రాకర్ (ఫిట్‌నెస్‌కు లోబడి), అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, మేఘనా సింగ్, ప్రియా పునియా, షబ్నమ్ షకీల్.