tamilnadu telugu yuvasakthi
-
50 శాతం షూటింగ్‌లు ఆంధ్రాలో జరపాలి
ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ మోహన్‌రెడ్డికి పలు సమ స్యలను విజ్ఞప్తి చేశారు. కేతిరెడ్డి మాట్లాడుతూ –‘‘తమిళనాడులోని తెలుగు విద్యార్థుల సమస్యలను అక్కడి ప్రభుత్వంతో సమాలోచన జరిపి తెలుగువారి సమస్యలను తీర్చాలి. ఒక బృందాన్ని తమిళనాడు పంపి వారి సమస్యలు తెలుసుకోవాలి. అలాగే తెలుగు సినిమాల షూటింగ్ 50 శాతం వరకూ ఆంధ్ర రాష్ట్రంలో జరిగే విధంగా చర్యలు చేపట్టాలి. ఆంధ్రప్రదేశ్‌లో స్థిరనివాసం ఏర్పరచుకున్న నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అన్ని రకాల వసతులు కల్పించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. -
'సై.. రా' అని పెట్టినందుకు ధన్యవాదాలు..
తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న 151వ చిత్రం ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు జీవిత చరిత్ర సినిమాకు 'సై.. రా' టైటిల్‌ను ఖరారు చేసినందుకు కేతిరెడ్డి చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదట్లో ఈ సినిమాకు మహావీర అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఆ ప్రకటన చూసిన తరువాత మేము చిరంజీవిని కలిశామన్నారు. రాయలసీమకు చెందిన వ్యక్తి, ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన స్వాతంత్ర్య సమరయోధుని జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీస్తున్నారు. ఈ సినిమాకు ఆయన పేరు ఉంటేనే బాగుంటుందని, ఇదీ ఉయ్యాలవాడ అభిమానులందరీ కోరిక అని చిరంజీవికి చెప్పినట్లు తెలిపారు. మా కోరికను మన్నించి కొన్ని మార్పులతో చిత్రానికి ఆ పేరు పెట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. సై.. సై.. రా నరసింహారెడ్డి సినిమాకు సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్లక్ష్యానికి గురైన స్వాతంత్ర్య సమరయోధుడి కథను దేశ ప్రజలకు చూపించేందుకు ఆయన ముందుకు రావడం హర్షానీయం అని కేతిరెడ్డి అన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని జాతీయ వీరుడుగా గుర్తించాలని గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వినతి పత్రం అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది ప్రస్తుతం కేంద్ర సాంస్కృతి శాఖ పరిశీలనలో ఉందని తెలిపారు. త్వరలో అది కూడా నేరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ త్వరలో ఉయ్యలవాడ పోస్టల్ స్టాంప్‌ను రీలిజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని జాతీయ యోధునిగా గుర్తించేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని కేతిరెడ్డి చెప్పారు. -
తమిళనాడు ఎన్నికల బరిలో తెలుగువాళ్లు
చెన్నై: తమిళనాడులో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగువారు పోటీ చేస్తున్నట్టు తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదేశ్వరరెడ్డి పేర్కొన్నారు. తమిళనాడులో బాషా పరిరక్షణ ఉద్యమంలో భాగంగా తెలుగు ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లో భాషపరంగా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనే ఆశతో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో తెలుగువారు పోటీచేస్తున్నట్టు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదేశ్వరరెడ్డి, సంస్థ కార్యదర్శులు మండ్లు శ్రీనివాసరావు, డి. శివశంకరరెడ్డి, యు. పించలయ్య, బి. గోవర్థన్, కె. మోహన కృష్ణ, ఎస్. బాలాజీలతో పాటు తమిళనాడుకు చెందిన తెలుగు సంఘాల ప్రముఖులందరూ చిత్తూరు పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి వినతిపత్రం సమర్పించినట్టు తెలిపారు. త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, సినీరంగ ప్రముఖులను కలిసి ఎన్నికలలో పోటీ చేయనున్న తెలుగువారికి, తెలుగు సంఘాలకు మద్దతు తెలపాలని కోరుతామని కేతిరెడ్డి తెలిపారు.