చైనీస్ రిపోర్టర్ నోట బాలీవుడ్ సాంగ్
సాక్షి, బీజింగ్: జియామెన్ నగరంలో నిర్వహిస్తున్న బ్రిక్స్ సదస్సుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటున్న విషయం తెలిసిందే. మూడు రోజుల పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ తో మోదీ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు.
ఇదిలా ఉంటే బ్రిక్స్ సమ్మిట్‌ను కవరేజీ చేయటానికి వెళ్లిన మన మీడియాకు ఊహించని అనుభవం ఎదురైంది. చైనా రేడియోలో పని చేసే ఓ మహిళా రిపోర్టర్ హిందీలో పాట పాడి ఆకట్టుకుంది. తంగ్ యువాంగై అనే ఉద్యోగిణి బాలీవుడ్ క్లాసిక్ మూవీ నూరీ(1979) లోని ఆజా రే ఓ దిల్ మేరే దిల్బర్ ఆజా అంటూ గొంతు విప్పి... చిన్నపాటి సర్ప్రైజ్ నే అందించింది. ఆ వీడియోను మీరూ చూడండి.
ఇదిలా ఉంటే రెండు నెలలపాటు కొనసాగిన డొక్లామ్ వివాదం అనంతరం ఇరు దేశాల నేతలు భేటీ అవుతుండటం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. సరిహద్దు అంశంతోపాటు ద్వైపాక్షిక ఒప్పందాల అంశం జింగ్పింగ్-మోదీ మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది.