చైనీస్‌ రిపోర్టర్‌ నోట బాలీవుడ్ సాంగ్ | China Reporter Sings Bollywood Classic Song at BRICS Summit | Sakshi
Sakshi News home page

చైనీస్‌ రిపోర్టర్‌ నోట బాలీవుడ్ సాంగ్

Published Mon, Sep 4 2017 11:15 AM | Last Updated on Sun, Sep 17 2017 6:23 PM

చైనీస్‌ రిపోర్టర్‌ నోట బాలీవుడ్ సాంగ్

చైనీస్‌ రిపోర్టర్‌ నోట బాలీవుడ్ సాంగ్

సాక్షి, బీజింగ్‌: జియామెన్‌ నగరంలో నిర్వహిస్తున్న బ్రిక్స్ సదస్సుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటున్న విషయం తెలిసిందే. మూడు రోజుల పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్‌ తో మోదీ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. 
 
ఇదిలా ఉంటే బ్రిక్స్ సమ్మిట్‌ను కవరేజీ చేయటానికి వెళ్లిన మన మీడియాకు ఊహించని అనుభవం ఎదురైంది. చైనా రేడియోలో పని చేసే ఓ మహిళా రిపోర్టర్‌ హిందీలో పాట పాడి ఆకట్టుకుంది. తంగ్‌ యువాంగై అనే ఉద్యోగిణి బాలీవుడ్ క్లాసిక్‌ మూవీ నూరీ(1979) లోని ఆజా రే ఓ దిల్‌ మేరే దిల్‌బర్ ఆజా అంటూ గొంతు విప్పి... చిన్నపాటి సర్‌ప్రైజ్‌ నే అందించింది. ఆ వీడియోను మీరూ చూడండి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement