నామినేషన్ పనుల పరిమితి పెంపు?!
* నేడు మరోమారు కేబినెట్ సబ్‌కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం నామినేషన్‌పై అప్పగించే పనుల విలువను రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచేందుకు నిర్ణయించింది. దీన్ని చెరువుల పునరుద్ధరణ పనులకు వర్తింపజేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కేబినెట్ సబ్ కమిటీ గురువారం సమావేశమై విధివిధానాలను ఖరారు చేసి పరిశీలన కోసం ముఖ్యమంత్రికి పంపనుంది.
ప్రస్తుతం డిసెంబర్ నుంచి రాష్ట్రంలో పెద్దఎత్తున చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేయాలని భావిస్తున్న దృష్ట్యా నామినేషన్ పనుల విషయమై మరోమారు చర్చించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు నేతృత్వంలోని కమిటీ గురువారం సమావేశమై ఓ నిర్ణయానికి రానుంది. వీటితోపాటు ఈ ఏడాదిలో ఖర్చు చేయాల్సి ఉన్న జైకా, ఏఐబీపీ, నాబార్డ్, ఎన్ఆర్ఈజీఎస్ పథకాల నుంచి సమకూర్చుకోవాల్సిన నిధులపైనా చర్చించనున్నారు.