Taping
-
పార్లమెంట్‌ను కుదిపేసిన పెగసస్
న్యూఢిల్లీ: పెగసస్ దుమారం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. ఫోన్ ట్యాపింగ్‌పై నిగ్గు తేల్చాలంటూ ప్రతిపక్షాలు ఉభయసభలను అడ్డుకున్నాయి. దీంతో పలుమార్లు సభా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. సోమవారం సభ ఆరంభమైన వెంటనే సభ్యులు కార్గిల్ యుద్ధవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం ఒలింపిక్స్‌లో పతకం సాధించిన మీరాబాయి చానును అభినందించారు. వెంటనే రాజ్యసభలో కాంగ్రెస్, టీఎంసీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకుపోయారు. రూల్ 267 కింద విపక్ష నేతలు మల్లిఖార్జున్ ఖర్గే, వేణుగోపాల్, తిరుచ్చి శివ, సుకేందు శేఖర్ రాయ్, ఎలమారమ్ కరీన్ తదితరులు ఇచ్చిన నోటీసులను అనుమతించేది లేదని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య చెప్పారు. సభ్యులు కోరుకునే అంశాలపై చర్చ సభా సాధారణ సమయంలో చేయవచ్చన్నారు. రోజూవారీ కార్యకలాపాలను నిలిపివేసి ప్రత్యేక అంశంపై చర్చించేందుకు రూల్ 267 కింద నోటీసులు ఇస్తారు. విపక్ష సభ్యులు ప్రజాసంబంధమైన అంశాలను చర్చించకుండా అడ్డుకుంటున్నారంటూ వెంకయ్యనాయుడు అసహనం వ్యక్తం చేశారు. కరోనా టీకాలు, నిరుద్యోగిత, విద్యాసమస్యలు, పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపు, దక్షిణాఫ్రికాలో భారతీయులపై దాడులు, పత్రికా స్వేచ్ఛ, కావేరీ జలాల పంపిణీ వంటి పలు అంశాలు చర్చకు రాకుండా ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయన్నారు. సభ ఐదుమార్లు వాయిదా పడింది. సాయంత్రమైనా సాగని సభ రాజ్యసభ సాయంత్రం సమావేశమైన తర్వాత వెల్‌లో నిరసన తెలుపుతున్న విపక్ష సభ్యులు తమ తమ సీట్లకు వెళ్లారు. నావిగేషన్ బిల్లుపై చర్చ ఆరంభం కాగానే తిరిగి సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. రూల్ 267 కింద చర్చకు అనుమతించాలని ఖర్గే డిమాండ్ చేశారు. పెగసస్ విషయమై ఐటీ మంత్రి ఇప్పటికే సమాధానమిచ్చారని మరో మంత్రి అబ్బాస్ నఖ్వీ గుర్తు చేశారు. ప్రభుత్వం సభా కార్యకలాపాలు సాగేందుకు వీలుగా సభ్యుల అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని ఆర్జేడీ విమర్శించింది. అయితే విపక్ష నేతలను తాము సంప్రదించామని, కానీ వారిలో వారికే ఏకాభిప్రాయం రాలేదని లీడర్ ఆఫ్ హౌస్ పీయూష్ గోయల్ తెలిపారు. సభా నియమాల ప్రకారం ప్రధాని, విపక్ష నేత ప్రసంగించే సమయంలో ఎవరూ అడ్డుకోకూడదని, కానీ విపక్ష నేత ఖర్గే ప్రసంగాన్ని ఒకమంత్రి అడ్డుకున్నారని డీఎంకే విమర్శించింది. ఈ వాదోపవాదాల మధ్య సభ మంగళవారానికి వాయిదా పడింది. లోక్‌సభలో అదే ధోరణి రాజ్యసభలో కార్గిల్ వీరులకు నివాళులు అర్పించారు. అనంతరం పెగసస్‌పై చర్చించాలని విపక్షాలు సభను అడ్డుకున్నాయి. ప్రధాని వచ్చి సభకు సమాధానమివ్వాలని సభ్యులు డిమాండ్ చేశారు. మోదీ సర్కార్ జవాబ్‌దో(మోదీ ప్రభుత్వమా, సమాధానమివ్వు) అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం సమాధానమిచ్చేందుకు రెడీగా ఉందని, అందుకు ముందుగా సభ్యులు తమ సీట్లకు వెళ్లాలని స్పీకర్ కోరారు. సభ్యులు వినకపోవడంతో సభ వాయిదా పడింది. అనంతరం సమావేశమవగానే ప్రభుత్వం రెండు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టింది. ఫ్యాక్టరింగ్ నియంత్రణ బిల్లు, ఎన్ఐఎఫ్టీఈఎం బిల్లులను సంబంధిత మంత్రులు సభలో ప్రవేశపెట్టారు. అయితే వీటిపై చర్చకు విపక్ష సభ్యులు అంగీకరించకుండా వెల్‌లో నిరసనలు కొనసాగించారు. కొందరు రైతు చట్టాలకు వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శించారు. సభ్యులు చర్చలో పాల్గొనాలని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి జోషీ పలుమార్లు విజ్ఞప్తి చేశారు. లోకసభ స్పీకర్ స్థానంలో ఉన్న రమాదేవి సైతం సభాకార్యకలాపాలు కొనసాగించేందుకు సహకరించాలని సభ్యులను కోరారు. అయినా పరిస్థితి మారలేదు. నిరసనలు ఆగకపోవడంతో చర్చలేకుండానే బిల్లులు ఆమోదం పొందినట్లు రమాదేవి ప్రకటించారు. మధ్యాహ్న సమయంలో ఆర్థికమంత్రి దివాలా చట్ట సవరణ బిల్లును సభ ముందుంచారు. దీనిపై చర్చ జరగలేదు. అనంతరం సభ తర్వాతి రోజుకు వాయిదా పడింది. రెండు బిల్లులకు ఆమోదం నిరసనల మధ్య లోక్‌సభలో రెండు బిల్లులు ఆమోదం పొందాయి. ఫ్యాక్టరింగ్ నియంత్రణ సవరణ చట్టం 2020ని ఆర్థిక మంత్రి నిర్మల ప్రవేశపెట్టారు. ఎంఎస్ఎంఈ రంగానికి చేయూతనిచ్చేందుకు ఈ సవరణలు తెచ్చామన్నారు. ఫ్యాక్టరింగ్ చట్టానికి తాజా సవరణలు చేశారు. బిల్లుపై స్టాండింగ్ కమిటీ సూచనలు సైతం ప్రభుత్వం అంగీకరించిందని నిర్మల చెప్పారు. ఎంఎస్ఎంఈ సంస్థలకు మరింత మూలధనం దొరికేందుకు ఈ బిల్లు వీలు కల్పించనుంది. గతేడాది సెప్టెంబర్‌లో ఈ బిల్లును లోక్‌సభ తొలుత ముందుకు తెచ్చారు. అనంతరం నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ ఫుడ్‌టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, మేనేజ్మెంట్ బిల్ 2021ను సైతం లోక్‌సభ ముందుకు ప్రభుత్వం తెచ్చింది. కొన్ని కీలక ఫుట్టెక్నాలజీ సంస్థలను జాతీయంగా కీలక సంస్థలుగా ప్రకటించడంతో పాటు, ఆయా రంగాల్లో ప్రయోగాలకు సంబం« దించిన వివరాలు ఈ బిల్లులో పొందుపరిచారు. రాజ్యసభలో ఈ బిల్లుకు మార్చిలోనే ఆమోదం లభించింది. విపక్షాల నిరసనతో చర్చలేకుండానే రెండు బిల్లులు మూజువాణి ఓటుతో ఆమోదం పొందాయి. కార్గిల్ వీరులకు నివాళి కార్గిల్ వీరులకు పార్లమెంట్ ఉభయసభలు ఘనంగా నివాళులు అర్పించాయి. కార్గిల్ విజయ్ దివస్ 22వ వార్షికోత్సవం సందర్భంగా 1999 కార్గిల్ యుద్ధంలో అమరులైన వీరులకు శ్రద్ధాంజలి ఘటించాయి. ‘‘22 సంవత్సరాల క్రితం ఇదే రోజు మన సాహసిక సైనికులు దేశంలో కొంత భూభాగాన్ని ఆక్రమించిన శత్రుమూకను ఓడించాయి. కార్గిల్ హైట్స్‌ను తిరిగి సాధించి దేశానికి గర్వించే విజయాన్ని అందించాయి’’అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజ్యసభలో నివాళులు అర్పించారు. భారత జవానుల సాహసాన్ని, త్యాగాన్ని ఆయన కీర్తించారు. అనంతరం సభ్యులు మౌనంగా నిలబడి వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన మీరాబాయ్ చానును సభ అభినందించింది. అద్భుత ప్రదర్శనతో చాను వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకం కోసం 21 సంవత్సరాల నిరీక్షణకు తెరదించిందని వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. లోక్‌సభ సభ్యులు సైతం కార్గిల్ వీరులకు నివాళులు అర్పించడంతో పాటు చానును అభినందించారు. రాజ్యసభలో మాట్లాడుతున్న ఖర్గే -
ప్రపంచమే హాయిగా నిద్రపోతోంది
జెరూసలేం: పెగసస్ స్పైవేర్ వివాదస్పదం కావడంతో ఆ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన ఇజ్రాయెల్‌కు చెందిన కంపెనీ ఎన్ఎస్ఒ గ్రూపు దానిని పూర్తిగా సమర్థించింది. ఇలాంటి నిఘా సాఫ్ట్వేర్లు ఇంటెలిజెన్స్, పోలీసుల చేతుల్లో ఉండడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హాయిగా నిద్రపోతున్నారని, రాత్రి వేళల్లో నిర్భయంగా రోడ్లపై తిరుగుతున్నారని పేర్కొంది. ఒక్కసారి ప్రభుత్వ సంస్థలకి ఆ టెక్నాలజీని విక్రయించిన తర్వాత దానిని తాము ఆపరేట్ చేయబోమని, అంతేకాదు తమ క్లయింట్లు సేకరించిన డేటాతో తమకు యాక్సెస్ కూడా ఉండదని ఆ సంస్థ స్పష్టం చేసింది. భారత్ సహా ప్రపంచంలోని వివిధ దేశాల ప్రభుత్వాలు పెగసస్ ద్వారా రాజకీయ నేతలు, మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేసి నిఘా పెట్టారని మీడియాలో కథనాలు వచ్చి ఈ మొత్తం వ్యవహారం వివాదాస్పదం కావడంతో ఎన్ఎస్ఒ గ్రూపు స్పందించింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హాయిగా రాత్రిళ్లు నిద్రపోతున్నారంటే, పూర్తి స్థాయి రక్షణ కవచం మధ్య రాత్రిళ్లు రోడ్లపై తిరుగుతున్నారంటే పెగసస్ వంటి సాంకేతిక పరిజ్ఞానానికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. నేరాలు–ఘోరాలు, ఉగ్రవాద కార్యకలాపాలు వంటివి నిరోధించడంలో భద్రతా వ్యవస్థకి ఇలాంటి సాఫ్ట్వేర్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి’’ అని ఆ కంపెనీ అధికారి ప్రతినిధి పేర్కొన్నారు. ప్రపంచం మరింత సురక్షితంగా, ఉగ్రవాదం బెడద లేకుండా భద్రంగా ఉండడానికే తాము పెగసస్ వంటి స్పైవేర్లు రూపొందిస్తున్నామని చెప్పారు. ఎందరో ఉగ్రవాదుల కుట్రల్ని భగ్నం చేయడానికి ఉపయోగపడిన ఈ సాఫ్ట్‌వేర్‌ని దుర్వినియోగం చేయడం సరైన పని కాదని ఆ సంస్థ పేర్కొంది. పౌర సమాజంపై నిఘా ఆందోళనకరం: అమెరికా పౌరసమాజంపైనా, ప్రభుత్వాన్ని విమర్శించే వారిపైన పెగసస్ వంటి నిఘా సాఫ్ట్వేర్లు ప్రయోగించడం అత్యంత ఆందోళన కలిగించే అంశమని అమెరికా అభిప్రాయపడింది. మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు, విపక్ష నేతలు, సమాజంలోని ఇతరుల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. భారత్‌లో మొత్తం 300 ఫోన్ నంబర్లని ట్యాప్ చేయడానికి పెగసస్‌ని వాడారని, వీరిలో జర్నలిస్టులు, విపక్ష నాయకులు, సిట్టింగ్ న్యాయమూర్తులు, పారిశ్రామికవేత్తలు, సామాజిక కార్యకర్తలు ఉన్నట్టుగా అంతర్జాతీయ మీడియా ప్రసారం చేసిన కథనాలపై అమెరికా సౌత్ అండ్ సెంట్రల్ ఆసియన్ అఫైర్స్ తాత్కాలిక సహాయమంత్రి డీన్ థాంప్సన్ స్పందించారు. ఇదంతా భారత ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడమేనని వ్యాఖ్యానించారు. -
సక్రమ ట్యాపింగ్ నేరం కాదు
ఫిర్యాదుదారు వాంగ్మూలం, ఇతరుల వాంగ్మూలాలు, మౌఖిక సాక్ష్యాలు పరిస్థితుల సాక్ష్యాలు, నగదు మూట, నగదు వనరులు, మోసిన వారు, తీసిన వారు, సీసీ కెమెరాల ఫుటేజీ ఇవన్నీ కలిస్తే నేరం రుజువు చేయడం అసాధ్యం కాదు. నేను నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, కోట్లలో ఇస్తాను. నీ ఓటు ఫలానా వాడికే ఇవ్వు అని చెప్పడం లంచం తీసుకోవడమనే నేరాన్ని ప్రేరేపించడం అవుతుంది. ఫలానా వారు ఈ నేరం చేయవచ్చు, మిగిలిన వారెవరూ చేయడానికి వీల్లేదని చట్టంలో రాజ్యాంగంలో మినహా యింపులేవీ లేవు. పరోక్షంగా కూడా లేవు. ఆ ఇల్లు తగలబెట్టు అని చెప్పే వాక్ స్వాతంత్య్రాన్ని ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య రాజ్యాంగం కూడా ఇవ్వలేదు. ప్రైవసీ అంటే ఏమిటో నిర్వచించే ఎన్ని తీర్పులు సుప్రీం కోర్టు వివరించినా శ్రీశ్రీ కన్నగొప్పగా చెప్పలేదు. ‘ఎవరెవరి ప్రైవేటు జీవితాలు వారి వారి సొంతం, పబ్లిక్‌గా ఉంటే ఏమై నా అంటాం, అంటాం టాం టాం, టాం టాం.’ ప్రైవసీ అంటే ఎవరి బతుకు వారు బతికే అవకాశం ఉండడం. ఇది సంవిధా నంలోని అధికరణం 21లో ప్రకటించిన జీవన హక్కులో అంత ర్భాగమైన పౌర అధికారం అని సుప్రీంకోర్టు విశదీకరించింది. టెలిఫోన్ సంభాషణలు రహస్యంగా వినడాన్ని ట్యాపింగ్ అని అంటున్నారు. గోడ చెవులన్నమాట. గోడ చెవిగాళ్లు సొంతబ తుకు హక్కుకు తూట్లు పొడిచేవారు. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం 1885 అనే ఒక పాత బ్రిటిష్ వారి చట్టం మనం స్వతంత్ర భారతదేశంలో అమలు చేసుకుం టున్నాం. అందులో సెక్షన్ 5(2) ఫోన్ రహస్యాలు వినే విధా నాన్ని వివరిస్త్తున్నది. దేశ భద్రత, సార్వభౌమాధికారం, ప్రజా రక్షణ, పబ్లిక్ ఆర్డర్, విదేశీ స్నేహసంబంధాలు కాపాడడానికి లేదా ఒక నేరాన్ని ప్రేరేపించడాన్ని నివారించడానికి గాను ఫోన్ తీగలకు చెవులు పెట్టవచ్చుననీ, అందుకు సంబంధిత రాష్ర్ట లేదా కేంద్ర ప్రభుత్వ అధికారి సహేతుకమైన అనుమతి ఉండ డం అవసరమనీ వివరించిందీ సెక్షన్. రాజ్యాంగం 1950లో వచ్చిన తరువాత వ్యక్తిగతంగా మాట్లాడుకునే స్వేచ్ఛ భావ స్వేచ్ఛలో భాగమని ఆర్టికల్ 19(1) (ఎ)లో ప్రకటించారు. దానికి దేశభద్రత, విదేశీ స్నేహ సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్ రక్షణ, నేర ప్రేరకాల నివారణ, ప్రజావసరాల ఎమర్జెన్సీ, ప్రజా భద్రతావసరం భావప్రకటన స్వేచ్ఛపై పరిమితులు, టెలిగ్రాఫ్ చట్టం, ఆర్టికల్ 19, కలిపి చదివితే అర్థమయ్యేదే మంటే, ప్రైవసీని, మాట్లాడే స్వేచ్ఛను నేరాలు చేయమని మరొకరిని ప్రోత్సహించడానికి వాడకూడదని. టెలిగ్రాఫ్ సవరణ చట్టం 1971, సెక్షన్ 7(2)(బి)లో టెలి ఫోన్ సందేశాలను సంభాషణలను చాటుగా వినేందుకు, వెల్ల డిచేసేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేసే నియ మాలను చేసే అధికారాన్ని ప్రభుత్వానికి ఇస్తూ చట్టం సవరిం చారు. కేంద్రప్రభుత్వం ఈ నియమాలు చేయాలి. పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్, పీయూసీ సి ఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (ఏఐఆర్ 1997 ఎస్ సి 597)లో సుప్రీంకోర్టు... ఫోన్లో మాటలు చాటుగా విన డం రికార్డు చేయడం వ్యక్తి ప్రైవసీ హక్కుకు ఉల్లంఘన అవు తుందని, కనుక ఆ విధంగా వినే ఉత్తర్వులు జారీ చేసే అధికా రాన్ని సక్రమంగా వినియోగించేందుకు మార్గదర్శకాలు ఉండి తీరాలని తీర్మానించి ఆ మార్గదర్శకాలు ఏ విధంగా ఉండాలో వివరించింది. వాటికి లోబడి ప్రభుత్వం నియమాలు చేయవ లసి ఉంది. కేంద్రంలో, రాష్ట్రాల్లో హోం కార్యదర్శులు మాత్ర మే దూరభాషిణీ రహస్య శ్రవణాదేశాలను జారీ చేయవచ్చని సమున్నత న్యాయస్థానం ఆదేశించింది. సక్రమంగా రికార్డు చేసిన ఫోన్ మాటలు, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు, కెమెరా దృశ్యాలను సాక్ష్యాలుగా అనుమతించేం దుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 ద్వారా భారత సాక్ష్య చట్టాన్ని సవరించారు. పత్రాల సాక్ష్యంతో సమానంగా ఈ సాక్ష్యాలకు కూడా బలం ఉంటుంది. అయితే సందర్భాన్ని బట్టి కేసులను బట్టి ఆ సాక్ష్యానికి ఎంత విలువ ఇవ్వాలనే విషయం న్యాయాధికారి విచక్షణపై ఆధారపడి ఉంటుంది. ఎస్. ప్రతాప్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు (19644.C.R.733)లో ముఖ్యమంత్రి భార్యకు ఒక డాక్టరుకు మధ్య జరిగిన సంభా షణ ఫోన్ రికార్డును బట్టి వారి మధ్య ఆ మాటలు నడిచాయని కోర్టు సాక్ష్యంగా ఆమోదించింది. యూసుఫ్ ఆలీ ఇస్మాయిల్ నాగరీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ర్ట ఏఐఆర్ 1968 సుప్రీం కోర్టు 147 కేసులో ఒక అధికారికి యూసుఫ్ ఆలీ లంచం ఇవ్వ జూపాడు. అతను తీసుకోలేదు. పోలీసులకు ఆ అధికారి ఫిర్యా దు చేశాడు. యూసుఫ్ ఆలీని తన ఇంటికి రమ్మన్నాడు ఆ అధి కారి. అక్కడికి యూసుఫ్ ఆలీ వచ్చి లంచం ఇస్త్తుండగా ట్రాప్ చేశారు. గదిలో వాళ్లిద్దరే ఉన్నారు. ఆ గదిలో ఒక మైక్రోఫోన్‌ను దాచారు. పక్కగదిలో ఒక రేడియో మెకానిక్ పోలీసు అధికా రులు కూర్చుని రహస్యంగా వారి సంభాషణను రికార్డు చేశా రు. ఫిర్యాదు చేసిన అధికారి ఒక్కరే లంచం ఇచ్చే నేరానికి ప్రత్యక్ష సాక్షి. యూసుఫ్ ఆలీకి ఈ సాక్ష్యాల ఆధారంగా లం చం నేరానికి శిక్ష పడింది. లంచం ఇచ్చే కార్యం చుట్టూ అల్లు కున్న సంభాషణ సాక్ష్య చట్టం సెక్షన్ 8 కింది ‘రెస్ జెస్టే’ అవు తుంది. అధికారి ఫిర్యాదు వాంగ్మూలాలకు, ఈ మాటల ధ్వను లున్న టేప్ రికార్డు బలపరిచే సాక్ష్యం అవుతుంది. ఫొటోగ్రాఫ్ వలె అది కూడా ఆ పరిస్థితిని బలపరుస్త్తుందని సుప్రీంకోర్టు వివరించింది. ఈ విధంగా బలీయమైన సాక్ష్యం కావడానికి ఇది ఎప్పుడు ఎక్కడ రికార్డయిందో రుజువు చేయవలసి ఉం టుంది. మాగ్నటిక్ టేప్పైన రికార్డు చేసిన మాటలను తొల గించి మళ్లీ రికార్డు చేసే వీలుంది కనుక, ఆ విధంగా జర గలేదని శాస్త్రీయంగా రుజువు చేయడం కూడా మరొక అవ సరం. ఈ రెండూ రుజువైతే రికార్డు తిరుగులేని సాక్ష్యం అవు తుందని సుప్రీంకోర్టు ఈ కేసులో తేల్చి చెప్పింది. రేవంత్‌రెడ్డి కేసులో ఫోన్ ట్యాపింగ్ జరిగితే అందుకు తగిన ఉత్తర్వులు ఉన్నాయని తేలడం అవసరం. సక్రమంగా ప్రక్రియను పాటిస్తే ఆ ట్యాపింగ్ ద్వారా వచ్చిన వివరాలు సాక్ష్యాలు అవుతాయి. ఫోన్ రికార్డింగ్ సాక్ష్యాలు, కెమెరాలు తీసిన వీడియో రికార్డింగ్‌లు రికార్డయిన స్థలం, సమయం తది తర వివరాలు రుజువైతే, ఇవి కత్తిరించి అతికించినవి కావని మొదటి రికార్డింగ్ వలెనే ఉన్నాయని శాస్త్రీయమైన (ఫోరె న్సిక్) రుజువులు ఉంటే బలీయమైన సాక్ష్యాలు అయ్యే అవ కాశం ఉంది. కాల రికార్డు వివరాలు, ఫిర్యాదుదారు వాం గ్మూలం, ఇతరుల వాంగ్మూలాలు, మౌఖిక సాక్ష్యాలు పరిస్థి తుల సాక్ష్యాలు, నగదు మూట, నగదు వనరులు, మోసిన వారు, తీసిన వారు, సీసీ కెమెరాల ఫుటేజీ ఇవన్నీ కలిస్తే నేరం రుజువు చేయడం అసాధ్యం కాదు. (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్) professorsridhar@gmail.com - మాడభూషి శ్రీధర్