Tarakarama Sagar Project
-
ఆయనది చెరగని సంతకం
సాక్షి, మైలవరం : ఆరోగ్యశ్రీతో ఉచితంగా వైద్యసాయం పొందిన పేదవాడి కుటుంబంలో ఆనందం.. డెల్టా ఆధునికీకరణతో అన్నదాత కళ్లలో వెలుగు.. పావలావడ్డీ రుణాలు పొందిన మహిళ మోములో చిరునవ్వు.. రీయింబర్స్‌మెంట్‌లో ఉచితంగా ఉన్నత విద్యాఫలాలు అందుకున్న విద్యార్థుల్లో నమ్మకం.. ఇవీ రాజన్న రాజ్యంలో చెరగని సంతకాలు. జిల్లావాసులు ఆ రోజులను గుర్తు చేసుకుంటున్నారు. సంక్షేమమే అజెండాగా అభివృద్ధి ఫలాలను అందజేసిన మహానేతను మననం చేసుకుంటున్నారు. చెప్పినవీ.. చెప్పనివి కూడా చేసి చూపించిన ఆ విశ్వసనీయతను తలచుకుంటున్నారు. ఆ రోజులు మళ్లీ రావాలని కోరుకుంటున్నారు. సాగుకు భరోసా.. మైలవరం నియోజకవర్గంలోని రైతులకు సాగునీరందించడంతో పాటు తాగునీటి సమస్య పరిష్కారానికి వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. అప్పటికే కృష్ణాజలాలు ఇబ్రహీంపట్నం నుంచి జి.కొండూరు వరకు అందించేందుకు గత ప్రభుత్వం మొదటి దశ పనులను పూర్తి చేసింది. కానీ మైలవరం, రెడ్డిగూడెం మండలాలకు కూడా తాగునీరు అందించాలనే లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.5 కోట్లు కేటాయించి రెండోదశ పనులను పూర్తి చేశారు. కృష్ణావాటర్పైపులైను రెండోదశ పనులతో పాటు తారకరామ ఎత్తిపోతల రెండోదశ పనుల పూర్తి చేసి 2006 మే 10న ముఖ్యమంత్రి హోదాలో వైఎస్సార్ ప్రారంభించారు. పోలవరం కాలువ మళ్లింపు వెఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా పోలవరం కుడికాల్వ తవ్వకం చేస్తున్న సందర్భంలో కాలువకు చివరి భాగంలో ఉన్న వెలగలేరు గ్రామాన్ని అనుకొని తవ్వ వలసి ఉంది. అయితే కాలువను గ్రామానికి అనుకొని తవ్వడంతో గ్రామానికి ఒక వైపు బుడమేరు, రెండో వైపు పోలవరం కాల్వ ఉంటే వరదల వచ్చిన సమయంలో గ్రామం ముంపునకు గురవుతుందని అప్పటి నియోజకవర్గ ఎమ్మెల్యే చనమోలు వెంకట్రావు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. చనమోలు అడిగిందే తడువుగా కాలువ రూట్‌మ్యాప్‌ను మార్చి వెలగలేరు గ్రామానికి తూర్పువైపుగా కాలువను తవ్వించి బుడమేరులో కలిపారు. వైఎస్సార్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికీ మరవలేమని వెలగలేరు గ్రామ ప్రజలు అంటున్నారు. తారకరామతో రైతులకు సాగనీరు మైలవరం నియోజకవర్గానికి తలమానికమైన తారకరామ ఎత్తిపోతల పథకం రెండోదశ పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరందించిన ఘనత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిది. తారకరామ ఎత్తపోతల పథకాన్ని నిర్మించడానికి అధికారులు మూడు దశలుగా విభజించారు. మొదటి దశలో ఇబ్రహీంపట్నం,జి కొండూరు, విజయవాడరూరల్ మండలాల పరిధిలోని 12,556 ఎకరాలకు నీరందించడం లక్ష్యం. మొదటి దశ పనులు అప్పటి మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే,వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాదీశ్వరరావు ఆధ్వర్యంలో 2004 నాటికి పూర్తయ్యాయి. వెలగలేరు గ్రామానికి తూర్పువైపుగా దారిమళ్లించి తవ్వించిన పోలవరం కుడి కాల్వ రెండవ దశలో జి.కొండూరు మండలంలోని 8గ్రామాలకు చెందిన 4,242ఎకరాలకు నీరందించడం లక్ష్యం.దీనికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సారధ్యంలో 10–05–2006న పనులు ప్రారంభించి 2009కల్లా పూర్తి చేసి రైతులకు సాగునీరందించారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాంతరం రాజకీయాలలో సంచలన మార్పులు కారణంగా మూడో దశ పనులు నిలిచిపోయాయి. రైతు బాంధవుడు వైఎస్సార్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లనే తారకరామా ఎత్తిపోతల పథకం రెండవదశ పనులు పూర్తయ్యాయి. దీంతో రైతులకు సాగునీరు అందింది. ఆయన బతికి ఉంటే మూడో దశ పనుల కూడా పూరై్త నియోజకవర్గం సస్యశ్యామలమయ్యేది. కృష్ణా జలాలను మైలవరానికి అందించిన ఘనత కూడా వైఎస్సార్‌దే. వైఎస్సార్ హయాంలో రైతులకు సాగునీరు పుష్కలంగా అందింది. నాలుగున్నరేళ్లుగా రైతులు సాగునీరు లేక అల్లాడిపోతున్నారు. జలవనరులశాఖా మంత్రిగా ఉండి కూడా దేవినేని ఉమా తన సొంత నియోజకవర్గంలో ఉన్న తారకరామను నిర్వీర్యం చేశారు. కృష్ణా జలాలను అందించడంలో దేవినేని విఫలమయ్యారు. -పామర్తి వెంకటనారాయణ, రైతు, కుంటముక్కల -
తారకరామ సాగర్ మాటేమిటి?
విజయనగరం కలెక్టరేట్/భోగాపురం, న్యూస్‌లైన్: సాగు, తాగునీటి అవసరాలను తీర్చే తారకరామతీర్థ సాగర్ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సమైక్య శంఖారావంలో భాగంగా ఆదివారం భోగాపురం వచ్చిన జగన్మోహన్రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ముందుగా ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ సుజయ్ కృష్ణరంగారావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు, పార్టీ సీజీసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు, నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సురేష్‌బాబు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం మహాత్మాగాంధీ, మహానేత వైఎస్‌రాజశేఖర్ రెడ్డిల విగ్రహాలకు జగన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చే ప్రాజెక్టులను సైతం పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నాలుగు నెలలు ఓపిక పడితే కష్టాలన్నీ తొలగిపోతాయని భరోసా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో కిరణ్, చంద్రబాబు, సోనియాలకు బుద్ధి వచ్చేలా తీర్పు చెప్పాలని పిలుపునిచ్చారు. సమైక్య రాష్ట్రంతో పాటు రైతులు, విద్యార్థుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తామన్నారు. సమైక్యాంధ్ర కోసం చిత్తశుద్ధితో పోరాటం చేసిన వారికే పట్టం కట్టాలన్నారు. సినీ నటుడు విజయచందర్ మాట్లాడుతూ ప్రజల కోసం, రాష్ట్ర సమైక్యతను కాపాడటానికి పోరాటం చేస్తున్న ఏకైక నాయకుడు జగన్మోహన్రెడ్డి అని అన్నారు. కార్యక్రమంలో సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, అరుకు పార్లమెంటరీ పరీశీలకులు బేబీనాయన, కొత్తపల్లి గీత, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు, అవనాపు విజయ్, గురానఅయ్యలు, కడుబండి శ్రీనివాసరావు, జమ్మాన ప్రసన్నకుమార్, మీసాల వరహాలనాయుడు, శనపతి సిమ్మినాయుడు, వేచలపు చినరామినాయుడు, బోకం శ్రీనివాసరావు, డాక్టర్ గేదెల తిరుపతి, జిల్లా నాయకులు గొర్లె వెంకటరమణ, గులిపల్లి సుదర్శనరావు, డి.శంకరసీతారామరాజు, మక్కువ శ్రీధర్, ఆదాడ మోహనరావు, బొత్స కాశీనాయుడు, యల్లపు దమయంతిదేవి, కోళ్ల గంగాభవాని, గండికోట శాంతి, తుమ్మగంటి సూరినాయుడు, చిక్కాల సాంబశివరావు, రమేష్‌బాబు, రావాడబాబు, మలుకుర్తి శ్రీనివాసరావు, దారపు లక్ష్మణరెడ్డి, వరిపూడి సుధాకర్, అనుబంధ కమిటీల నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. అలాగే విశాఖ అర్బన్ కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్‌యాదవ్, జి.వి.రవిరాజ్, విశాఖ రూరల్ మహిళా విభాగం అధ్యక్షురాలు పీలా వెంకటలక్ష్మి, కొయ్యి ప్రసాద్ రెడ్డి, కోరాడ రాజబాబు, సత్తు రామకృష్ణారెడ్డి, చంటిరాజు, సుబ్బరాజు, అచ్యుతరామరాజు హాజరయ్యూరు.