తారకరామ సాగర్ మాటేమిటి?
తారకరామ సాగర్ మాటేమిటి?
Published Mon, Feb 10 2014 3:00 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM
విజయనగరం కలెక్టరేట్/భోగాపురం, న్యూస్‌లైన్: సాగు, తాగునీటి అవసరాలను తీర్చే తారకరామతీర్థ సాగర్ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సమైక్య శంఖారావంలో భాగంగా ఆదివారం భోగాపురం వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ముందుగా ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ సుజయ్ కృష్ణరంగారావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు, పార్టీ సీజీసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు, నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సురేష్‌బాబు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం మహాత్మాగాంధీ, మహానేత వైఎస్‌రాజశేఖర్ రెడ్డిల విగ్రహాలకు జగన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చే ప్రాజెక్టులను సైతం పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నాలుగు నెలలు ఓపిక పడితే కష్టాలన్నీ తొలగిపోతాయని భరోసా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో కిరణ్, చంద్రబాబు, సోనియాలకు బుద్ధి వచ్చేలా తీర్పు చెప్పాలని పిలుపునిచ్చారు. సమైక్య రాష్ట్రంతో పాటు రైతులు, విద్యార్థుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తామన్నారు. సమైక్యాంధ్ర కోసం చిత్తశుద్ధితో పోరాటం చేసిన వారికే పట్టం కట్టాలన్నారు. సినీ నటుడు విజయచందర్ మాట్లాడుతూ ప్రజల కోసం, రాష్ట్ర సమైక్యతను కాపాడటానికి పోరాటం చేస్తున్న ఏకైక నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. కార్యక్రమంలో సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర,
అరుకు పార్లమెంటరీ పరీశీలకులు బేబీనాయన, కొత్తపల్లి గీత, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు, అవనాపు విజయ్, గురానఅయ్యలు, కడుబండి శ్రీనివాసరావు, జమ్మాన ప్రసన్నకుమార్, మీసాల వరహాలనాయుడు, శనపతి సిమ్మినాయుడు, వేచలపు చినరామినాయుడు, బోకం శ్రీనివాసరావు, డాక్టర్ గేదెల తిరుపతి, జిల్లా నాయకులు గొర్లె వెంకటరమణ, గులిపల్లి సుదర్శనరావు, డి.శంకరసీతారామరాజు, మక్కువ శ్రీధర్, ఆదాడ మోహనరావు, బొత్స కాశీనాయుడు, యల్లపు దమయంతిదేవి, కోళ్ల గంగాభవాని, గండికోట శాంతి, తుమ్మగంటి సూరినాయుడు, చిక్కాల సాంబశివరావు, రమేష్‌బాబు, రావాడబాబు, మలుకుర్తి శ్రీనివాసరావు, దారపు లక్ష్మణరెడ్డి, వరిపూడి సుధాకర్, అనుబంధ కమిటీల నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. అలాగే విశాఖ అర్బన్ కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్‌యాదవ్, జి.వి.రవిరాజ్, విశాఖ రూరల్ మహిళా విభాగం అధ్యక్షురాలు పీలా వెంకటలక్ష్మి, కొయ్యి ప్రసాద్ రెడ్డి, కోరాడ రాజబాబు, సత్తు రామకృష్ణారెడ్డి, చంటిరాజు, సుబ్బరాజు, అచ్యుతరామరాజు హాజరయ్యూరు.
Advertisement