వైఫై సౌకర్యంతో టాటా ఫొటాన్ వాకీ...
టాటా వాకీ గుర్తుందా? ల్యాండ్లైన్ల జమానాలో లేటెస్ట్ ఎంట్రీగా వచ్చిన ఈ ఫోన్ ఇప్పుడు కొత్త రూపం సంతరించుకుంది. వైర్లెస్ ఫోన్‌గా మాత్రమే కాకుండా వైఫై ద్వారా కనీసం ఐదు గాడ్జెట్స్‌కు ఇంటర్నెట్ సిగ్నల్స్ ఇవ్వగల సాధనంగా మారింది. టాటా టెలిసర్వీసెస్ ఇటీవలే విడుదల చేసిన ఈ టాటా ఫొటాన్ వాకీ వైఫై హాట్‌స్పాట్‌గానూ పనిచేస్తుంది. వైఫై కీ ఒకదాన్ని ఆన్ చేయడంతోనే వైఫై సేవలు పొందే అవకాశముండటం విశేషం. కుటుంబం మొత్తం ప్రయాణిస్తున్నప్పుడు ఎక్కడైనా వైఫై సౌకర్యం పొందేందుకు ఇది ఎంతో ఉపయోగకరమని కంపెనీ అంటోంది. ధర, డేటా ప్లాన్ల కోసం కంపెనీ వెబ్‌సైట్‌ను సందర్శించండి.