తేజిందర్ సింగ్ అరెస్ట్‌కు రంగం సిద్ధం
న్యూఢిల్లీ: భారత మాజీ సైనికాధికారి లెఫ్టినెంట్ జనరల్ తేజిందర్ సింగ్‌కు కోర్టులో చుక్కెదురైంది. టట్రా ట్రక్ కొనుగోలు కుంభకోణంలో తేజిందర్ సింగ్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.
టట్రా ట్రక్ కొనుగోలు ఒప్పందంలో మాజీ సైనికాధికారి జనరల్ వీకే సింగ్‌కు తేజిందర్ లంచ ఇవ్వచూపారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో తేజిందర్ సింగ్‌ను పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది.