Tax demands
-
కట్టండి రూ.803 కోట్లు.. జొమాటోకు జీఎస్టీ దెబ్బ!
ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటోకు (Zomato) జీఎస్టీ (GST) విభాగం నుంచి గట్టి దెబ్బ తగిలింది. వడ్డీ, జరిమానాతో సహా రూ.803.4 కోట్ల పన్ను చెల్లించాలని థానేలోని జీఎస్టీ విభాగం ఆదేశించింది. డెలివరీ ఛార్జీలపై వడ్డీ,పెనాల్టీతో జీఎస్టీని చెల్లించని కారణం చూపుతూ పన్ను నోటీసు వచ్చినట్లు జొమాటో రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది."కంపెనీకి 2019 అక్టోబర్ 29 నుండి 2022 మార్చి 31 కాలానికి సంబంధించి 2024 డిసెంబర్ 12న ఒక ఆర్డర్ అందింది. రూ.4,01,70,14,706 జీఎస్టీతోపాటు వడ్డీ, పెనాల్టీ మరో రూ. 4,01,70,14,706 చెల్లించాలని సీజీఎస్టీ & సెంట్రల్ ఎక్సైజ్ జాయింట్ కమిషనర్, థానే కమిషనరేట్, మహారాష్ట్ర నుంచి ఆర్డరు జారీ అయింది" జొమాటో పేర్కొంది.అయితే జీఎస్టీ నోటీసులపై అప్పీల్‌కు వెళ్లనున్నట్లు జొమాటో తెలిపింది. దీనిపై తమ న్యాయ, పన్ను సలహాదారులతో సంప్రదించామని, వారి అభిప్రాయాల మేరకు జీఎస్టీ నోటీసులకు వ్యతిరేకంగా సంబంధిత అధికారుల ముందు అప్పీల్ దాఖలు చేస్తామని జొమాటో వివరించింది.సాధారణంగా కస్టమర్ ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు జొమాటో బిల్లులో మూడు అంశాలు ఉంటాయి. వాటిలో ఆహార పదార్థాల ధర ఒకటి కాగా మరొకటి ఫుడ్ డెలివరీ ఛార్జీ. సబ్స్క్రిప్షన్ తీసుకున్నవారికి కంపెనీ దీని నుంచి మినహాయింపు ఇస్తుంది. ఇక మూడోది ఆహారం ధర, ప్లాట్‌ఫామ్ ఫీజుపై విధించే ఐదు శాతం జీఎస్టీ పన్ను. ఇందులో ఫుడ్ డెలివరీ ఛార్జీలపై ట్యాక్స్ చెల్లించడం లేదనేది జీఎస్టీ విభాగం అభియోగం. -
డెల్టా కార్ప్‌కు మరో రూ.6,384 కోట్ల జీఎస్టీ నోటీస్
న్యూఢిల్లీ: డెల్టా కార్ప్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. రూ. 6,384 కోట్ల షార్ట్ పేమెంట్ కోసం ఒక జీఎస్టీ నోటీసును అందుకుంది, దీనితో కంపెనీపై మొత్తం పన్ను డిమాండ్ దాదాపు రూ. 23,000 కోట్లు దాటింది. పన్ను డిమాండ్లు ఏకపక్ష మైనవని, చట్ట విరుద్ధంగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది. వీటిని సవాలు చేయనున్నట్లూ వెల్లడించింది. సంస్థ ప్రకటన ప్రకారం, డీజీజీఐ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్), కోల్‌కతా విభాగం అక్టోబర్ 13న డెల్టా కార్ప్ అనుబంధ సంస్థ అయిన డెల్టాటెక్ గేమింగ్‌కు జీఎస్టీ నోటీసు పంపుతూ, జనవరి 2018 నుండి నవంబర్ 2022 కాలానికి సంబంధించి రూ. 6,236.8 కోట్ల పన్ను చెల్లింపుల డిమాండ్ చేసింది. జూలై 2017 నుండి అక్టోబర్ 2022 వరకు మరో 147.5 కోట్ల రూపాయల పన్ను డిమాండ్ నోటీసునూ అందించింది. రూ. 16,800 కోట్ల షార్ట్ పేమెంట్ నిమ్తి్తం కంపెనీకి గత నెలలో షోకాజ్ నోటీసులు అందుకున్న సంగతి తెలిసిందే. ఆన్లైన్ గేమింగ్ సంస్థలు, కాసినోలు తమ ప్లాట్‌ఫారమ్‌లపై ఉంచిన స్థూల పందెం విలువపై 28 శాతం జీఎస్టీ చెల్లించవలసి ఉంటుందని ఆగస్టులో జీఎస్టీ అత్యున్నత స్థాయి మండలి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కంపెనీకి తాజా జీఎస్టీ నోటీసులు వెలువడ్డం గమనార్హం. చట్ట నిబంధనలకు అనుగుణంగానే ఈ–గేమింగ్ కంపెనీలకు రెట్రాస్పెక్టివ్ ప్రాతిపదికన జీఎస్టీ పన్ను డిమాండ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ ఇటీవల స్పష్టం చేశారు. డేటాను పూర్తిగా విశ్లేషించిన మీదటే పన్ను మొత్తంపై నిర్ధారణకు వస్తున్నట్లు తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఎన్ఎస్ఈలో డెల్టా కార్ప్ షేర్ ధర 9 శాతం పడిపోయి రూ.120కి పడింది. -
బాబోయ్.. నల్లధనంపై రూ.14,820 కోట్ల పన్ను డిమాండ్!
న్యూఢిల్లీ: నల్లధనం చట్టం కింద వెల్లడించని విదేశీ ఆదాయానికి సంబంధించి 368 కేసుల్లో (అసెస్మెంట్ పూర్తయిన తర్వాత) రూ.14,820 కోట్ల పన్ను డిమాండ్ నోటీసుల జారీ అయినట్లు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. నల్లధనంపై పన్ను వసూళ్లకు సంబంధించి 2022 మే 31వ తేదీ వరకూ డేటాపై లోక్‌సభలో ఆమె ఒక లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. హెచ్ఎస్బీసీలో రిపోర్టు (పేర్కొనని) చేయని విదేశీ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లకు సంబంధించిన కేసుల్లో రూ.8,468 కోట్లకు పైగా వెల్లడించని ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చిందని తెలిపారు. దీనికి సంబంధించి రూ.1,294 కోట్లకు పైగా జరిమానా విధించడం జరిగిందని వివరించారు. 30 సెప్టెంబర్ 2015తో ముగిసిన బ్లాక్ మనీ (బహిర్గతం కాని విదేశీ ఆదాయం, ఆస్తులు) ఇంపోజిషన్ ఆఫ్ టాక్స్ యాక్ట్, 2015 కింద ఒన్ టైమ్ సెటిల్మెంట్గా (మూడు నెలల పరిమితితో) 648 కేసులకు సంబంధించి రూ.4,164 కోట్ల విలువైన వెల్లడించని ఆస్తులను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ కేసుల్లో రూ.2,476 కోట్లకుపైగా మొత్తాన్ని పన్నులు, పెనాలిటీ రూపంలో వసూలయినట్లు ఆమె తెలిపారు. భారతీయులు స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన డబ్బుపై అడిగిన ప్రశ్నలకు సీతారామన్ సమాధానం చెబుతూ, ‘‘భారత పౌరులు, కంపెనీలు స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన డబ్బుపై అధికారిక అంచనా లేదు’’ అని ఆర్థికమంత్రి అన్నారు. భారతదేశ నివాసితులు స్విట్జర్లాండ్‌లో కలిగి ఉన్న డిపాజిట్లను విశ్లేషించడానికి స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్ఎన్బీ) వార్షిక బ్యాంకింగ్ స్టాటిస్టిక్స్ సోర్స్‌ను ఉపయోగించరాదని స్విస్ అధికారులు తెలియజేసినట్లు మంత్రి తెలిపారు. స్విట్జర్లాండ్‌లో ఉన్న భారతీయ నివాసితుల డిపాజిట్లను విశ్లేషించడానికి బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్‌కు సెటిల్మెంట్ (బీఐఎస్)కు చెందిన ‘‘లొకేషనల్ బ్యాంకింగ్ స్టాటిస్టిక్స్’’ అని పిలిచే మరొక డేటా సోర్స్‌ను వినియోగించుకోవచ్చని కూడా వారు వెల్లడించినట్లు తెలిపారు. లొకేషనల్ బ్యాంకింగ్ స్టాటిస్టిక్స్ ప్రకారం, 2021లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లలో 8.3 శాతం క్షీణత నమోదయినట్లు మీడియా నివేదికలు తెలుపుతున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. వెల్లడించని విదేశీ ఆస్తులు, ఆదాయాలపై పన్ను విధించేందుకు ప్రభుత్వం ఇటీవలి కాలంలో చేపట్టిన పలు చర్యలను కూడా ఆమె ఈ సందర్భంగా సభకు వివరించారు. -
దేశీయ ఐటీ కంపెనీలకు మరో షాక్
ముంబై : అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాలతో తీవ్ర సతమతమవుతున్న ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలకు తాజాగా ఆదాయపు పన్ను శాఖ నుంచి మరో షాక్ ఎదురైంది. సర్వీసు ట్యాక్స్ డిమాండ్ కింద రూ.10వేల కోట్లను చెల్లించాలంటూ దేశీయ ఐటీ కంపెనీలను ఆదాయపు పన్ను శాఖ ఆదేశించినట్టు తెలిసింది. ఇప్పటికే ఆటోమేషన్ ముప్పు, కఠినతరమవుతున్న అమెరికా ఇమ్రిగేషన్ చట్టాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఐటీ కంపెనీలకు ఇది మరింత ప్రతికూలంగా మారింది. సర్వీసు ట్యాక్స్ కట్టాలంటూ ఇప్పటి వరకు 200 పైగా ఐటీ కంపెనీలకు సర్వీసు ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీసులు జారీచేసినట్టు తెలిసింది. గత ఐదేళ్లకు సంబంధించి ఎగుమతులపై వచ్చిన ప్రయోజనాలకు సర్వీసు పన్ను కట్టాలని పేర్కొంది. అదనంగా 15 శాతం పన్నుతో పాటు జరిమానాలు కూడా కట్టాలంటూ ఆదేశించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఐటీ సంస్థలు ఎగుమతి ప్రయోజనాలకు అర్హులు కావని, కచ్చితంగా సేవా పన్ను కట్టాల్సిందేనని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. ఈ పన్ను డిమాండ్ ఐటీ కంపెనీలకు అతిపెద్ద షాకేనని ఇండస్ట్రీ ట్రాకర్లు కూడా పేర్కొన్నారు. ఒకవేళ ఈ కేసుపై ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తే, పన్ను డిమాండ్‌లో 10 శాతం అక్కడ డిపాజిట్ చేయాల్సి ఉంటుందన్నారు. తమకు ఇది అతిపెద్ద సమస్య అని, రూ.175 కోట్ల పన్ను చెల్లించాలంటూ ఐటీ శాఖ నుంచి ఆదేశాలు జారీ అయినట్టు ఓ బహుళ జాతీయ కంపెనీ చెప్పింది. -
నోకియాకు రూ. 10,000 కోట్ల పన్ను పోటు!
న్యూఢిల్లీ: పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న మొబైల్స్ తయారీ దిగ్గజం నోకియాపై భారీ వడ్డనకు రంగం సిద్ధమవుతోంది. సుమారు రూ. 10,000 కోట్ల పన్ను నోటీసులు జారీ చేసేందుకు ఆదాయ పన్ను శాఖ సిద్ధమవుతోంది. నోకియా కార్పొరేషన్‌కి రూ. 4,560 కోట్లకు, నోకియా ఇండియాకు రూ. 6,008 కోట్లకు నోటీసులు జారీ చేసే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 2006-07 నుంచి 2012-13 మధ్య ఏడేళ్ల అసెస్మెంట్ ఇయర్స్‌కి సంబంధించి అధికారులు ఈ లెక్కలు తయారు చేశారు. అయితే, కంపెనీ ఈ వార్తలపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించింది. మైక్రోసాఫ్ట్‌లో నోకియా విలీనానికి పన్ను వివాదం అడ్డంకిగా మారడం తెలిసిందే. నోకియా రూ. 6,500 కోట్లు కట్టాల్సి వ స్తుందన్న వార్తలురాగా.. రూ. 2,250 కోట్లు జమ చేసేందుకు కంపెనీ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.