నోకియాకు రూ. 10,000 కోట్ల పన్ను పోటు!
న్యూఢిల్లీ: పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న మొబైల్స్ తయారీ దిగ్గజం నోకియాపై భారీ వడ్డనకు రంగం సిద్ధమవుతోంది. సుమారు రూ. 10,000 కోట్ల పన్ను నోటీసులు జారీ చేసేందుకు ఆదాయ పన్ను శాఖ సిద్ధమవుతోంది. నోకియా కార్పొరేషన్‌కి రూ. 4,560 కోట్లకు, నోకియా ఇండియాకు రూ. 6,008 కోట్లకు నోటీసులు జారీ చేసే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 2006-07 నుంచి 2012-13 మధ్య ఏడేళ్ల అసెస్‌మెంట్ ఇయర్స్‌కి సంబంధించి అధికారులు ఈ లెక్కలు తయారు చేశారు. అయితే, కంపెనీ ఈ వార్తలపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించింది. మైక్రోసాఫ్ట్‌లో నోకియా విలీనానికి పన్ను వివాదం అడ్డంకిగా మారడం తెలిసిందే. నోకియా రూ. 6,500 కోట్లు కట్టాల్సి వ స్తుందన్న వార్తలురాగా.. రూ. 2,250 కోట్లు జమ చేసేందుకు కంపెనీ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.